disc
-
ఉత్తమ ప్రతిభ కనబరిచిన పోలీసులకు అవార్డులు
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా శాంతిభద్రతల విభాగంలో 2022 సంవత్సరంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 76 మంది పోలీసు కానిస్టేబుళ్లు, అధికారులకు డీజీపీ కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డి డీజీపీ డిస్క్ అవార్డులు అందజేశారు. మంగళగిరిలోని పోలీస్ ప్రధాన కార్యాలయంలో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో ఈ అవార్డులు అందజేశారు. రాష్ట్రవ్యాప్తంగా శాంతి భద్రతల విభాగం, దిశ, కర్నిక్షన్ బేస్డ్ పోలీసింగ్‌లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన కానిస్టేబుల్ నుంచి అదనపు డీజీ వరకు వీటిని ప్రదానం చేశారు. అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 15 మంది ఎస్పీలు గోల్డ్ మెడల్ అందుకున్నారు. కానిస్టేబుల్ నుండి ఐపీఎస్‌ల వరకు 56 మంది సిల్వర్ మెడల్స్, 5 మంది డీఎస్పీలు, ఏఎస్ఐలకు బ్రాంజ్ మెడల్స్‌ను డీజీపీ అందజేశారు. సత్ఫలితాలు ఇస్తున్న కన్విక్షన్ బేస్డ్ పోలీసింగ్ : డీజీపీ రాష్ట్రవ్యాప్తంగా గత ఏడాది జూన్ నుంచి చేపట్టిన కన్విక్షన్ బేస్డ్ పోలీసింగ్ విధానం సత్పలితాలు ఇస్తోందని డీజీపీ తెలిపారు. ఈ విధానం ద్వారా ప్రతి ఒక్క యూనిట్ అధికారి (సీపీ, ఎస్పీ) వారి పరిధిలోని ముఖ్యమైన ఐదు, ఆరు కేసులు ప్రతిరోజూ పర్యవేక్షించేలా చూస్తున్నామన్నారు. షెడ్యూల్ మేరకు కోర్టులో జరుగుతున్న కేసు విచారణ పురోగతిపై సమీక్షించేలా వ్యవస్థను ఏర్పాటు చేశామన్నారు. దీని ద్వారా ఈ సంవత్సరం తీవ్రమైన నేరాల నమోదు శాతం గణనీయంగా తగ్గిందని తెలిపారు. నేరాల తీవ్రత ఆధారంగా గత సంవత్సరంలో గుర్తించిన 165 కేసులు న్యాయస్థానాల్లో విచారణ ప్రక్రియ పూర్తి చేసుకొని నూటికి నూరు శాతం నిందితులకు శిక్షలు పడ్డాయని చెప్పారు. ఇతర విభాగాల్లోనూ ఉత్తమ సేవలను గుర్తిస్తాం పోలీస్ శాఖలోని ఇతర అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ), సీఐడీ, గ్రేహౌండ్స్, ఆక్టోపస్, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, ఇంటెలిజెన్స్, ఏపీఎస్పీ బెటాలియన్స్, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (ఎస్ఈబి)లో కూడా ఉత్తమ ప్రతిభ కనబరిచిన సిబ్బంది వివరాలు సేకరిస్తున్నట్లు డీజీపీ తెలిపారు. ఉత్తమ సేవలు అందించిన వారికి త్వరలోనే డీజీపీ డిస్క్ అవార్డులు ప్రదానం చేస్తామన్నారు. క్షేత్రస్థాయిలో ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొంటూ ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు అహర్నిశలూ కృషి చేస్తున్న సిబ్బందికి ప్రోత్సాహకరంగా ఉండేందుకే ఈ అవార్డులను అందిస్తున్నట్టు తెలిపారు. -
