vertebrae
-
వెన్నుపూస బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలి : సంపూ
పరకాల రూరల్ : వెన్నుపూస బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని తెలుగు సినిమా హీరో సంపూర్ణేష్ బాబు కోరారు. వెన్నుపూస బాధితుల సంఘం రాష్ట్ర స్థాయి సమావేశం మండలంలోని నార్లాపూర్ గ్రామంలో మంగళవారం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన సంపూర్ణేష్ బాబు మాట్లాడుతూ నడవలేక వెన్నుపూస సమస్యతో పూర్తిగా మంచానికే పరిమితమై దుర్భరజీవితం గడుపుతున్న బాధితుల సంక్షేమానికి ప్రభుత్వం కృషిచేయాలన్నారు. స్పైనల్‌కార్డ్ బాధిత దివ్యాంగులకు ప్రత్యేక ఫిజియోథెరపీ సెంటర్లను నెలకొల్పడంతోపాటు వైద్యఖర్చుల నిమిత్తం ప్రతి నెల రూ.10వేలను అందించాలని కోరా రు. వారికి బ్యాటరీ వీల్‌చైర్స్ అందించాల ని డిమాండ్ చేశారు. ఎన్పీఆర్డీ జాతీయ కన్వీనర్ టి.రాజేందర్ మాట్లాడుతూ స్పైనల్‌కార్డ్ బాధితులకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామన్నారు. కార్యక్రమంలో స్పైనల్‌కార్డ్ బాధితుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మహ్మద్ షఫీ అహ్మద్, ఉపాధ్యక్షుడు శ్రీధర్ రాజు, ఎన్పీఆర్డీ ఇండియా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహ్మద్మున్నా, అర్భన్, రూరల్ జిల్లా అధ్యక్షులు వద్దె మానుకోట తిరుపతి, అడ్డరాజు, నియోజకవర్గ ఇంచార్జ్ లాసాని నర్సింగారావు, రాములు, రఘుపాల్‌రెడ్డి, రాముడు, రత్నాకర్‌రెడ్డి పాల్గొన్నారు. -
వెన్నుపూసల మధ్య వాపు... తగ్గుతుందా?
హోమియో కౌన్సెలింగ్స్ నా వయసు 28 ఏళ్లు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ని. రెండేళ్ల నుంచి చాలాసేపు కూర్చున్న తర్వాత లేవలేక, నడవలేకపోతున్నాను. వెన్నుపూసలో పట్టివేసినట్లు ఉంటోంది. హెచ్ఎల్ఏ బి27 పాజిటివ్ వచ్చింది. నా సమస్యకు హోమియోలో చికిత్స ఉందా? – అనిల్‌కుమార్, హైదరాబాద్ మీరు చెబుతున్న అంశాలను బట్టి చూస్తే మీరు యాంకిలోజింగ్ స్పాండిలైటిస్‌తో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఇది దీర్ఘకాలికంగా బాధించే సమస్య. ఇది ఒక ఆటోఇమ్యూన్ డిజార్డర్. అంటే తమ వ్యాధి నిరోధక శక్తే తమకు ప్రతికూలంగా పనిచేయడం వల్ల వచ్చే సమస్య. ముఖ్యంగా కీళ్లు, వెన్నెముక భాగాలలో సమస్యను కలిగిస్తుంది. యుక్తవయస్కులు అంటే... సాధారణంగా 18–30 ఏళ్ల వారిలో కీళ్లు, మెడ బిగుసుకొని, నొప్పి ఎక్కువగా ఉంటుంది. ఈ వ్యాధి పురుషుల్లో చాలా సాధారణం. అంతేకాదు... మరీ ఎక్కువ తీవ్రతతో కూడా వస్తుంది. హెచ్ఎల్ఏ బి27 అనే ప్రోటీన్ గల జన్యువు ఉన్నవారిలో ఈ సమస్య వచ్చే అవకాశం ఎక్కువ. యాంకిలోజింగ్ స్పాండిలైటిస్ సమస్య వెన్నుపూసల మధ్య వాపును కలగజేస్తుంది. ఈ వాపు వచ్చిన డిస్క్‌లు వెన్నెముకను పైకి పైకి జరుపుతాయి. ఫలితంగా ఇది పెల్విస్ భాగంలోని కీళ్లను ప్రభావితం చేస్తుంది. కారణాలు : ∙వాతావరణ/పర్యావరణ సంబంధిత అంశాలు ∙బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్తో ∙వంశపారం పర్యం/జన్యుపరంగా వచ్చే అవకాశాలు ఉంటాయి. లక్షణాలు : ∙కంటి సమస్యలు కనిపిస్తాయి. కళ్లు ఎర్రబారతాయి. ∙కీళ్లు, మెడ బిగుసుకు పోతాయి. నొప్పి తీవ్రత ఎక్కువగా ఉంటుంది ∙నడుము నొప్పి, శరీరంలో చాలా చోట్ల స్టిఫ్నెస్ వస్తుంది. ∙శరీరకంగా కదలికలు తగ్గుతాయి. చికిత్స : యాంకిలోజింగ్ స్పాండిలైటిస్‌ను హోమియో మందులతో పూర్తిగా తగ్గించవచ్చు. ఇటీవల అందుబాటులోకి వచ్చిన బయలాజికల్ మందులు వ్యాధి పెరగడాన్ని నిరోధిస్తాయి. హోమియోలో దీనికి కాల్కేరియా ఫాస్, ఫాస్ఫరస్, ఫాస్ఫారిక్ యాసిడ్, లైకోపోడియమ్, పల్సటిల్లా, నక్స్‌వామికా, ఆరమ్, సైలీషియా వంటి మందులు అందుబాటులో ఉన్నాయి. అయితే వాటిని హోమియో డాక్టర్ల పర్యవేక్షణలోనే వాడాల్సి ఉంటుంది. ఈ సమస్య గురించి ఆందోళన అక్కరలేదు. డాక్టర్ మురళి కె. అంకిరెడ్డి, ఎండీ (హోమియో) స్టార్ హోమియోపతి, హైదరాబాద్ సోరియాసిస్... వేధిస్తోంది! నా వయసు 28 ఏళ్లు. రెండు మూడు సంవత్సరాలుగా చర్మంపైన మచ్చలుగా ఏర్పడి పొట్టు రాలిపోతున్నది. ఎన్ని మందులు వాడినా తాత్కాలికమైన ఉపశమనమే ఉంది. కీళ్లనొప్పులు కూడా వస్తున్నాయి. దీనికి హోమియోలో మందు ఉందా? – సుభాష్, నందిగామ మీరు చెబుతున్న లక్షణాలను బట్టి చూస్తే మీ వ్యాధి సోరియాసిస్‌గా తెలుస్తోంది. ఇందులో చర్మంపై మచ్చలు లేదా బొబ్బల్లా ఏర్పడి, కొద్ది రోజులకు పొలుసులుగా మారి ఊడిపోతుంది. సోరియాసిస్ సాధారణంగా 15–30 ఏళ్ల మధ్యవయస్కులకు ఎక్కువగా వస్తుంది. కానీ వంశపారంపర్యంగా ఏ వయసువారికైనా రావచ్చు. కారణాలు : వంశపారంపర్యం లేదా అధిక ఒత్తిడి ముఖ్యంగా ఆటోఇమ్యూన్డిజార్డర్లు సోరియాసిస్‌కు ప్రధాన కారణాలు. లక్షణాలు : ∙చేతులు, కాళ్లు, తల, ముఖం, చర్మంపై మచ్చలు లేదా బొబ్బలు వచ్చి చేప పొలుసులుగా చర్మం ఊడిపోతుంది. ∙కేవలం చర్మం మీద మాత్రమే గాక గోళ్లపై కూడా మచ్చలు రావడం, కీళ్లనొప్పులు ఉంటాయి. ∙తలపై చుండ్రులాగా పొలుసులతో పాటు జుట్టు కూడా రాలిపోతుంది. ఈ వ్యాధితో బాధపడుతున్నవారు: తాము చూడటానికి కూడా బాగాలేకపోవడంతో మానసిక క్షోభకు గురయ్యే ప్రమాదం కూడా ఉంది. ఇటీవలి వ్యాధి ట్రెండ్ : ఆధునిక జీవన శైలి వల్ల ఇటీవల వంశపారంపర్యంగా వ్యాధి లేని వారిలోనూ ఇది కనిపిస్తుండటం ఆందోళన కలిగించే అంశం. చాలా హడావుడి, ఆదుర్దా కలిగిన జీవనశైలి వల్ల ఇది చాలామందిలో కనిపిస్తోంది. కాబట్టి ఒత్తిడిని వీలైనంత దూరంగా ఉంచుతూ, మంచి పౌష్టికాహారం తీసుకుంటూ ఉండాలి. చర్మం మరీ పొడిబారిపోకుండా తగిన మోతాదులో నీళ్లు తీసుకోవాలి. చికిత్స: ఈ సమస్యను హోమియో చికిత్స ద్వారా సమూలంగా తగ్గించవచ్చు. ముందుగా రోగి స్వభావం, తత్వం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. రోగిలో వ్యాధి నిరోధక శక్తి పెంచేలా జెనెటిక్ కన్స్టిట్యూషన్ పద్ధతిలో చికిత్స చేయాలి. ఈ చికిత్స ద్వారా సోరియాసిస్ సమస్య పూర్తిగా నయమవుతుంది. డాక్టర్ ఎ.