Ayurvedic doctors
-
బరువు పెరగాలనుకునే వారికి ఈ పూరీలు మేలు!
కొంతమంది ఆహార్యం చాలా బక్కపలచగా ఉంటుంది. ఎంత తిన్న వంటబట్టదు. చూడటానికి బలహీనంగా, అందవిహీనంగా ఉంటారు. కాస్త ఫిజిక్ ఉంటే చూడటానికి అందంగా అనిపిస్తారు. అదికూడ లేకపోతే.. పేషెంట్ మాదిరిగా ఉన్నాడ్రా బాబు అనేస్తారు. గాలి వీస్తే ఎగిరిపోయేలా ఉన్నా ఇబ్బందే!. అలాంటి వారు బరువు పెరగాలనకుంటే ఏం చేయాలంటే.. బరువు పెరగాలన్న ఆత్రుతలో ఎలా పడితే అలా తినేయ్యకూడదు. ముందు మన శరీరానికి ఏం పడతాయి, ఏవైతే బెటర్ అనేది నిర్థారించుకోవాలి. ఆ తర్వాత వాటిని క్రమబద్ధంగా ఓ నియమానుసారంగా తీసుకుంటేనే చక్కటి ఫలితం ఉంటుంది. ముఖ్యంగా మంచి న్యూట్రిషియన్లు లేదా వైద్యులను సంప్రదించి మంచి డైట్ పాలో అవ్వాలి. ఇలా లావు అవ్వలేకపోతున్నాం అని బాధపడే వాళ్లు ఈ పూరీలు గనుకు తింటే కచ్చితంగా లావువుతారని చెబుతున్నారు ఆయుర్వేద నిపుణులు. ఏంటా పూరీలు..? ఎలా తయారు చేస్తారంటే..? నెయ్యితో చేసే పూరీలు.. నెయ్యితో చేసిన పూరీలు తింటే బరువు పెరగడమే గాక కండరాలు, ఎముకలు బలంగా మారతాయి. ఎలా చెయ్యాలంటే.. నెయ్యి పూరీలు తయారీకి కావాల్సిన పదార్థాలు.. గోధుమపిండి: ఒక కప్పు పాలు: 1/2 కప్పు పటికబెల్లం పొడి: సరిపడ నెయ్యి తయారీ విధానం: ముందుగా పాలలో సరైన మొత్తంలో పటికబెల్లం పొడి వేయండి. ఈ పాలతో కప్పు గోధుమ పిండిని కలిపి పూరీ పిండిలా చేయండి. దీనిని చిన్న చిన్న ఉండల్లా చేసి పూరీలు చేయండి.ఈ పూరీలను నెయ్యిలో వేసి వేయించండి. వాటిలో గనుకు ఎక్స్ట్రా నెయ్యి ఉంటే టిష్యూలు వాడండి. ఈ పూరీలను కొబ్బరిచట్నీతో తింటే ఆ టేస్టే వేరబ్బా. రుచికి రుచిగా ఉండటమే గాక ఈజీగా బరువు పెరుగుతారు. ఎలాంటి వారు తినకూడదంటే.. ఈ ఫుడ్ హెవీగా ఉంటుంది. కఫం పెరుగుతుంది. కాబట్టి, షుగర్, పీసీఓఎస్, హైపోథైరాయిడిజం, అధిక బరువు, జీర్ణ సమస్యలు ఉన్నవారు ఈ ఫుడ్‌ని తినొద్దు. గమనిక: ఆరోగ్య నిపుణుల అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం అవగాహన కోసమే. దీన్ని ఫాలో అయ్యే ముందు వ్యక్తిగత వైద్యుల సలహాలు, సూచనల మేరకు ప్రయత్నించడం మంచిది. View this post on Instagram A post shared by Dr. Rekha Radhamony, 4th Gen Ayurveda Doctor (BAMS) (@doctorrekha) (చదవండి: కొండెక్కిన వెల్లుల్లి ధరలు చూసి భయపడొద్దు..ఈ చిట్కాలు ఫాలోకండి!) -