నడుము నొప్పితో బాధపడుతున్నారా? అయితే ఇలా చేయండి
శరీరంలో వాత మూలకం అసమతుల్యత కారణంగా స్లిప్డ్ డిస్క్ సమస్యలు రావొచ్చు. ఇది వెన్నునొప్పితో అసౌకర్యాన్ని కలిగిస్తుంది. L4 L5 డిస్క్ సమస్యకు సర్జరీ అవసరం లేకుండా ఎలాంటి రిలీఫ్ పొందవచ్చు అన్నది ప్రముఖ ఆయుర్వేద నిపుణులు నవీన్ నడిమింటి మాటల్లోనే.. నడుము నొప్పి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ►అధిక బరువును తగ్గించుకోవాలి ► శారీరక శ్రమ తప్పనిసరి. ఇందుకోసం క్రమశిక్షణతో వర్కవుట్స్ చేయాలి. ► సమయపాలన, ఆహార పాలన, ఒకే సమయానికి నిద్రపోయేలా చూసుకోవాలి. ► 30ఏళ్లు పైబడిన తర్వాత ప్రతి ఏడాది తప్పనిసరిగా హెల్త్ చెకప్ చేయించుకోవాలి. ► ఎముకల దృఢత్వం, బీపీ, షుగర్, గుండె సంబంధిత సమస్యలు ఉన్నాయా లేదా అన్నది పరీక్షలు చేయించుకోవాలి ► 40 ఏళ్లు దాటాక ప్రతి ఆర్నెళ్లకోసారి అన్ని పరీక్షలు చేయించుకుంటూనే తగిన ఆహార అలవాట్లను అలవర్చుకోవాలి. వెన్నునొప్పి నుంచి ఇలా ఉపశమనం వెన్నునొప్పికి ఎలాంటి సర్జరీ అవసరం లేకుండా ఆయుర్వేదంలో చికిత్స ఉంది. అదెలాగంటే.. కైర్టిస్ఆయిల్: కైర్టిస్ ఆయిల్ అనేది పంచకర్మ చికిత్సపై ఆధారపడిన ఒక వినూత్న పరిశోధన సూత్రం. ఇది ఆర్థరైటిస్, సయాటికా, స్పాండిలోసిస్, ఘనీభవించిన భుజం, కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు, వెన్నునొప్పి, స్లిప్ డిస్క్ మరియు న్యూరోమస్కులర్ నొప్పుల నుంచి దీర్ఘకాలిక ఉపశమనాన్ని అందిస్తుంది. మురివెన్ననూనె: నొప్పి, వాపు, దృఢత్వం, ఆర్థరైటిక్ రుగ్మతలు, కీళ్లలో ఉన్న ఇతర తీవ్రమైన,దీర్ఘకాలిక వ్యాధుల పరిస్థితిలో మురివెన్న అద్భుతమైన ఫలితాలను కలిగి ఉంది. యోగరాజ్ గుగ్గుల్: యోగరాజ్ గుగ్గుల్ అనేది కీళ్ల రుగ్మతల చికిత్సలో ఉపయోగించే ఒక ఆయుర్వేద టాబ్లెట్. ఇది దీర్ఘకాలిక మరియు తీవ్రమైన నొప్పులు, కీళ్లలో వాపు, దృఢత్వం మరియు తిమ్మిరి నుంచిఉపశమనం పొందడంలో సహాయపడుతుంది. -
శరీరమంతా స్క్రూలు, రాడ్లు.. బతకడం కష్టమేనన్నారు: నటి
