సాధారణంగా సెలబ్రిటీలు అంటే అందరూ వాళ్ల పూలపాన్పులాంటిదేనని భావిస్తుంటారు. కానీ అలాంటి వారి జీవితాల్లోనూ తెరవెనుక కన్నీళ్ల కథలు కూడా ఉంటాయి. అలా తెరపై అందరినీ నవ్వించే ప్రియాంక కామత్ నిజ జీవితంలోనూ నరకం అనుభవించింది. తన హాస్యంతో రియాల్టీ షోలలో నవ్వులు పూయిస్తూ.. తన జీవితంలో తెరవెనుక కన్నీటి బాధను అనుభవించింది.
(ఇది చదవండి: ఆగస్ట్‌లో ‘మెగా’ సందడి.. వారానికో సినిమా, బరిలో చిన్న చిత్రాలు కూడా!)
మజ్జా భరత, గిచ్చి గిలి గిలీ ఫేమ్ ప్రియాంక కామత్ శాండల్‌వుడ్‌లో పరిచయం అక్కర్లేని పేరు. ఆమె కలర్స్ కన్నడలోని గిచ్చి గిలి గిలి షోలో తన పంచ్ కామెడీతో ప్రేక్షకులను అలరించింది. సోషల్ మీడియాలోనూ రీల్స్ చేస్తూ అభిమానులను అలరిస్తోంది. అంత సవ్యంగా సాగిపోతున్న నటి జీవితంలో అనారోగ్యంతో బారిన పడి చావు అంచులదాకా వెళ్లి వచ్చింది.
గతేడాది డిసెంబర్‌లో ప్రియుడు అమిత్ పెళ్లి చేసుకున్న ప్రియాంకకు వెన్నెముక సంబంధించిన అనారోగ్యం సమస్యలు తలెత్తాయి. దాదాపు నడవలేని స్థితికి చేరుకుంది ఆమె. దాదాపు ఎనిమిది నెలలపాటు బెడ్‌కే పరిమితమైన ప్రియాంక ఆ తర్వాత అనారోగ్యం నుంచి కోలుకుంది. ఈ ఆపద సమయంలో తన భర్త అండగా నిలిచి తనకు పునర్జన్మనిచ్చాడని ఎమోషనలైంది ప్రియాంక.
ఆమె మాట్లాడుతూ.." గతేడాది అమిత్‌తో నిశ్చితార్థం జరిగింది. కొన్ని నెలలకే నాకు వెన్నెముక సమస్యలు వచ్చాయి. వెన్నెముక శస్త్రచికిత్స తర్వాత.. మరో రెండు శస్త్రచికిత్సలు కూడా జరిగాయి. నా శరీరానికి 70 శాతం ఇన్ఫెక్షన్ వచ్చింది. నేను బతికే అవకాశాలు 50 శాతం మాత్రమేనని డాక్టర్స్ చెప్పారు. ఎందుకంటే నా శరీరంలో స్క్రూలు, రాడ్‌లు అమర్చారు. దాదాపు 8 నెలలు మంచానికే పరిమితమయ్యా. దీంతో అమిత్‌కు నన్ను విడిచిపెట్టి మరొకరిని పెళ్లి చేసుకోమని చెప్పా. కానీ అతను కష్టకాలంలో నాకు అండగా నిలిచాడు. అంతే కాదు తను నా డ్రెస్సింగ్, డైపర్ ప్యాడ్లు మార్చడంలో నాకు సహాయం చేసేవాడు.' అంటూ చెప్పుకొచ్చింది. కాగా.. ఈ జంట డిసెంబర్ 2022 లో వివాహం చేసుకున్నారు. ఇప్పుడు ఈ జంట ఆనందంగా ఉన్నారు.
(ఇది చదవండి: భర్తకి ప్రముఖ నటి విడాకులు.. ప్రాణం పోయిన ఫీలింగ్!)
Comments
Please login to add a commentAdd a comment