పారని మంత్రం... లొంగని రోగం
ఒక ఊరిలో ఓ పెద్దాయన ఉండేవాడు. విశ్రాంత ఉపాధ్యాయుడు కావడంతో అల్లరి చిల్లరగా తిరుగుతున్న పిల్లలను చేరదీసి వారికి నాలుగు అక్షరం ముక్కలు చెప్పి మంచిదారిలో పెట్టేందుకు ప్రయత్నించేవాడు.పూర్వులు ఆయుర్వేద వైద్యులు కావడంతో తన దగ్గరకు వచ్చే పేద వారి చిన్నాచితకా రోగాలకు ఉచితంగా మందులు ఇచ్చి, ఉపశమనంగా మంచిమాటలు చెప్పేవాడు. ఆయనిచ్చే మందులకన్నా, అనునయపూర్వకంగా ఆయన చెప్పే మాటలు వారికి ధైర్యాన్నిచ్చేవి. దాంతో ఆయా రోగాలు తొందరగా తగ్గిపోయేవి. ఓ రోజు ఆయన దగ్గరకు తేలుకుట్టిందని ఏడుస్తూ పెడబొబ్బలు పెడుతున్న ఒక బాలుణ్ణి తీసుకొచ్చారు ఊరిలో జనం. పంతులుగారు పూజామందిరంలోకెళ్లి దేవుళ్ల పటాల ముందు రాలిపడి ఉన్న పసుపు, విభూది, గంధం వంటివాటిని పోగుచేసి, బాలుడికి తొందరగా తగ్గించమని కోరుతూ దేవుడికి దణ్ణం పెట్టుకుని వచ్చి ఏవో మంత్రాలు చదువుతున్నట్లు పెదవులు కదిలిస్తూ ఆ పిల్లాడికి తేలుకుట్టిన చోట రాసి, వెంటనే తగ్గిపోతుందిలే అంటూ ధైర్యం చెప్పాడు. నిజంగానే కాసేపటికల్లా ఆ పిల్లాడికి నొప్పి తగ్గిపోవడంతో పిల్లాడి తల్లి, కూడా వచ్చినవాళ్లు వెళ్లి ఆ విషయాన్ని ఊరంతా చెప్పారు. అప్పటినుంచి ఆ పెద్దాయన తేలుకాటుకు మందు ఇస్తాడన్న పేరొచ్చింది. దాంతో ఎవరికి తేలుకుట్టినా సరే, ఆ పెద్దాయన దగ్గరకు తీసుకురావడం, ఆయన పూజామందిరంలోని విభూతి, పసుపు గాయానికి రాయడం, వాటినే ఓ చిటికెడు గ్లాసు నీటిలో కలిపి తాగించేవాడు. చిత్రంగా వారికి ఆ బాధ తగ్గిపోయేది. వారు ఆయనకు తృణమో పణమో ఇచ్చివెళ్లేవారు. ఆ మంత్రాన్ని తమకు చెప్పమని కొందరు, ఆ మందు తయారీ విధానాన్ని తమకు నేర్పమని పెద్దాయన చుట్టూ తిరిగేవారు. ఓ రోజున ఈ పెద్దాయనకు పాము కరిచింది. తనకు ఏ మంత్రమూ రాదని, ఏ మందూ తెలియదని, బాధితులకు త్వరగా నయం కావాలని కోరుకుంటూ ఉట్టి పసుపు నీళ్లే ఇస్తానని, తనను వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లమని ఊరిలో వాళ్లని బతిమాలుకుంటేగానీ జనాలు ఆయనని ఆసుపత్రికి తీసుకువెళ్లలేదు. ఆస్పత్రిలో ఇచ్చిన మందులతో తొందరలోనే కోలుకుని ఇంటికి వచ్చాడు పెద్దాయన. ఆ తర్వాత ఎవరికైనా ఏదైనా జబ్బు వచ్చినా, తేలుకుట్టినా ఈయన దగ్గరకు తీసుకు వచ్చేవారి సంఖ్య తగ్గిపోయింది. ఒకవేళ తీసుకు వచ్చినా కూడా వారికి తగ్గేది కాదు. అందుకే అన్నారు వైద్యం, మంత్రం, పూజ, జపం వంటివి నమ్మకం ఉంటేగానీ ఫలించవని... – డి.వి.ఆర్. -