సాధారణంగా సెలబ్రిటీలు అంటే అందరూ వాళ్ల పూలపాన్పులాంటిదేనని భావిస్తుంటారు. కానీ అలాంటి వారి జీవితాల్లోనూ తెరవెనుక కన్నీళ్ల కథలు కూడా ఉంటాయి. అలా తెరపై అందరినీ నవ్వించే ప్రియాంక కామత్ నిజ జీవితంలోనూ నరకం అనుభవించింది. తన హాస్యంతో రియాల్టీ షోలలో నవ్వులు పూయిస్తూ.. తన జీవితంలో తెరవెనుక కన్నీటి బాధను అనుభవించింది. (ఇది చదవండి: ఆగస్ట్‌లో ‘మెగా’ సందడి.. వారానికో సినిమా, బరిలో చిన్న చిత్రాలు కూడా!) మజ్జా భరత, గిచ్చి గిలి గిలీ ఫేమ్ ప్రియాంక కామత్ శాండల్‌వుడ్‌లో పరిచయం అక్కర్లేని పేరు. ఆమె కలర్స్ కన్నడలోని గిచ్చి గిలి గిలి షోలో తన పంచ్ కామెడీతో ప్రేక్షకులను అలరించింది. సోషల్ మీడియాలోనూ రీల్స్ చేస్తూ అభిమానులను అలరిస్తోంది. అంత సవ్యంగా సాగిపోతున్న నటి జీవితంలో అనారోగ్యంతో బారిన పడి చావు అంచులదాకా వెళ్లి వచ్చింది. గతేడాది డిసెంబర్లో ప్రియుడు అమిత్ పెళ్లి చేసుకున్న ప్రియాంకకు వెన్నెముక సంబంధించిన అనారోగ్యం సమస్యలు తలెత్తాయి. దాదాపు నడవలేని స్థితికి చేరుకుంది ఆమె. దాదాపు ఎనిమిది నెలలపాటు బెడ్‌కే పరిమితమైన ప్రియాంక ఆ తర్వాత అనారోగ్యం నుంచి కోలుకుంది. ఈ ఆపద సమయంలో తన భర్త అండగా నిలిచి తనకు పునర్జన్మనిచ్చాడని ఎమోషనలైంది ప్రియాంక. ఆమె మాట్లాడుతూ.." గతేడాది అమిత్‌తో నిశ్చితార్థం జరిగింది. కొన్ని నెలలకే నాకు వెన్నెముక సమస్యలు వచ్చాయి. వెన్నెముక శస్త్రచికిత్స తర్వాత.. మరో రెండు శస్త్రచికిత్సలు కూడా జరిగాయి. నా శరీరానికి 70 శాతం ఇన్ఫెక్షన్ వచ్చింది. నేను బతికే అవకాశాలు 50 శాతం మాత్రమేనని డాక్టర్స్ చెప్పారు. ఎందుకంటే నా శరీరంలో స్క్రూలు, రాడ్లు అమర్చారు. దాదాపు 8 నెలలు మంచానికే పరిమితమయ్యా. దీంతో అమిత్‌కు నన్ను విడిచిపెట్టి మరొకరిని పెళ్లి చేసుకోమని చెప్పా. కానీ అతను కష్టకాలంలో నాకు అండగా నిలిచాడు. అంతే కాదు తను నా డ్రెస్సింగ్, డైపర్ ప్యాడ్లు మార్చడంలో నాకు సహాయం చేసేవాడు.' అంటూ చెప్పుకొచ్చింది. కాగా.. ఈ జంట డిసెంబర్ 2022 లో వివాహం చేసుకున్నారు. ఇప్పుడు ఈ జంట ఆనందంగా ఉన్నారు. (ఇది చదవండి: భర్తకి ప్రముఖ నటి విడాకులు.. ప్రాణం పోయిన ఫీలింగ్!) View this post on Instagram A post shared by People of India (@officialpeopleofindia) View this post on Instagram A post shared by Priyanka Kamath (@kamath.priyanka) -
విశ్వంలో భూమ్మీద మాత్రమే జీవం ఉందా? బంగారు డిస్క్‌లతో ప్రయోగం
