కొంతమంది ఆహార్యం చాలా బక్కపలచగా ఉంటుంది. ఎంత తిన్న వంటబట్టదు. చూడటానికి బలహీనంగా, అందవిహీనంగా ఉంటారు. కాస్త ఫిజిక్ ఉంటే చూడటానికి అందంగా అనిపిస్తారు. అదికూడ లేకపోతే.. పేషెంట్ మాదిరిగా ఉన్నాడ్రా బాబు అనేస్తారు. గాలి వీస్తే ఎగిరిపోయేలా ఉన్నా ఇబ్బందే!. అలాంటి వారు బరువు పెరగాలనకుంటే ఏం చేయాలంటే..
బరువు పెరగాలన్న ఆత్రుతలో ఎలా పడితే అలా తినేయ్యకూడదు. ముందు మన శరీరానికి ఏం పడతాయి, ఏవైతే బెటర్ అనేది నిర్థారించుకోవాలి. ఆ తర్వాత వాటిని క్రమబద్ధంగా ఓ నియమానుసారంగా తీసుకుంటేనే చక్కటి ఫలితం ఉంటుంది. ముఖ్యంగా మంచి న్యూట్రిషియన్లు లేదా వైద్యులను సంప్రదించి మంచి డైట్ పాలో అవ్వాలి. ఇలా లావు అవ్వలేకపోతున్నాం అని బాధపడే వాళ్లు ఈ పూరీలు గనుకు తింటే కచ్చితంగా లావువుతారని చెబుతున్నారు ఆయుర్వేద నిపుణులు. ఏంటా పూరీలు..? ఎలా తయారు చేస్తారంటే..?
నెయ్యితో చేసే పూరీలు..
నెయ్యితో చేసిన పూరీలు తింటే బరువు పెరగడమే గాక కండరాలు, ఎముకలు బలంగా మారతాయి.
ఎలా చెయ్యాలంటే..
నెయ్యి పూరీలు తయారీకి కావాల్సిన పదార్థాలు..
గోధుమపిండి: ఒక కప్పు
పాలు: 1/2 కప్పు
పటికబెల్లం పొడి: సరిపడ
నెయ్యి
తయారీ విధానం: ముందుగా పాలలో సరైన మొత్తంలో పటికబెల్లం పొడి వేయండి. ఈ పాలతో కప్పు గోధుమ పిండిని కలిపి పూరీ పిండిలా చేయండి. దీనిని చిన్న చిన్న ఉండల్లా చేసి పూరీలు చేయండి.ఈ పూరీలను నెయ్యిలో వేసి వేయించండి. వాటిలో గనుకు ఎక్స్‌ట్రా నెయ్యి ఉంటే టిష్యూలు వాడండి. ఈ పూరీలను కొబ్బరిచట్నీతో తింటే ఆ టేస్టే వేరబ్బా. రుచికి రుచిగా ఉండటమే గాక ఈజీగా బరువు పెరుగుతారు.
ఎలాంటి వారు తినకూడదంటే..
ఈ ఫుడ్ హెవీగా ఉంటుంది. కఫం పెరుగుతుంది. కాబట్టి, షుగర్, పీసీఓఎస్, హైపోథైరాయిడిజం, అధిక బరువు, జీర్ణ సమస్యలు ఉన్నవారు ఈ ఫుడ్‌ని తినొద్దు.
గమనిక: ఆరోగ్య నిపుణుల అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం అవగాహన కోసమే. దీన్ని ఫాలో అయ్యే ముందు వ్యక్తిగత వైద్యుల సలహాలు, సూచనల మేరకు ప్రయత్నించడం మంచిది.
(చదవండి: కొండెక్కిన వెల్లుల్లి ధరలు చూసి భయపడొద్దు..ఈ చిట్కాలు ఫాలోకండి!)
Comments
Please login to add a commentAdd a comment