మన తొలి డాక్టర్లు
నేడు డాక్టర్స్ డే కాయకల్ప చికిత్సల నాటి కాలం నుంచి నేడు కార్పొరేట్ చికిత్సలు పొందుతున్నాం. చిట్కా వైద్యాల కాలం నుంచి మోడరన్ మెడిసిన్ వైపు పురోగమిస్తున్నాం. ఆధునిక వైద్యం అందుబాటులోకి రాక ముందు మనకు వైద్యులే లేరా? బీసీనాటి కాలంలో భిషగ్వరులే లేరా? ఉన్నారు! అనాదిగా జరిగిన పరిశోధనలతో మన వైద్యశాస్త్రాన్ని పరిపుష్ఠం చేసిన మన పూర్వ ఆయుర్వేద డాక్టర్లలో కొందరి గురించి కొంత... వారు చెప్పిన అంశాల్లో నేటికీ పాటిస్తున్న వివరాల గురించి మరికొంత... చరకుడు మన భారతీయ వైద్యానికి మూలపురుషులుగా భావించే వారిలో చరకుడు ఒకరు. ఆయన జీవించిన కాలం క్రీస్తుపూర్వం రెండో శతాబ్దం. నిజానికి అంతకు ముందు నుంచీ వైద్యచికిత్స ప్రక్రియలు అందుబాటులో ఉన్నాయి. క్రీస్తుపూర్వం 10వ శతాబ్దంలోనే పునర్వస ఆత్రేయుడు మౌఖికంగా వైద్యచికిత్సల గురించి చెబుతూ ఉండగా అగ్నివేశుడు అనేక అంశాలను గ్రంథస్తం చేసినట్లు దాఖలాలు ఉన్నాయి. అయితే వాటిలోని చాలా విషయాలను క్రీ.పూ. రెండో శతాబ్దంలో చరకుడు సంస్కరించారు. ఆ తర్వాత దృఢబలుడు అనే వైద్యనిపుణుడు సైతం అందులోని అనేక విషయాలను సమీక్షిస్తూ మళ్లీ సంస్కరించారు. అయితే తొలినాటి చరకుడి పేరిటే ఆ వైద్యశాస్త్రమంతా చెలామణీ అయ్యేలా దృఢబలుడు గౌరవించాడు. దాంతో ఆ వైద్యగ్రంథమంతా ‘చరకసంహిత’గానే ప్రఖ్యాతి పొందింది. అనేక వైద్యశాఖలకు చెందిన విషయాలను ఒకే చోట చెప్పారు కాబట్టే వాటిని ‘సంహిత’గా ప్రస్తావించారు. చరక సంహితలో పేర్కొన్నవే అయినా ఆధునిక వైద్యం కూడా ఇప్పటికీ పాటిస్తున్న అంశాల్లో కొన్ని... * ఆమలకీ (ఉసిరికాయ) తింటే శతాయుష్షు కలుగుతుంది. రోగనిరోధక శక్తిని కలిగించే విటమిన్-సి పుష్కలంగా దొరికే స్వాభావికమైన పదార్థాలలో ఉసిరి చాలా ప్రధానం. అందుకే ఉసిరికాయతో వ్యాధులన్నీ దూరం. * ఆధునికభాషలో చెప్పాలంటే సంభోగశక్తి పెంచే మందులను ఆఫ్రోడెసియాక్స్ అంటారు. ఆయుర్వేదంలో దీనికి ఓ ప్రత్యేక శాస్త్రం ఉంది. దాని పేరే ‘వాజీకరణం’. ఇందులోని అనేక వైద్యచికిత్సలను ఆయుర్వేద వైద్యులు ఇప్పటికీ అనుసరిస్తున్నారు. ఉదాహరణకు పిప్పరీక్షీరం, యష్టిమధుచూర్ణం, శతావరిఘృతం. * పక్షవాతానికి ‘వస్తి’కర్మ అనే ప్రక్రియను ప్రయోగించి ఫలితాలు సాధించాడు చరకుడు. కషాయాలను శరీరంలోకి పంపే నిరూహవస్తి, ఔషధతైలాలతో చికిత్స చేసే అనువాసనవస్తి... ఈ రెండిటికీ మరో మూడు చికిత్సలు (వమన, విరేచన, నస్య) జోడించి... మొత్తం ఐదుగా కూర్చి వాటిని ‘పంచకర్మ’ చికిత్సలు అంటూ ఇప్పటికీ అనుసరిస్తున్నారు ఆయుర్వేద నిపుణులు. * విషపదార్థాలను టాక్సిన్స్ అంటారన్న విషయం తెలిసిందే. అవే విషాలను ప్రమాదకరం కాని విధంగా చాలా కొద్ది మోతాదుల్లో తీసుకుంటే అమృతమవుతాయని చెప్పాడు చరకుడు. ఎన్నో వైద్య విధానాల్లో ఈ మార్గం ఇప్పటికీ అనుసరణీయం. వాగ్భటుడు చరక సుశ్రుత కాశ్యప సంహితల్లోని ముఖ్యాంశాలను సంక్షిప్తం చేసి, మరికొన్ని శాస్త్రాలను మిళితం చేసి సరళీకృతమైన సంస్కృతంలో అందించిన గ్రంథాలే... ‘అష్టాంగ సంగ్రహం’, ‘అష్టాంగ హృదయం’ . వీటిలో మొదటిదాన్ని రాసింది వృద్ధ వాగ్భటుడు. రెండోది రాసినవాడు లఘువాగ్భటుడు. వీటినే ‘వాగ్భట సంహిత’లని అంటారు. ఈ సంహితల్లో జ్వరాలను తగ్గించే ఎన్నో కష్టాలను పేర్కొన్నారు. త్రిదోషాల్లో ఒకటైన శ్లేషాన్ని (కఫం) అవలంబక, క్లేదక, బోధక, శ్లేషక, శ్లేష్మాలు అంటూ ఐదు రకాలుగా విభజించిన ప్రత్యేకత వీరిది. చరక, సుశ్రుత, వాగ్భటులను వృద్ధత్రయం అంటారు. సుశ్రుతుడు చరకసంహిత లాగే సుశ్రుతుడి పేరు పెట్టుకున్న అనేక వైద్యవిధానాలను పేర్కొన్న ఇది కూడా అనేకమంది వైద్యులు తమ పరిజ్ఞానాన్ని పొందుపరిచిన గ్రంథం. ఇందులో ఇద్దరు సుశ్రుతులున్నారు. ఒకరు వృద్ధ సుశ్రుతుడు. ఈయన ‘దివోదాస ధన్వంతరి’ అనే వైద్యుడి శిష్యుడు. వీరి కాలం సుమారు 10-15 బీసీ. వీరు రచించిన గ్రంథమే సుశ్రుతసంహిత. అయితే దీన్ని మరొక సుశ్రుతుడు (ఆయన కాలం క్రీ.శ. రెండో శతాబ్దం) సంస్కరించాడు. ఆ తర్వాత క్రీ.శ. ఐదో శతాబ్దంలో నాగార్జునుడు దీనికి ‘ఉత్తర తంత్రాన్ని’ చేర్చాడు. ఆధునిక వైద్యశాస్త్రంలో శస్త్రచికిత్సగా పేర్కొనే సర్జరీ ప్రక్రియను సుశ్రుత సంహితలో నిపుణులు పేర్కొన్నారు. శస్త్రచికిత్స చేసే ఎన్నో ఉపకరణాలనూ, శస్త్రాలనూ వారు వర్ణించారు. వారు పేర్కొన్నవీ... ఆధునిక శస్త్రచికిత్సల్లో ఉపకరించేవీ అయిన ఉపకరణాలు ఉదాహరణకు కొన్ని... జలోదర యంత్ర అంటే... అసైటిస్ కాన్యులా అర్ధధార శస్త్ర (స్కాల్పెల్) పూర్ణగర్భవతి మరణిస్తే, పొట్టలో కదలికలు కనిపిస్తే అప్పుడు ఉదరచ్ఛేదనం చేసి శిశువును