మొత్తం విశ్వంలో భూమ్మీద మాత్రమే జీవం ఉందా? సౌర కుటుంబంలోని ఇతర గ్రహాలపైనో.. ఇతర నక్షత్రాల చుట్టూ తిరుగుతున్న గ్రహాలపైనో ఏదైనా జీవం ఉందా అన్నది ఎప్పటి నుంచో తొలిచేస్తున్న ప్రశ్న. ఈ గ్రహాంతర వాసుల (ఏలియన్లు) కోసం శాస్త్రవేత్తలు ఎన్నో ఏళ్లుగా అన్వేషిస్తున్నారు. ఎక్కడైనా ఏలియన్లు ఉంటే మనను గుర్తించేందుకు వీలుగా అంతరిక్షంలోకి వివిధ తరంగాలతో సిగ్నళ్లు పంపడం వంటివీ చేస్తున్నారు. ఈ క్రమంలోనే పలు సుదూర అంతరిక్ష ప్రయోగాల్లో ప్రత్యేకమైన బంగారు డిస్క్‌లను పంపారు. ఏమిటా బంగారు డిస్కులు, వాటిపై ఏముందన్న వివరాలు తెలుసుకుందామా.. భూమి, మానవుల విశేషాలతో.. ఒకవేళ ఎక్కడైనా గ్రహాంతర జీవులు ఉండి ఉంటే.. వాటికి భూమి మీద జీవం, మనుషులు ఉన్నట్టు తెలిపేందుకు శాస్త్రవేత్తలు వ్యోమనౌకలలో ప్రత్యేకమైన బంగారు డిస్క్‌లను పంపారు. వాటిపై మనుషులు సాధించిన ప్రగతి, వివిధ సాంస్కృతిక, సాంకేతిక అంశాలను వివరించేలా ఉన్న డిజైన్లు, ఆకారాలను నిక్షిప్తం చేశారు. అయితే ఇవి పూర్తిస్థాయి బంగారు ప్లేట్లు కాదు. పన్నెండు అంగుళాల వ్యాసం ఉన్న గట్టి రాగి ప్లేట్లపై మందంగా బంగారు పూత పూశారు. ఇప్పటివరకు నాలుగు వ్యోమనౌకలలో.. అంతరిక్షంలో సుదూర ప్రయోగాల కోసం పంపిన వ్యోమనౌకలలో నాసా శాస్త్రవేత్తలు బంగారు డిస్‌్కలను అమర్చారు. ఇప్పటివరకు పయోనిర్–10, పయోనిర్–11, వోయేజర్–1, వోయేజర్–2 వ్యోమనౌకలు వీటిని తీసుకుని అంతరిక్షం అంచుల్లోకి చేరుకున్నాయి కూడా. వోయేజర్ వ్యోమనౌకల్లో పంపిన డిస్్కలపై పంపిన డేటాను శాస్త్రవేత్త కార్ల్ సాగన్ నేతృత్వంలోని కమిటీ ఎంపిక చేసింది. ఏలియన్లకు అర్థమయ్యేలా.. 1977లో వోయేజర్ వ్యోమనౌకలలో పంపిన బంగారు డిస్క్‌లను గ్రామ్‌ఫోన్ రికార్డుల తరహాలో రూపొందించారు. వాటిలో గణితం, సైన్స్‌కు సంబంధించిన వివరాలను, వివిధ ధ్వనులను నమోదు చేశారు. గణితం, సైన్స్‌కు సంబంధించిన అంశాలు యూనివర్సల్ అని.. ఎప్పటికైనా వీటిని గ్రహాంతర వాసులు అర్థం చేసుకోగలరని శాస్త్రవేత్తల భావన. అందుకే ఈ డిస్క్‌లను టైం క్యాప్సూల్స్ అని కూడా పేర్కొన్నారు. ఈ బంగారు డిస్క్లకుపైన కవర్‌ను కూడా అమర్చారు. దీనిని అల్యూమినియంతో తయారు చేశారు. అంతరిక్షంలో పరిస్థితులను తట్టుకుని కోట్ల ఏళ్లు ఉండేందుకు వీలుగా.. యురేనియం–238ను పూత పూశారు. ఈ కవర్‌పై ‘‘అన్ని కాలాలు, అన్ని ప్రపంచాల్లో సంగీతాన్ని సృష్టించేవారి కోసం..’’ అని రాశారు. బంగారు డిస్క్‌లలో ఏమేం నిక్షిప్తం చేశారు? ► మానవులు, భూమికి సంబంధించి అనలాగ్ పద్ధతిలో ఎన్కోడ్ చేసిన 115 చిత్రాలు (తింటూ, తాగుతూ ఉన్న మనుషులు, తాజ్‌మహల్ వంటి ప్రముఖ స్థలాలు, క్రీడాకారులు, గర్భిణులు, పాలిస్తున్న తల్లి, ఎల్రక్టానిక్ పరికరాలు, న్యూటన్ రాసిన బుక్‌లోని ఓ పేజీ.. ఇలా ఎన్నో). ► హిందీ, బెంగాలీ, కన్నడ సహా 55 భాషల్లో పలకరింపులు. ► ప్రముఖ సంగీత విద్వాంసులకు సంబంధించిన 90 నిమిషాల