- ఆర్జీ–1 సీజీఎం వెంకటేశ్వర్‌రావు
బొగ్గు ఉత్పత్తి పెంచాలి
Published Wed, Aug 10 2016 11:24 PM | Last Updated on Sun, Sep 2 2018 4:16 PM
గోదావరిఖని : వర్షాకాలంలో బొగ్గు ఉత్పత్తి పెంచడానికి చర్యలు తీసుకోవాలని ఆర్జీ–1 సీజీఎం సీహెచ్.వెంకటేశ్వర్‌రావు కోరారు. ఆర్జీ–1 జీఎం కార్యాలయంలోని కాన్ఫరెన్స్‌హాల్‌లో బుధవారం అన్ని గనులు, డిపార్ట్‌మెంట్ల ఉన్నతాధికారులు, మేనేజర్లు, ఏజెంట్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. వర్షాకాలంలో తగ్గుదలకు కారణాలు, ఉత్పత్తి పెంచడానికి తీసుకోవాల్సిన చర్యలపై ఆయన అధికారులకు సూచనలు చేశారు. వర్షాకాలంలో బొగ్గు ఉత్పత్తి తగ్గకుండా, రాబోయే రోజులలో ఉత్పత్తిని పెంచే దిశగా అందరూ కృషి చేయాలన్నారు. అందుకు కావాల్సిన అన్ని సదుపాయాలను యాజమాన్యం అందించడానికి సిద్ధంగా ఉందని, నిర్దేశించిన బొగ్గు ఉత్పత్తిని తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్‌ఓటూ సీజీఎం సుధాకర్‌రెడ్డి, ఏజెంట్లు సాంబయ్య, రమేశ్‌రావు, ఏజీఎంలు కృష్ణమూర్తి, ప్రసాద్, పర్సనల్ డీజీఎం హనుమంతరావు, అధికారులు బూర రవీందర్, రమణ, గోపాల్‌సింగ్, సాయిరాం తదితరులు పాల్గొన్నారు.
Advertisement