వెలికి తీయవచ్చని ఆయుర్వేదం చెబుతుంది. ‘‘వస్తమార విపన్నాయాః కుక్షి ప్రస్పందతేయది, తక్షణాత్ జన్మకావే తత్పాటయిత్వా ఉద్ధరేత్ భిషక్’’ చికిత్సకు లొంగని కొన్ని పుండ్ల (దుష్టవ్రణాలు) విషయంలో జలగలను ప్రయోగించి సత్ఫలితాలను రాబట్టారు. మోడ్రన్ మెడిసిన్‌లో లీచ్ థెరపీ అని పేర్కొనే విధానం ఇది. భగందరవ్యాధి (ఫిస్టులా)కి క్షారసూత్ర ప్రక్రియ ద్వారా ఫలితం ఉంటుందని నిరూపించాడు. ఇప్పటికీ చాలామంది ఆధునిక శస్త్రకారులు సైతం ఈ ప్రక్రియను ప్రయోగిస్తున్నారు. మరి కొంతమంది కశ్యప కశ్యప సంహిత అని పేరొందిన వైద్యశాస్త్ర అంశాలను మరీచి కశ్యపుడు అనే నిపుణుడు బోధిస్తుండగా ‘వృద్ధజీవకుడు’ అనే ఆయన రాశారు. దీన్నే ‘వృద్ధజీవకతంత్రం’గా పేర్కొంటారు. దీన్నే కాశ్యపసంహిత అని కూడా అంటారు. ఈ సంహిత క్రీ.పూ. ఆరోశతాబ్దికి చెందింది. ఇక్కడ పేర్కొన్న కశ్యపుడితో బాటు చరిత్రలో ఇతర కశ్యపులూ ఉన్నారు. ఈ కశ్యపుల్లో ఒకరు ‘కౌమారభృత్య’ నిపుణుడు. అంటే ప్రసూతి చికిత్సలు, స్త్రీ సంబంధిత రోగాల ప్రత్యేక నిపుణుడు అని అర్థం. ‘కౌమరభృత్యం’ అంటే స్త్రీలకు, శిశువులకు చెందిన ప్రత్యేక విభాగాలకు చెందిన శాస్త్రపరిజ్ఞానం అన్నమాట. ఇందులో శిశువు శారీరక, మానసిక వికాస వివరాలు (గ్రోత్ అండ్ డెవలప్మెంట్ మైల్‌స్టోన్స్) ఉన్నాయి. గర్భణీ పరిచర్యలనూ (యాంటీనేటల్ కేర్) వివరించారు. ఆధునిక కాలంలో ఇమ్యూనైజేషన్‌ను పోలిన కొన్ని ప్రక్రియలనూ ఈ విభాగంలో వివరించారు. ఇక వృద్ధత్రయం లాగే లఘుత్రయంలోనూ ముగ్గురు వైద్యనిపుణులున్నారు. వారు క్రీ.శ. ఏడో శతాబ్దానికి చెందిన మాధవకరుడు, పదమూడో శతాబ్దానికి చెందిన శారంగధరుడు, పదహారో శతాబ్దానికి చెందిన భావమిశ్రుడు. మాధవకరుడు ఈయన మాధవనిదానం అనే గ్రంథాన్ని రాశాడు. మాధవకరుడు ఆమవాత (రుమాటిక్ ఆర్థరైటిస్), అమ్లపిత్త (హైపర్ అసిడిటీ/ గ్యాస్ట్రైటిస్) పరిణామశూల (పెప్టిక్ అల్సర్స్) వ్యాధులు, వాటి చికిత్సలను విశదీకరించాడు. శారంగధరుడనే పండితుడు రాసిన గ్రంథానికి శారంగథర సంహిత అని పేరు. దీనికి కూడా మంచి ప్రామాణికత ఉంది. లఘుత్రయంలో శారంగధరుడు కూడా మంచి పేరు గడించాడు. సిద్ధనాగార్జునుడు వనాల నుంచి లభ్యమయ్యే ఔషధ ద్రవ్యాల చికిత్సలో ఉండే కష్టనష్టాలను అధిగమించడానికి మన తెలుగు రాష్ట్రాలలోని శ్రీశైలం ప్రాంతాలలో దొరికే ఖనిజధాతులను శుద్ధి