సంగీతం. ► భూమిపై వినిపించే వివిధ రకాల ధ్వనులతో కూడిన (ఉరుములు, జంతువుల అరుపులు, మనుషుల మాటలు, ముద్దు ధ్వని సహా) 12 నిమిషాల ఆడియో. ► అంతరిక్షంలో మన సౌర కుటుంబం, భూమి ఉన్న ప్రాంతాన్ని గుర్తించగలిగేలా డిస్క్ కవర్‌పై మ్యాప్. ► డిస్క్‌లోని వివరాలను డీకోడ్ చేసేందుకు వీలైన మేథమేటికల్, సైన్స్ ఆకృతులు. – సాక్షి సెంట్రల్ డెస్క్ -
సయాటికా (గుద్రసీ వాతము)
ప్రస్తుత పరిస్థితుల్లో మానవుని జీవితం చాలా యాంత్రికంగా మారిపోయింది. ముఖ్యంగా ఆహారపు అలవాట్లు, దినచర్య, స్వప్న విపర్యయం (పగటి నిద్ర, రాత్రి సమయానికి నిద్రపోకపోవటం) లాంటి విషయాలలో అనేక మార్పులు రావటం వలన. ఆందోళన, మానసిక ఒత్తిడి లాంటి సమస్యల వలన మానవులు అనేక వ్యాధుల బారిన పడుతున్నారు. అందులో అతి ముఖ్యమైనది (నడుమునొప్పి) కటిశూల. నూటికి 90 మంది తమ జీవితకాలంలో ఎప్పుడో ఒకసారి ఈ నడుమునొప్పి సమస్యతో బాధపడుతున్నారు. ఆయుర్వేదశాస్త్రంలో చరక, నూశ్రత, వాగ్భటులు ఈ సమస్యను గుద్రసీ వాతం (సయాటికా)గా పేర్కొంటూ ఎంతో విపులంగా వివరించారు. దీనికి సాధారణ కారణాలు పరిశీలించి చూసినట్లయితే... ఎక్కువగా ఒకే పొజిషన్లో కూర్చోవడం, స్థూలకాయం, అధికశ్రమతో కూడిన పనులు ఎక్కువసేపు చేయటం, అధిక బరువులను మోయటం, ఎక్కువదూరం ద్విచక్ర వాహనాలు, కార్లలో ప్రయాణించటం, కొన్ని దీర్ఘకాలిక వ్యాధుల వలన, కొన్ని వంశపారంపర్య వ్యాధుల వలన, మరికొన్ని రోడ్డు ప్రమాదాల వలన ఈ నడుమునొప్పి సమస్య వస్తుంటుంది. ముఖ్యంగా పైన వివరించిన కారణాల వలన శరీరంలో వాతప్రకోపం జరిగి, ముందుగా పిరుదులకు పైభాగాన స్తబ్ధతను, నొప్పిని కలిగించి తరువాత కటి ప్రదేశం (నడుము), తొడలు, మోకాళ్లు, పిక్కలు, పాదాలలో క్రమంగా నొప్పి కలుగుతుంది. దీనినే గుద్రసీ వాతము (సయాటికా) అని అంటారు. ఈ సమస్య శీతాకాలంలో ఎక్కువ అవుతుంది. ముఖ్యంగా నడుముకు సంబంధించిన ఎల్4-ఎల్5, ఎస్1-ఎస్2 వెన్నుపూసల మధ్యగల సయాటికా అనే నరంపై ఒత్తిడి పడటం వల్ల ఈ నొప్పి వస్తుంది. ఆయుర్వేద చికిత్స ఆయుర్వేదంలో ఇలాంటి సమస్యలకు సమగ్రమైన చికిత్సా పద్ధతులు ఉన్నాయి. అందులో 1. శమన చికిత్స. 2. శోధన చికిత్స. శమన చికిత్స: ఇది దోషాలను బట్టి అభ్యంతరంగా వాడే ఔషధ చికిత్స. ఇందులో వేదనను నివారించే ఔషధాలు ఉంటాయి. అలాగే వాతహర చికిత్సా పద్ధతులు ఉంటాయి. శోధన చికిత్స: శమన చికిత్స వలన ఒక్కోసారి మళ్లీ వ్యాధి తిరగపెట్టవచ్చు. అందుకే ఆయుర్వేదంలో పంచకర్మ అనే ఒక ప్రత్యేక చికిత్సాపద్ధతి ఉంది. ఈ చికిత్సా పద్ధతి ద్వారా ప్రకోపించిన వాతాది దోషాలను సమూలంగా తగ్గించవచ్చు. 1. స్నేహకర్మ: ఈ ప్రక్రియ ద్వారా వెన్నెముకలోని వెన్నుపూసల మధ్య స్నిగ్ధత్వాన్ని పెంపొందించి, తద్వారా జాయింట్స్‌లో కదలికలను తేలికగా చేయవచ్చును. 2. స్వేదకర్మ: ఈ పద్ధతిలో గట్టిగా అతుక్కొని ఉండే జాయింట్స్‌ను మృదువుగా అయ్యేటట్లు చేయవచ్చును. కటివస్తి: ఈ పద్ధతి ఈ వ్యాధిలో అతి విశిష్టతను సంతరించుకున్నది. ఈ ప్రక్రియ ద్వారా అరిగిపోయిన మృదులాస్థికి రక్తప్రసరణను పెంచి తద్వారా నొప్పి తీవ్రతను తగ్గించవచ్చును. అలాగే సర్వాంగధార, వస్తికర్మ అనే విశిష్ట చికిత్సా పద్ధతుల ద్వారా నాడీ కణాలలో కలిగిన లోపాలను సరిచేయవచ్చు. అదేవిధంగా ప్రకోపించిన వాతాన్ని సమస్థితికి తీసుకురావచ్చు. జాగ్రత్తలు: సరి అయిన పోషక ఆహారాలు తీసుకోవడం, నిదాన పరివర్జనం అనగా పైన చెప్పిన ప్రత్యేక వ్యాధి కారణాలను మళ్లీమళ్లీ చేయకుండా జాగ్రత్త పాటించినట్లయితే ఈ సమస్య నుంచి శాశ్వత విముక్తి పొందవచ్చు. డిస్క్‌లో వచ్చే మార్పులు ఈ వ్యాధిలో వెన్నుపూసల మధ్య ఉండే డిస్క్‌లో కొన్ని మార్పులు జరుగుతాయి. అవి డిస్క్ మీద ఒత్తిడి పెరగటం, వాపు రావటం లేదా డిస్క్కి రక్తప్రసరణ సరిగా లేకపోవటం, అరిగిపోవటం అనే సమస్యల వల్ల ఈ నొప్పి వస్తుంది. డిస్క్‌లో వాపు వస్తే దానిలో ఉండే చిక్కని ద్రవం బయటకు వచ్చి మేరుదండం లేదా దాన్నుంచి వచ్చే నరాలపై ఒత్తిడి కలిగించటం వల్ల నొప్పి వస్తుంది. లక్షణాలు: నడుములో నొప్పి కలగటం, వాపు, కొంచెం శారీరక శ్రమ చేయగానే నొప్పి తీవ్రత పెరగటం, ఈ నొప్పి సూదులతో గుచ్చినట్లుగా, ఒక్కోసారి తిమ్మిర్లు, మంటతో కూడి ఉంటుంది. సమస్య తీవ్రమైనది అయితే స్పర్శహాని కూడా కలుగవచ్చు. ఒక్కోసారి మలమూత్రాల మీద నియంత్రణ కూడా పోయే ప్రమాదం ఉంది. వెన్ను నొప్పి బాధ అనగానే సాధారణంగా పెయిన్ కిల్లర్స్‌తో కాలయాపన చేస్తుంటారు. దీనివల్ల తాత్కాలిక ఉపశమనం కల్గుతుంది. కాని మలబద్దకం, జీర్ణాశయ సమస్యలు మొదలవుతాయి. కావున ఇలాంటి సమస్యలను ప్రారంభదశలోనే గుర్తించి, జాగ్రత్తపడటం వల్ల ఈ వ్యాధిని సమూలంగా తగ్గించవచ్చు. డాక్టర్ హనుమంతరావు ఎం.డి (ఆయుర్వేద), స్టార్ ఆయుర్వేద, సికింద్రాబాద్, కూకట్పల్లి, దిల్సుఖ్నగర్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, రాజమండ్రి, కర్ణాటక ph: 9908911199 / 9959911466 -
సర్వైకల్ స్పాండిలోసిస్... సులభ వైద్యం
