వెన్నునొప్పి... అశ్రద్ధ చేస్తే వైకల్యమే
వెన్నుపూస ఒక పవర్‌హౌస్ లాంటిది. దీని ద్వారా కాళ్లు, చేతులు, తల, భుజాలు, మెడకు పవర్ సప్లై అవుతుంది. శరీరం మొత్తాన్ని స్థిరంగా ఉండేలా చేస్తుంది. కొన్ని కారణాలవల్ల ఒక్కోసారి ఈ పవర్ హౌస్ నిర్జీవం అవుతుంది. దీని వలన భుజం, మెడ నొప్పులు, వెన్ను భాగంలో మొద్దుబారినట్లు, బలహీనపడినట్లు చురకలు, పోట్లు, మంటలు మొదలవుతాయి. వీటన్నింటికీ పరిష్కారం కేరళ ఆయుర్వేద పంచకర్మ చికిత్సలే అంటున్నారు ఆయుర్వేద వైద్యులు డాక్టర్ పి.కృష్ణ ప్రసాద్.
మన జీవితం ఒక్కోసారి నడి సముద్రంలో నావలా ఇరుక్కుపోతుంది. ఎటు పోవాలో దిక్కుతోచదు. క్రమేపీ అన్ని దారులూ మూసుకుపోతాయి. తీవ్రమైన మెడ, నడుము నొప్పితో పాటు క్రమేపి రెండు చేతుల్లో విపరీతమైన తిమ్మిర్లు వస్తాయి. ఒక దశలో బలం కోల్పోయి పట్టుతప్పి తెలియకుండానే వస్తువులు జారిపోతుం టాయి. ప్రతిసారీ విశ్రాంతి తీసుకోవాలంటే కుదరని పరిస్థితుల్లో పని ఒత్తిడి పెరిగితే కళ్లు తిరుగుతాయి. పడుకున్నప్పుడు తలకింద పెట్టుకున్న చేతులు కొద్ది సేపటికి మొద్దుబారినట్లుగా ఉంటాయి. దీంతోపాటు తీవ్రమైన నడుము నొప్పి రెండు కాళ్లలో తిమ్మిర్లు, పోట్లు, చెమట వంటివి వస్తాయి. నడవాలంటే తూలి పడిపోతున్న భయం, వెన్ను, నడుం, మెడతో పాటు, అధిక బరువు, మధుమేహం తదితర సమస్యలతో బాధపడుతుంటారు. ఆయుర్వేదంలో వీటిని వాతానికి సంబంధించిన వ్యాధులుగా పరిగణిస్తారు.
సర్జరీతో ఒరిగేదేమిటి?
వెన్నునొప్పితో వెళితే మొదటిగా అల్లోపతి పెయిన్ కిల్లర్‌స, బెడ్ రెస్ట్ తీసుకోమం టారు. పెయిన్ కిల్లర్‌స అదేపనిగా వాడటం వల్ల దుష్ఫలితాలు అనేకం. కడుపు ఉబ్బరం, లివర్, కిడ్నీలు దెబ్బతినడం వంటి సమస్యలు ఉత్పన్నం కావచ్చు. దీంతో ఇక సర్జరీకి వెళ్లినా శాశ్వత పరిష్కారం దొరకదు.
ఏం జరుగుతుంది?
మొదట్లో నొప్పి వెన్ను ప్రాంతంలోనే వస్తుంది. వెన్ను భాగంలో కండరాలు బలహీనమవుతాయి. తరువాత మెడ, నడుము, వెన్నుపూసలో డిస్క్ పక్కకు జరిగి వెన్నుపూస నరాల మీద ఒత్తిడి పడుతుంది. కారణం మెడ, నడుము దగ్గరున్న కండరాలు బలహీన పడటమే. ఈ కండరాలన్నీ వెన్నుపాముతో సంబంధం కలిగి ఉంటాయి.
ఆయుర్వేదం ఏం చేస్తుంది?
ఆయుర్వేదంలో వెన్నునొప్పి రావడానికి కారణాలను పరీక్షలతో తెలుసుకుంటారు. తరువాత ఆయుర్వేదంలో ప్రత్యేకంగా చెప్పిన కేరళ ఆయుర్వేద పంచకర్మ చికిత్సలు, మర్మ చికిత్సలు, మేరు చికిత్సలు కీలక పాత్ర పోషిస్తాయి. ఈ విధానంలో ఔషధాలతో తయారు చేసిన అత్యంత సారవంతమైన కేరళ నూనెలతో వెన్నుభాగం అంతా మర్దనచేసి కండరాలకు బలాన్నిచ్చే కటిబస్తి, గ్రీవబస్తి, కటిధార చికిత్సలు చేస్తారు. వీటితో పాటు పంచకర్మలో ముఖ్యమైన వస్తి, విరోచనం చికిత్సలు చాలా ముఖ్యం. వీటివల్ల నొప్పి రావటానికి ఉన్న దోషాలను సమూలంగా, శాశ్వతంగా శరీరం నుంచి బయటకు పోతాయి. కనుక తీవ్ర వెన్నునొప్పితో బాధపడుతున్నవారు కేరళ ఆయుర్వేదంలోని పంచకర్మ చికిత్సలతో పునఃశక్తి పొంది వెన్నెముక బలంగా తయారై... పవర్‌హౌస్ సక్రమంగా పనిచేసేట్టు చేయవచ్చు.
అడ్రస్
శ్రీ చరక కేరళ ఆయుర్వేదిక్ హాస్పిటల్, బిసైడ్ ఎస్.బి.హెచ్, నియర్ జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్, రోడ్ నం 17, హైదరాబాద్, వివరాలకు: పి.కృష్ణ ప్రసాద్. 9030013688/9440213688/040& 65986352
E mail: krishnaprosad.6600@gmail.com