చేసి, ఔషధాలుగా రూపొందించడానికి బాటలు వేశాడు. నిజానికి ఇది ఆయుర్వేదంలో విప్లవశకం. దీన్ని రసశాస్త్ర విప్లవంగా పేర్కొన్నవచ్చు. ‘రస’ అంటే ఇక్కడ పాదరసం. అలాగే రకరకాల ఔషధ నిర్మాణ పద్ధతులనూ (ఫార్మస్యూటికల్ మెథడ్స్) కూడా ప్రస్తావించాడు. ప్రతి మందుకూ మోతాదు (డోసేజ్) నిర్ణయించాడు. భావమిశ్రుడు ఆయుర్వేదంలో పచ్చిమిరపకాయను ప్రవేశపెట్టినది భావమిశ్రుడే. అంతవరకు కారానికి మిరియాలు (మరీచ) వాడటం మాత్రమే ఉండేది. ఫిరంగి రోగాన్ని (సిఫిలిస్)ను గుర్తించాడు. ఎన్నో విలువైన వైద్య పరిశోధనలలో పాలుపంచుకున్న మన పూర్వవైద్యులలో వీరు కొందరు మాత్రమే! ఆ కాలంలోనూ కొందరు కొన్ని ప్రత్యేక వైద్య విభాగాలలో సైతం నైపుణ్యం సాగించారు. ఉదాహరణకు చరకుడు కాయ చికిత్స (జనరల్ మెడిసిన్), సుశ్రుతుడు శల్యతంత్రం (జనరల్ సర్జరీ), కశ్యపుడు కౌమారభృత్య (శిశువైద్యం లేదా పీడియాట్రిక్స్) వంటి వాటిల్లో నైపుణ్యం సాగించారని ప్రతీతి. అయితే వారు వైద్యశాస్త్ర అంశాలన్నింటినీ ఒకే గ్రంథంగా ఒకేచోట కూర్చారు. దాంతో ఆ వైద్యశాస్త్ర గ్రంథాలు ప్రత్యేక విభాగాలుగా గాక... కూర్పు చేసిన పుస్తకాలను సూచించే విధంగా సంహితలు అని పేరొందాయి. - డాక్టర్ వృద్ధుల లక్ష్మీనరసింహశాస్త్రి ఆయుర్వేద నిపుణులు, సౌభాగ్య ఆయుర్వేదిక్ క్లినిక్, హుమాయూన్‌నగర్, హైదరాబాద్ -
వెన్నునొప్పి... అశ్రద్ధ చేస్తే వైకల్యమే
వెన్నుపూస ఒక పవర్‌హౌస్ లాంటిది. దీని ద్వారా కాళ్లు, చేతులు, తల, భుజాలు, మెడకు పవర్ సప్లై అవుతుంది. శరీరం మొత్తాన్ని స్థిరంగా ఉండేలా చేస్తుంది. కొన్ని కారణాలవల్ల ఒక్కోసారి ఈ పవర్ హౌస్ నిర్జీవం అవుతుంది. దీని వలన భుజం, మెడ నొప్పులు, వెన్ను భాగంలో మొద్దుబారినట్లు, బలహీనపడినట్లు చురకలు, పోట్లు, మంటలు మొదలవుతాయి. వీటన్నింటికీ పరిష్కారం కేరళ ఆయుర్వేద పంచకర్మ చికిత్సలే అంటున్నారు ఆయుర్వేద వైద్యులు డాక్టర్ పి.కృష్ణ ప్రసాద్. మన జీవితం ఒక్కోసారి నడి సముద్రంలో నావలా ఇరుక్కుపోతుంది. ఎటు పోవాలో దిక్కుతోచదు. క్రమేపీ అన్ని దారులూ మూసుకుపోతాయి. తీవ్రమైన మెడ, నడుము నొప్పితో పాటు క్రమేపి రెండు చేతుల్లో విపరీతమైన తిమ్మిర్లు వస్తాయి. ఒక దశలో బలం కోల్పోయి పట్టుతప్పి తెలియకుండానే వస్తువులు జారిపోతుం టాయి. ప్రతిసారీ విశ్రాంతి తీసుకోవాలంటే కుదరని పరిస్థితుల్లో పని