
కన్నడ భామ ఆదితి ప్రభుదేవా శాండల్‌వుడ్‌లో పరిచయం అక్కర్లేని పేరు. కన్నడలో ధైర్యం సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ పలు సినిమాల్లో నటించింది. బ్రహ్మచారి, ఓల్డ్ మాంక్, సింగ, తోతాపురి చాప్టర్ -1 లాంటి చిత్రాలతో శాండల్‌వుడ్‌లో గుర్తింపు తెచ్చుకుంది. సినిమాలతో బిజీగా ఉండగానే.. 2022లో వివాహాబంధంలోకి అడుగుపెట్టింది. వ్యాపారవేత్త యషాస్‌ను వివాహం చేసుకుంది.
అయితే ఇటీవల కొత్త ఏడాదిలో ప్రారంభంలోనే అభిమానులకు గుడ్ న్యూస్ కూడా చెప్పింది. తాను గర్భం ధరించినట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది ముద్దుగుమ్మ. తన భర్తతో ఉన్న ఫోటోలను షేర్ చేసింది. ఈ విషయం తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు ఈ జంటకు అభినందనలు తెలిపారు.
తాజాగా ఆదితి ప్రభుదేవా సీమంతం వేడుక ఘనంగా జరిగింది. బెంగళూరులోని ఆమె నివాసంలో బేబీ షవర్ కార్యక్రమం గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ వేడుకలో బంధువులు, సన్నిహితులు పాల్గొన్నారు. శాండల్‌వుడ్‌కు చెందిన పలువురు నటీనటులు కూడా హాజరై కాబోయే తల్లిదండ్రులను ఆశీర్వదించారు.
Comments
Please login to add a commentAdd a comment