న్యూ ఇయర్‌లో గుడ్‌ న్యూస్ చెప్పిన హీరోయిన్! | Sandalwood Actress Aditi Prabhudeva Shares Good News In 2024 | Sakshi
Sakshi News home page

Aditi Prabhudeva: కొత్త ఏడాదిలో అమ్మను కాబోతున్నా: అదితి

Jan 2 2024 8:09 AM | Updated on Jan 2 2024 8:57 AM

Sandalwood Actress Aditi Prabhudeva Shares Good News In 2024 - Sakshi

న్యూ ఇయర్ వేళ ‍అభిమానులకు గుడ్‌న్యూస్ చెప్పింది శాండల్‌వుడ్‌ భామ. తోతాపురి- 2, రంగనాయకి, దిల్మార్‌ చిత్రాల్లో నటించిన కన్నడ హీరోయిన్ అదితి ప్రభుదేవా గర్భం ధరించినట్లు వెల్లడించింది. కొత్త సంవత్సరంలో తాను అమ్మను కాబోతున్నట్లు తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. ఈ ఏడాదిలో తల్లి అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉందని తెలిపింది. ఈ సందర్భంగా బేబీ బంప్‌తో ఫోటోలను పంచుకుంది. 

అదితి తన ఇన్‌స్టాలో రాస్తూ..' బంధుత్వాలలో గొప్పది. పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు ప్రతి బాధలోనూ మన నోటి నుండి వచ్చే ఏకైక పదం అమ్మ. జీవితంలో ప్రతి ఒక్కరినీ ప్రేమగా, గౌరవంగా చూసుకునే బంధం అమ్మ. మన కోసం ప్రతిక్షణం ఆలోచించేది అమ్మా. నేను 2024లో అమ్మను కాబోతున్నా' అంటూ క్యాప్షన్ రాసుకొచ్చింది.

ఇది చూసిన ఫ్యాన్స్ అభినందనలు చెబుతున్నారు. న్యూ ఇయర్ సందర్భంగా తన భర్తతో కలిసి ఉన్న ఫోటోలను కూడా పంచుకుంది. కాగా..నటి అదితి ప్రభుదేవాకు, వ్యాపారవేత్త యషాస్‌తో నవంబర్ 2022లో వివాహం జరిగింది. ప్రస్తుతం అదితి నటించిన 'అలెక్సా' చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ  చిత్రం జనవరి 26న విడుదల కానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement