బరువు తగ్గడంలో 'పంచకర్మ' ది బెస్ట్‌..! | Rohit Roy Said How Does Ayurvedic Panchakarma Help In Weight Loss | Sakshi
Sakshi News home page

బరువు తగ్గడంలో 'పంచకర్మ' ది బెస్ట్‌!..అనుభవాన్ని షేర్‌ చేసుకున్న రోహిత్‌ రాయ్‌!

Published Fri, Aug 23 2024 4:27 PM | Last Updated on Fri, Aug 23 2024 4:34 PM

Rohit Roy Said How Does Ayurvedic Panchakarma Help In Weight Loss

బుల్లితెర నటుడు రోహిత్‌ రాయ్‌ అన్‌స్టాపబుల్‌ పోడ్‌కాస్ట్‌లో రోహిత్‌ బోస్‌ రాయ్‌ పలు ఆసక్తికర విషయాలను షేర్‌ చేసుకున్నారు. తనకు మంచి పిట్‌నెస్‌ మెయింటెయిన్‌ చేయడంలో పంచకర్మ ఎలా ఉపయోగపడిందో వెల్లడించారు. పంచకర్మ బరువు తగ్గడంలోనే కాకుండా మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఎలా సహాయపడుతుందో వివరించాడు. ఆయుర్వేదం పద్ధతులన్నీ ఆర్యోప్రయోజనాలతో ముడిపడి ఉన్నాయి. ఆయుర్వేద పంచకర్మ అనేది ప్రాచీన భారతదేశం నుంచి వచ్చిన సాంప్రదాయ నిర్విషీకరణ, పునరుజ్జీవన చికిత్స. ఇది బరువుని తగ్గించడంలో ఎలా సహాయపడుతుందంటే..

రోహిత్‌ బోస్‌ రాయ్‌ 2021లోనే తనకు ఆయుర్వేదం గురించి తెలిసిందన్నారు. తాను కేరళకి వెళ్లినప్పుడే ఆయుర్వేదానికి సంబంధించిన పంచకర్మ గురించి తెలుసుకున్నట్లు వివరించారు. ఆయన జీర్ణ సమస్యలతో కేరళకి వెళ్లినట్లు తెలిపారు. అక్కడ శరీరాన్ని శుభ్రపరచడంతో ఈ పంచకర్మ చికిత్స ప్రారంభమవుతుందని అన్నారు. కేవలం 14 రోజుల్లోనే ఆరు కిలోల బరువుని తేలిగ్గా తగ్గానని అన్నారు. 

పూర్తిగా నీటి బరువు లేకుండా పునరుజ్జీవనం పొందానన్నారు. అక్కడ తనకు అలారం లేకుండా ఉదయం ఆరుగంటల కల్లా మేల్కోవడం అలవాటయ్యిందని చెప్పారు. ప్రస్తుతం ఈ పంచకర్మ తనకు వార్షిక కర్మగా మారిందని పేర్కొన్నారు. ఏడాదికి రెండుసార్లు లేదా షెడ్యూల్‌ని అనుసరించి పదిరోజుల పాటు చేస్తానని అన్నారు. ఇక్కడ పంచకర్మ అనేది ఐదు చికిత్సలని అర్థం. 

ముందుగా వామన(వాంతులు), విరేచన(ప్రక్షాళన), బస్తీ(ఎనిమా), నాస్య(నాసికా క్తీనింగ్‌),  రక్తమోక్షణ(రక్తాన్ని శుద్ధిచేయడం). ఇక్కడ ప్రతి ప్రక్రియ నిర్విషీకరణ అంశాన్ని లక్ష్యంగా చేసుకుంటుంది. ఇది శరీర వాత, పిత్త,కఫా దోషాలను నివారించి సమతుల్యతను ప్రోత్సహిస్తుంది.

బరువు ఎలా తగ్గుతారంటే..

శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్‌లను తొలగించి జీవక్రియ ప్రక్రియలను మెరుగ్గా ఉంచుతుంది. ఇది బరువు తగ్గేందుకు ఉపకరిస్తుంది. 

జీర్ణవ్యవస్థను శుభ్రపరచడం
ఇందులో వాంతులు, విరేచనాలతో శరీరాన్ని శుభ్రపరచడం మొదలుపెడతామో అప్పుడు జీర్ణక్రియ మెరుగ్గా ఉండి పోషకాల శోషణ సామర్థ్యం పెరుగుతుంది. అంతేగాదు అతిగా తినడాన్ని నివారిస్తుంది. 

జీవక్రియను సమతుల్యం చేస్తుంది
పంచకర్మ శరీర దోషాలను సమన్వయం చేసి జీవక్రియ చర్యలను మెరుగ్గా ఉంచుతుంది.. ఉదాహరణకు, కఫా దోషంలో అసమతుల్యత తరచుగా నిదానమైన జీవక్రియ, బరువు పెరిగేందుకు కారణమవుతుంది. దీనిలోని బస్తీ, నాసికా చికిత్సలు కఫ దోషాలను నివారిస్తాయి. 

పోషకాల శోషణను మెరుగవుతుంది..
జీర్ణవ్యవస్థ సరిగ్గా పనిచేసేలా చేసి, శరీరం ఆహారం నుంచి పోషకాలను సులభంగా గ్రహించేలా చేస్తుంది.  ఇది బరువు తగ్గడానికే కాకుండా  మొత్తం ఆరోగ్యానికి తోడ్పడుతుంది. మెరుగైన పోషక శోషణ శక్తి స్థాయిలను నిర్వహించడంలో ఉపయోగపడుతుంది. ఇది అలసటను తగ్గించడంలోనూ,  ఆరోగ్యకరమైన ఆకలిని ప్రోత్సహించడంలోనూ సహాయపడుతుంది.

జీవనశైలి మార్పులు
చికిత్సతో పాటు జీవనశైలి, ఆహారంలో మార్పులు తప్పనిసరి. పంచకర్మ సమయంలో, ప్రజలు తరచుగా నిర్విషీకరణకు మద్దతిచ్చే ఆహారాన్ని అనుసరించమని సలహా ఇస్తారు. అంటే.. జీర్ణమయ్యే ఆహారాలు, సూప్‌లు, ఉడకబెట్టిన పులుసులు, ఆవిరితో ఉడికించిన కూరగాయలు వంటివి తీసుకోవాలి. ఈ ఆహార మార్పులు తక్కువ కేలరీలు తీసుకునేలా చేసి ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను ప్రోత్సహిస్తుంది. 

ఇది బరువు నిర్వహణలో సహాయపడుతుంది. సున్నితమైన వ్యాయామాలు, యోగా అభ్యాసాలు రక్త ప్రసరణను మెరుగుపరిచి, జీవక్రియ రేటును పెంచుతాయి. రెగ్యులర్ శారీరక శ్రమ కూడా పంచకర్మలానే బరువు తగ్గడంలో సహాయపడుతుంది అని చెబుతున్నారు నిపుణులు.

(చదవండి: ఫ్యాటీ లివర్‌ ఉంటే గుండెపోటు వస్తుందా?)
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement