శరీరంలో వాత మూలకం అసమతుల్యత కారణంగా స్లిప్డ్ డిస్క్ సమస్యలు రావొచ్చు. ఇది వెన్నునొప్పితో అసౌకర్యాన్ని కలిగిస్తుంది. L4 L5 డిస్క్ సమస్యకు సర్జరీ అవసరం లేకుండా ఎలాంటి రిలీఫ్ పొందవచ్చు అన్నది ప్రముఖ ఆయుర్వేద నిపుణులు నవీన్ నడిమింటి మాటల్లోనే..
నడుము నొప్పి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి?
►అధిక బరువును తగ్గించుకోవాలి
► శారీరక శ్రమ తప్పనిసరి. ఇందుకోసం క్రమశిక్షణతో వర్కవుట్స్ చేయాలి.
► సమయపాలన, ఆహార పాలన, ఒకే సమయానికి నిద్రపోయేలా చూసుకోవాలి.
► 30ఏళ్లు పైబడిన తర్వాత ప్రతి ఏడాది తప్పనిసరిగా హెల్త్ చెకప్ చేయించుకోవాలి.
► ఎముకల దృఢత్వం, బీపీ, షుగర్, గుండె సంబంధిత సమస్యలు ఉన్నాయా లేదా అన్నది పరీక్షలు చేయించుకోవాలి
► 40 ఏళ్లు దాటాక ప్రతి ఆర్నెళ్లకోసారి అన్ని పరీక్షలు చేయించుకుంటూనే తగిన ఆహార అలవాట్లను అలవర్చుకోవాలి.
వెన్నునొప్పి నుంచి ఇలా ఉపశమనం
వెన్నునొప్పికి ఎలాంటి సర్జరీ అవసరం లేకుండా ఆయుర్వేదంలో చికిత్స ఉంది. అదెలాగంటే..
కైర్టిస్ఆయిల్: కైర్టిస్ ఆయిల్ అనేది పంచకర్మ చికిత్సపై ఆధారపడిన ఒక వినూత్న పరిశోధన సూత్రం. ఇది ఆర్థరైటిస్, సయాటికా, స్పాండిలోసిస్, ఘనీభవించిన భుజం, కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు, వెన్నునొప్పి, స్లిప్ డిస్క్ మరియు న్యూరోమస్కులర్ నొప్పుల నుంచి దీర్ఘకాలిక ఉపశమనాన్ని అందిస్తుంది.
మురివెన్ననూనె: నొప్పి, వాపు, దృఢత్వం, ఆర్థరైటిక్ రుగ్మతలు, కీళ్లలో ఉన్న ఇతర తీవ్రమైన,దీర్ఘకాలిక వ్యాధుల పరిస్థితిలో మురివెన్న అద్భుతమైన ఫలితాలను కలిగి ఉంది.
యోగరాజ్ గుగ్గుల్: యోగరాజ్ గుగ్గుల్ అనేది కీళ్ల రుగ్మతల చికిత్సలో ఉపయోగించే ఒక ఆయుర్వేద టాబ్లెట్. ఇది దీర్ఘకాలిక మరియు తీవ్రమైన నొప్పులు, కీళ్లలో వాపు, దృఢత్వం మరియు తిమ్మిరి నుంచిఉపశమనం పొందడంలో సహాయపడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment