suggested
-
బరువు పెరగాలనుకునే వారికి ఈ పూరీలు మేలు!
కొంతమంది ఆహార్యం చాలా బక్కపలచగా ఉంటుంది. ఎంత తిన్న వంటబట్టదు. చూడటానికి బలహీనంగా, అందవిహీనంగా ఉంటారు. కాస్త ఫిజిక్ ఉంటే చూడటానికి అందంగా అనిపిస్తారు. అదికూడ లేకపోతే.. పేషెంట్ మాదిరిగా ఉన్నాడ్రా బాబు అనేస్తారు. గాలి వీస్తే ఎగిరిపోయేలా ఉన్నా ఇబ్బందే!. అలాంటి వారు బరువు పెరగాలనకుంటే ఏం చేయాలంటే.. బరువు పెరగాలన్న ఆత్రుతలో ఎలా పడితే అలా తినేయ్యకూడదు. ముందు మన శరీరానికి ఏం పడతాయి, ఏవైతే బెటర్ అనేది నిర్థారించుకోవాలి. ఆ తర్వాత వాటిని క్రమబద్ధంగా ఓ నియమానుసారంగా తీసుకుంటేనే చక్కటి ఫలితం ఉంటుంది. ముఖ్యంగా మంచి న్యూట్రిషియన్లు లేదా వైద్యులను సంప్రదించి మంచి డైట్ పాలో అవ్వాలి. ఇలా లావు అవ్వలేకపోతున్నాం అని బాధపడే వాళ్లు ఈ పూరీలు గనుకు తింటే కచ్చితంగా లావువుతారని చెబుతున్నారు ఆయుర్వేద నిపుణులు. ఏంటా పూరీలు..? ఎలా తయారు చేస్తారంటే..? నెయ్యితో చేసే పూరీలు.. నెయ్యితో చేసిన పూరీలు తింటే బరువు పెరగడమే గాక కండరాలు, ఎముకలు బలంగా మారతాయి. ఎలా చెయ్యాలంటే.. నెయ్యి పూరీలు తయారీకి కావాల్సిన పదార్థాలు.. గోధుమపిండి: ఒక కప్పు పాలు: 1/2 కప్పు పటికబెల్లం పొడి: సరిపడ నెయ్యి తయారీ విధానం: ముందుగా పాలలో సరైన మొత్తంలో పటికబెల్లం పొడి వేయండి. ఈ పాలతో కప్పు గోధుమ పిండిని కలిపి పూరీ పిండిలా చేయండి. దీనిని చిన్న చిన్న ఉండల్లా చేసి పూరీలు చేయండి.ఈ పూరీలను నెయ్యిలో వేసి వేయించండి. వాటిలో గనుకు ఎక్స్ట్రా నెయ్యి ఉంటే టిష్యూలు వాడండి. ఈ పూరీలను కొబ్బరిచట్నీతో తింటే ఆ టేస్టే వేరబ్బా. రుచికి రుచిగా ఉండటమే గాక ఈజీగా బరువు పెరుగుతారు. ఎలాంటి వారు తినకూడదంటే.. ఈ ఫుడ్ హెవీగా ఉంటుంది. కఫం పెరుగుతుంది. కాబట్టి, షుగర్, పీసీఓఎస్, హైపోథైరాయిడిజం, అధిక బరువు, జీర్ణ సమస్యలు ఉన్నవారు ఈ ఫుడ్‌ని తినొద్దు. గమనిక: ఆరోగ్య నిపుణుల అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం అవగాహన కోసమే. దీన్ని ఫాలో అయ్యే ముందు వ్యక్తిగత వైద్యుల సలహాలు, సూచనల మేరకు ప్రయత్నించడం మంచిది. View this post on Instagram A post shared by Dr. Rekha Radhamony, 4th Gen Ayurveda Doctor (BAMS) (@doctorrekha) (చదవండి: కొండెక్కిన వెల్లుల్లి ధరలు చూసి భయపడొద్దు..ఈ చిట్కాలు ఫాలోకండి!) -
వింతైన ట్రిక్ : ఇంధనం పొదుపు చేయడం కోసం నెక్కి 'టై' ధరించొద్దు!