సర్వైకల్ స్పాండిలోసిస్ ఇటీవల చాలా ఎక్కువగా కనిపిస్తున్న సమస్య. ఇది ప్రధానంగా వృత్తిపరమైన రుగ్మత (ఆక్యుపేషనల్ హజార్డ్). ఇటీవల ఈ సమస్య తరచూ ద్విచక్రవాహనాలు నడిపేవారిలో, కదలకుండా కంప్యూటర్ ముందుగాని, డెస్క్‌లో గాని ఎక్కువగా కూర్చుని ఉండేవారిలో ఈ డిస్క్ సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక ఆధునిక జీవనశైలిలో శారీరక శ్రమ పెద్దగా లేని వారిలో కూడా ఈ సమస్యలు చాలా తరచుగా గమనించవచ్చు. ఈ తరహా సమస్యలు అందరిలో కనిపిస్తున్నా స్త్రీలతో పోలిస్తే ఇవి పురుషుల్లోనే ఎక్కువ. వయసు పెరుగుతున్న కొద్దీ వెన్నుపూసలలో మార్పులు రావడం అన్నది చాలా సాధారణంగా జరిగే స్వాభావిక మార్పు. అయితే ఈ మార్పుల కారణంగా డిస్క్‌ల మధ్యన ఉండే నరాల మీద ఒత్తిడి పెరుగుగుతుంది. దాంతో ఒకవేళ ఇలాంటి మార్పులు మెడ దగ్గర ఉండే వెన్నెముకల మధ్య సంభవించినప్పుడు మెడ పట్టేసినట్లు ఉండటం, తలనొప్పి, కళ్లు తిరగడం, భజాలు, చేతుల నొప్పి, తిమ్మిర్లు వంటి లక్షణాలు కనిపిస్తాయి. నరాల మీద ఒత్తిడి వల్ల తలతిరగడం, నడకలో తేడా వంటి లక్షణాలు కూడా కనిపించవచ్చు. కారణాలు: ఎముకలు, ఎముకల చివరన ఉండే కార్టిలేజ్ అరిగిపోవడంతో ఎముకలు ఎగుడుదిగుడుగా మారతాయి. దాంతో వాటి మధ్యన ఉండే నరాలపై ఒత్తిడి పడటం, అవి నలగడం జరుగుతుంది. ఫలితంగా మెడ వెనకభాగంలో నొప్పి, మెడ తిప్పలేకపోవడం, చేతులు లాగినట్లుగా ఉండటం, మెడ నుంచి చేతుల చివరి భాగం వరకు నొప్పి, తిమ్మిర్లు పాకినట్లుగా రావడం, పైకి చూస్తే కళ్లు తిరగడం వంటి పరిణామాలు సంభవిస్తాయి. తూలినట్లుగా నడవటం, కొన్ని సందర్భాల్లో మల, మూత్రాలపై నియంత్రణ కోల్పోవడం జరగవచ్చు. చేయకూడని పనులు: పరుగెత్తడం, ఎక్కువసేపు టీవీ చూడటం, కంప్యూటర్‌పై అదేపనిగా పనిచేయడం, కుట్టుపని, ఎంబ్రాయిడరీ, నిటారుగా కూర్చోవడం, డ్రైవింగ్ వంటి పనులు చేయకూడదు. నివారణ: మెడ కండరాలకు బలం చేకూర్చే వ్యాయామాలు చేయాలి. వృత్తిపరంగా డెస్క్ ముందు కూర్చునేవారు సరైన భంగిమల్లో కూర్చోవాలి. మానసికమైన ఒత్తిడులు తగ్గించుకోవాలి. కంప్యూటర్‌పై పనిచేస్తున్నప్పుడు ప్రతి పది నిమిషాలకు ఒకమారు లేచి నడవటం, కాస్త రిలాక్స్ కావడం మంచిది. చికిత్స: హోమియోలో కాల్కేరియా గ్రూపు మందులైన కాల్కేరియా ఫాస్, కాల్కేరియా ఫ్లోర్, బ్రయోనియా, స్పైజిలియా, హైపరికం, జెల్సీమినియం, రుస్టాక్స్, యాసిడ్‌ఫాస్ వంటి మందులను వాడటంవల్ల మంచి ఫలితాలు ఉంటాయి. అయితే మానసిక, శారీరక స్వభావాలను, లక్షణాలను బట్టి వీటిని నిపుణులైన హోమియో వైద్యుల పర్యవేక్షణలో వాడటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. డాక్టర్ ఎం. శ్రీకాంత్, సి.ఎం.డి., హోమియోకేర్ ఇంటర్నేషనల్