కొంతమంది మంచిగా వ్యాయామం, డైటింగ్ చేసిన ఒళ్లు తగ్గదు. పైగా వారికి కూడా ఎందుకిది దండగా అనే నిరాశ వచ్చేస్తుంది. కొందరూ భలే తగ్గుతారు. మరికొందరికి మాత్రం శరీరంలో కొంచెం కూడా మార్పు రానట్లు అనిపిస్తుంది. దీనికి ఆయుర్వేద నిపుణులు నవీన్ నడిమింటి కొన్ని సలహలు సూచనలు ఇచ్చారు. అవేంటంటే..
ఒళ్లు తగ్గకపోవడానికి చాలా రకాల కారణాలు ఉంటాయి. వాటిలో కొన్ని
- హర్మోన్ల తేడా లేదా పీసీడీఓ సమస్య
- జన్యు పరమైన కారణాలు, అధికంగా ఆహారం తీసుకోవడం వ్యాయామం చేయకపోవడం
- సరైన శారీరక శ్రమ లేక పోవడం
- నూనెలో బాగా వేగిన పదార్ధాలను తినడం, మెత్తని పదార్ధాలను తినడం, కార్బో హైడ్రేట్లు ( పిండి పదార్ధాలు) ఎక్కువగా తీసుకోవడం.
- ఆహార విహారాలతో బాటు మధ్యాహ్నం నిద్ర పోవడం
- శరీరంలోని వ్యాధులు, హైపో థైరాయిడ్, కొవ్వు బాగా పెరిగిపోవడం, రక్త నాళాల్లో కొవ్వు పేరుకు పోవడం, గుండె సమస్యలు తదితరాలు ఉన్నా.
- సరిగా నడవలేక పోవడం సంతాన లేమి మొదలైనవి.
ఒళ్లడు తగ్గడం లేదని బాధపడేవాళ్లు..
⇒ ప్రతిరోజు ఉదయం, సాయంత్రం కపాలభాతి ప్రాణాయామం చేయండి.ఇది బరువును తగ్గించడమే కాకుండా ముఖం మీద కాంతిని కూడా పెంచుతుంది ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది.
⇒ మీరు తినే ఆహారంలో ఎక్కువ శాతం పచ్చి కాయగూరలు మరియు పండ్లు ఉండేలా చూసుకోండి. కనీసం 30% శాతం ఇవి ఉండాలి.
⇒ ఒక తమలపాకులో 5 నుంచి ఆరు మిరియాలు కలిపి చుట్టి రోజూ ఉదయం టిఫిన్‌కి ముందు తిని, ఒక గ్లాసు మంచినీళ్ళు తాగండి. ఇది ఒంట్లో ఉన్న కొవ్వును కరిగిస్తుంది.
⇒ కొద్దిగా కొత్తిమీర, 3 నుండి 4 చిన్న అల్లం ముక్కలు కలిపి నీళ్ళు వేసి మిక్సీకి వేసుకొని జ్యూస్ చేసుకోండి. అందులో 1 స్పూన్ తేనె మరియు సగం నిమ్మకాయ బద్దను పిండండి. ఇది రోజూ పరగడపున సేవించండి. సులువుగా బరువును తగ్గిస్తుంది.
⇒ రోజుకి కనీసం 25 నుండి 30 నిమిషాల వరకు చమట కక్కేలా గుంజీలు తీయడం, స్కిప్పింగ్ చేయడం, నడవడం లాంటివి చేయండి. ఇది అన్నిటికన్నా ఎంతో ముఖ్యం. ⇒ లావు తగ్గడానికి ఆయుర్వేదంలో చింత గింజలను ఒక రోజంతా నీటిలో నానబెట్టాలి. పొద్దున బాగా పిసికి పొట్టు పోయిన తరువాత కొంచం నెయ్యి వేసి వేయించి, పొడి చేసి పెట్టుకోవాలి. అర స్పూను పొడిని పాలలో వేసి, చక్కర కలిపి తాగాలి. 40 రోజుల నుంచి100 రోజులు వాడాలి .
⇒ నేరుగా పట్టిన వాన నీటిని నిల్వ చేసుకోవాలి. ప్రతి రోజు ఒక గ్లాసు నీటిలో ఒక స్పూను పసుపు కలిపి తాగితే లావు తగ్గుతారు.
స్థూలకాయులైతే..
►తేనె 25 గ్రాములు గోరువెచ్చని నీళ్ళులో వేసుకుని ఒక గ్లాసు ఉదయం, సాయంత్రం పరగడుపున తాగాలి.
►వాయువిడంగాల పొడిని 2,3 గ్రాముల చొప్పున ఉదయం, సాయంత్రం వేడి నీటితో తీసుకోవాలి.
►త్రిఫల చూర్ణము త్రికటు చూర్ణము రెండింటిని సమాన భాగాలుగా తీసుకోవాలి. పూటకు ఒకటిన్నర స్పూను చొప్పున ఉదయం, సాయంత్రం తీసుకోవాలి.
►ప్రతి రోజు అరస్పూను నుంచి ఒక స్పూను వరకు కరక్కాయ పొడిని రెండు పూటలా క్రమం తప్పకుండా తీసుకుంటే తగ్గిపోతుంది.
పీసీఓడీ సమస్య ఉన్నవాళ్లు..
- ప్రతి రోజు ఒక తిప్ప తీగ ఆకును తింటూ వుంటే లావు తగ్గడమే గాక శరీరంలోని భాగాలు, చర్మం లాంటివి వేలాడుతూ వుంటే ఒక సంవత్సరానికి గట్టి పడతాయి
- భోజనానికి అరగంట ముందు వేరుశనగ పప్పులకు చక్కెర కలిపి తింటే భోజనం తక్కువగా తింటారు.
- ఆహారానికి బదులుగా కేవలం ఆపిల్ పండ్లు మాత్రమే తింటే రోజులలో లావు తగ్గుతారు.
(చదవండి: డయాబెటిస్ మందుల వల్ల ఇన్ని సైడ్ ఎఫెక్ట్సా! ఏకంగా చర్మం ఊడి..)
Comments
Please login to add a commentAdd a comment