డబ్బలు వృధాగా ఖర్చుపెట్టకుండా ఉండటం కోసం, కాలుష్య నివారణ కోసం తదితర వాటిన్నంటికి నిపుణులు చిన్న లాజికల్ ట్రిక్‌లు సూచించడం మాములే. ఇది అందరికి తెలిసిన విషయమే. ఐతే రష్యా ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ప్రపంచ దేశాలు, ఆహార, ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కుంటున్న సంగతి తెలిసిందే. దీంతో ప్రతిదేశం ఈ సంక్షోభం తలెత్తకుండా ఉండేలా తమదైన తరహాలో పద్ధతులను అవలంబిస్తున్నాయి. ఐతే ఈ విషయమై స్పెయిన్ ప్రధాని తమ ప్రజలకు ఒక విభిన్నమైన ట్రిక్ అనుసరించమని సూచించాడు. ఆ ప్రధాని చెప్పిన పరిష్కార మార్గం వింటే చాలా వింతగానూ, అర్థం లేనిదిగానూ అనిపిస్తుంది. వివరాల్లోకెళ్తే...స్పానిష్ ప్రధానమంత్రి పెడ్రో సాంచెజ్ తమ దేశ ప్రజలకు ఇంధనాన్ని సాధ్యమైనంత మేర తక్కువగానే వినియోగించుకోవాలంని విజ్ఞప్తి చేశాడు. పైగా వృధాగా ఇంధనాన్ని ఖర్చు పెట్టకుండా ఉండేందుకు ఇలా చేయండి అంటూ ఒక వింతైన ట్రిక్ గురించి చెప్పాడు. ఈ మేరకు ఆయన విలేకరులు సమావేశంలో మాట్లాడుతూ... ఇంధనాన్ని ఆదా చేసేందుకు నెక్కి 'టై' లు ధరించవద్దని చెప్పాడు. అంతేకాదు ఆయన కూడా ఆ ప్రసంగంలో నెక్కి టై ధరించకుండా ఉన్నాడు. ఇంధనం ఆదా చేయడానికికి నెక్కి టై ధరించకపోవడానికిక సంబంధం ఏమిటో అర్థం కాదు ప్రజలకు. అంతేకాదు తాను కూడా టైం ధరించకపోవడాన్ని గమనించండని చెబుతుంటాడు. అంతేకాదు తన ప్రజలను మంత్రులను దీన్ని అనుసరించాలని కూడా కోరాడు. ఐతే స్పెయిన్ ప్రధాని సాంచెజ్ దేశంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలను దృష్టిలో ఉంచుకుని ఈ ప్రతిపాదనను తీసుకువచ్చినట్లు సమాచారం. అధిక ఉష్ణోగ్రతలు కారణంగా స్పెయిన్ ప్రజలు ఎయిర్ కండిషనింగ్ పై ఆధారపడుతున్నారు. దీంతో దేశంలో గృహాలకు, వ్యాపార కార్యాలయాలకు అధిక ఇంధనాన్ని ఖర్చు చేయాల్సి వస్తుంది. అంతేకాదు యూటీలిటీ బిల్లులను తగ్గించడంతోపాటు ఇంధనం కోసం రష్యాపై ఆధారపడటాన్ని తగ్గించుకునే ప్రణాళికలో భాగంగా ఈ పొదుపు ప్రణాళిక ట్రిక్ని అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. (చదవండి: భూ వాతావరణంలోకి చైనా రాకెట్ శకలాలు.. వీడియో వైరల్) -
కోవిడ్‌పై మరింత అప్రమత్తంగా ఉండండి
సాక్షి, హైదరాబాద్: కోవిడ్ వైరస్‌పై రాష్ట్ర ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది. పొరుగు దేశాలైన శ్రీలంక, పాకిస్తాన్, నేపాల్ తదితర దేశాలకూ వైరస్ వ్యాప్తి చెందడంతో కేంద్రప్రభుత్వం మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖకు ఆదేశాలు జారీ చేసింది. ఇంతకుముందు చేసిన మార్గదర్శకాలకు అదనంగా కొన్ని సూచనలు చేసింది. ఇప్పటివరకు చైనా, హాంకాంగ్, సింగపూర్, మలేషియా వంటి దేశాల నుంచి వచ్చే ప్రయాణికులపైనే ప్రత్యేకంగా దృష్టి సారించగా, ఇప్పుడు అదనంగా దక్షిణ కొరియా, జపాన్, వియత్నాం, ఇటలీ, ఇరాన్, నేపాల్, పాకిస్తాన్, శ్రీలంకల నుంచి వచ్చే ప్రయాణికులపైనా కూడా కేంద్రీకరించాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు ఈ దేశాల నుంచి ఇతర దేశాలకు వెళ్లి, అక్కడి నుంచి వచ్చేవారు నేరుగా ఇళ్లకు వెళ్తున్నారని, వారిలో ఎవరికైనా కోవిడ్ అనుమానిత లక్షణాలుంటే గుర్తించాలని, వారి వివరాలు సేకరించాలని ప్రత్యేక ఆదేశాలు ఇ చ్చింది. కేవలం చలి ప్రదేశాల్లో మాత్రమే కాకుండా, ఇతర ప్రాంతాల్లోనూ వైరస్ బలపడుతుందన్న భావనలో వైద్య ఆరోగ్యశాఖ ఉంది. వుహాన్ నగరంలో చలి తీవ్రత అధికంగా ఉండటం వల్లే వైరస్ వ్యాప్తి చెందిందన్న భావనతో ఇప్పటివరకు ఉన్న అధికారులు, అది కాస్తా ఉష్ణోగ్రత అధికంగా ఉండే కొన్ని దేశాలకు పాకడంతో నిర్లక్ష్యం ప్రదర్శించకూడదని కేంద్రం స్పష్టం చేసినట్లు వైద్య వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటివరకు కేవలం హైదరాబాద్‌లో గాంధీ, ఫీవర్, ఛాతీ ఆసుపత్రుల్లో మాత్రమే వైరస్ నియంత్రణ కోసం ప్రత్యేక పడకలను ఏర్పాటు చేసిన అధికారులు, ఇక నుంచి జిల్లా స్థాయి ఆసుపత్రుల్లోనూ ఐసోలేషన్ వార్డులు, పడకలు, ఎన్95 మాస్క్‌లను కూడా సిద్ధం చేయాలని నిర్ణయించారు. కోవిడ్ వైరస్ నేపథ్యంలో గత నెల నుంచి ఇప్పటివరకు నిర్ణీత దేశాల నుంచి వచ్చిన వారిలో 14,472 మందికి రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు. ఇదిలాఉండగా రాష్ట్రంలో కోవిడ్ వైరస్ నియంత్రణ చర్యలను సమీక్షించేందుకు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ అధికారి లవ్ అగర్వాల్ నేతృత్వంలోని బృందం వచ్చే నెల 2 లేదా 3న రాష్ట్రానికి వస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇక ఇటీవల వుహాన్ నగరం నుంచి మన దేశానికి వచ్చిన 112 మందిని ఇప్పటివరకు ఢిల్లీలో ప్రత్యేక ఐసోలేషన్ వార్డుల్లో ఉంచారు. వారిని త్వరలో వారి సొంత రాష్ట్రాలకు పంపనున్నట్లు కేంద్రం తెలిపింది. అందులో ఎంతమంది తెలుగువారున్నారన్న దానిపై తమకు సమాచారం లేదని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. -
బొగ్గు ఉత్పత్తి పెంచాలి
ఆర్జీ–1 సీజీఎం వెంకటేశ్వర్రావు గోదావరిఖని : వర్షాకాలంలో బొగ్గు ఉత్పత్తి పెంచడానికి చర్యలు తీసుకోవాలని ఆర్జీ–1 సీజీఎం సీహెచ్.వెంకటేశ్వర్రావు కోరారు. ఆర్జీ–1 జీఎం కార్యాలయంలోని కాన్ఫరెన్స్హాల్లో బుధవారం అన్ని గనులు, డిపార్ట్మెంట్ల ఉన్నతాధికారులు, మేనేజర్లు, ఏజెంట్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. వర్షాకాలంలో తగ్గుదలకు కారణాలు, ఉత్పత్తి పెంచడానికి తీసుకోవాల్సిన చర్యలపై ఆయన అధికారులకు సూచనలు చేశారు. వర్షాకాలంలో బొగ్గు ఉత్పత్తి తగ్గకుండా, రాబోయే రోజులలో ఉత్పత్తిని పెంచే దిశగా అందరూ కృషి చేయాలన్నారు. అందుకు కావాల్సిన అన్ని సదుపాయాలను యాజమాన్యం అందించడానికి సిద్ధంగా ఉందని, నిర్దేశించిన బొగ్గు ఉత్పత్తిని తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్‌ఓటూ సీజీఎం సుధాకర్‌రెడ్డి, ఏజెంట్లు సాంబయ్య, రమేశ్‌రావు, ఏజీఎంలు కృష్ణమూర్తి, ప్రసాద్, పర్సనల్ డీజీఎం హనుమంతరావు, అధికారులు బూర రవీందర్, రమణ, గోపాల్‌సింగ్, సాయిరాం తదితరులు పాల్గొన్నారు.