ఒత్తిడి పెరిగితే కళ్లు తిరుగుతాయి. పడుకున్నప్పుడు తలకింద పెట్టుకున్న చేతులు కొద్ది సేపటికి మొద్దుబారినట్లుగా ఉంటాయి. దీంతోపాటు తీవ్రమైన నడుము నొప్పి రెండు కాళ్లలో తిమ్మిర్లు, పోట్లు, చెమట వంటివి వస్తాయి. నడవాలంటే తూలి పడిపోతున్న భయం, వెన్ను, నడుం, మెడతో పాటు, అధిక బరువు, మధుమేహం తదితర సమస్యలతో బాధపడుతుంటారు. ఆయుర్వేదంలో వీటిని వాతానికి సంబంధించిన వ్యాధులుగా పరిగణిస్తారు. సర్జరీతో ఒరిగేదేమిటి? వెన్నునొప్పితో వెళితే మొదటిగా అల్లోపతి పెయిన్ కిల్లర్‌స, బెడ్ రెస్ట్ తీసుకోమం టారు. పెయిన్ కిల్లర్‌స అదేపనిగా వాడటం వల్ల దుష్ఫలితాలు అనేకం. కడుపు ఉబ్బరం, లివర్, కిడ్నీలు దెబ్బతినడం వంటి సమస్యలు ఉత్పన్నం కావచ్చు. దీంతో ఇక సర్జరీకి వెళ్లినా శాశ్వత పరిష్కారం దొరకదు. ఏం జరుగుతుంది? మొదట్లో నొప్పి వెన్ను ప్రాంతంలోనే వస్తుంది. వెన్ను భాగంలో కండరాలు బలహీనమవుతాయి. తరువాత మెడ, నడుము, వెన్నుపూసలో డిస్క్ పక్కకు జరిగి వెన్నుపూస నరాల మీద ఒత్తిడి పడుతుంది. కారణం మెడ, నడుము దగ్గరున్న కండరాలు బలహీన పడటమే. ఈ కండరాలన్నీ వెన్నుపాముతో సంబంధం కలిగి ఉంటాయి. ఆయుర్వేదం ఏం చేస్తుంది? ఆయుర్వేదంలో వెన్నునొప్పి రావడానికి కారణాలను పరీక్షలతో తెలుసుకుంటారు. తరువాత ఆయుర్వేదంలో ప్రత్యేకంగా చెప్పిన కేరళ ఆయుర్వేద పంచకర్మ చికిత్సలు, మర్మ చికిత్సలు, మేరు చికిత్సలు కీలక పాత్ర పోషిస్తాయి. ఈ విధానంలో ఔషధాలతో తయారు చేసిన అత్యంత సారవంతమైన కేరళ నూనెలతో వెన్నుభాగం అంతా మర్దనచేసి కండరాలకు బలాన్నిచ్చే కటిబస్తి, గ్రీవబస్తి, కటిధార చికిత్సలు చేస్తారు. వీటితో పాటు పంచకర్మలో ముఖ్యమైన వస్తి, విరోచనం చికిత్సలు చాలా ముఖ్యం. వీటివల్ల నొప్పి రావటానికి ఉన్న దోషాలను సమూలంగా, శాశ్వతంగా శరీరం నుంచి బయటకు పోతాయి. కనుక తీవ్ర వెన్నునొప్పితో బాధపడుతున్నవారు కేరళ ఆయుర్వేదంలోని పంచకర్మ చికిత్సలతో పునఃశక్తి పొంది వెన్నెముక బలంగా తయారై... పవర్‌హౌస్ సక్రమంగా పనిచేసేట్టు చేయవచ్చు. అడ్రస్ శ్రీ చరక కేరళ ఆయుర్వేదిక్ హాస్పిటల్, బిసైడ్ ఎస్.బి.హెచ్, నియర్ జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్, రోడ్ నం 17, హైదరాబాద్, వివరాలకు: పి.కృష్ణ ప్రసాద్. 9030013688/9440213688/040& 65986352 E mail: krishnaprosad.6600@gmail.com