ఎం. రెడ్డి, సీఎండీ పాజిటివ్ హోమియోపతి, హైదరాబాద్ డయాబెటిస్ ఉండి బరువు తగ్గడం ప్రమాదమే..! డయాబెటిక్ కౌన్సెలింగ్ నా స్నేహితుడి వయసు 38 ఏళ్లు. డయాబెటిస్ వ్యాధి ఉంది. అయిదారు నెలల కిందటి వరకు కాస్త స్థూలకాయం ఉండేది. రోజుకు 40 నిమిషాలు వ్యాయామం చేస్తుంటాడు. ఇంతకాలం తన బరువు అదుపులో ఉంది. ఇటీవల హఠాత్తుగా బరువు తగ్గడం ప్రారంభమైంది. చూస్తుండగానే బాగా బరువు తగ్గి, చాలా సన్నగా కనిపిస్తున్నాడు. అతడి పరిస్థితి చూస్తే ఆందోళన కలిగిస్తోంది. ఇలా డయాబెటిస్ వ్యాధితో ఉన్నవారు ఈ విధంగా బరువు తగ్గడంలో ఏదైనా ప్రమాదం ఉందా? – సి. ఆశీర్వాదం, సంగారెడ్డి సాధారణంగా ఏమాత్రం ఊబకాయం ఉన్నా బరువు తగ్గడం ఆరోగ్యానికి మంచిదనే అనుకుంటాం. శారీరక వ్యాయామం, క్యాలరీలు తక్కువగా ఉండే ఆహారం తీసుకుంటూ, నెమ్మదిగా బరువు తగ్గడం ఆహ్వానించదగినదే. ఇలా బరువు తగ్గడం... కొలెస్ట్రాల్, బీపీని అదుపులో ఉంచి గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. దీనికితోడు ఇన్సులిన్ రెసిస్టెన్స్‌ను తగ్గించడమే కాకుండా కండరాలు, కణజాలం, రక్తంలోని కొవ్వులు ఇన్సులిక్కు స్పందించేలా చేస్తుంది కూడా. శరీర కణజాలం, కండరాలు గ్లూకోజ్‌ను ఉపయోగించుకుని శక్తి పొందడానికి ఇన్సులిన్ అవసరమవుతుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల కండరాలు, కణజాలం గ్లూకోజ్‌ను వాడుకోవాలంటే మామూలు కంటే అధిక స్థాయిలో ఇన్సులిన్ అందుబాటులోకి రావాలి. టైప్–2 డయాబెటిస్‌లో ఈ పరిస్థితి ఉంటుంది. ఫలితంగా ఒక విషవలయం ఏర్పడుతుంది. ఇన్సులిన్ లెవెల్ ఎక్కువ అవుతున్న కొద్దీ శరీరం బరువు తగ్గడం కష్టమవుతుంది. మరోవైపు శరీరం బరువు అధికమవు తున్నకొద్దీ ఇన్సులిన్ లెవెల్ పెరుగుతుంటుంది. ఈ చక్రవలయాన్ని ఛేదించడం కష్టం. డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు ఉద్దేశపూర్వకంగా బరువు తగ్గించుకోవడం మంచి పరిమాణం.కానీ వారి ప్రయత్నం లేకుండా శరీరం బరువు తగ్గడం మాత్రం మంచి సూచన కాదు. రక్తంలో చక్కెర పరిమాణం ఎక్కువగా ఉన్నపక్షంలో వారు తరచూ మాత్ర విసర్జనకు వెళ్తుంటారు. ఇది డీ–హైడ్రేషన్‌కు దారితీస్తుంది. దాంతో శరీరం బరువు తగ్గిపోతుంది. డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు చాలామంది మొదటిసారి డాక్టర్‌ను కలిసినప్పుడు చేసే ఫిర్యాదు తమ బరువు తగ్గిందనే. డయాబెటిస్‌తోపాటు థైరాయిడ్, క్యాన్సర్ వంటి వ్యాధుల వల్ల కూడా శరీరం బరువు తగ్గిపోతుంది. అందువల్ల వ్యాయామం, డైటింగ్ వంటి తమ ప్రయత్నాలు ఏమీ లేకుండా బరువు తగ్గడం ఒక ప్రమాద సూచిక. ఈ పరిస్థితిలో... రక్తంలో చక్కెర పరిమాణంలో మార్పులకు మించి ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయేమో అని కచ్చితంగా తేల్చుకోవడం అవసరం. ఇక ఏమాత్రం ఆలస్యం లేకుండా మీ స్నేహితుడికి పూర్తిస్థాయి వైద్యపరీక్షలు చేయించండి. డాక్టర్ రామన్ బొద్దుల, సీనియర్ ఎండోక్రైనాలజిస్ట్, యశోద హాస్పిటల్స్, సికింద్రాబాద్ -
వెన్నునొప్పి... అశ్రద్ధ చేస్తే వైకల్యమే
వెన్నుపూస ఒక పవర్‌హౌస్ లాంటిది. దీని ద్వారా కాళ్లు, చేతులు, తల, భుజాలు, మెడకు పవర్ సప్లై అవుతుంది. శరీరం మొత్తాన్ని స్థిరంగా ఉండేలా చేస్తుంది. కొన్ని కారణాలవల్ల ఒక్కోసారి ఈ పవర్ హౌస్ నిర్జీవం అవుతుంది. దీని వలన భుజం, మెడ నొప్పులు, వెన్ను భాగంలో మొద్దుబారినట్లు, బలహీనపడినట్లు చురకలు, పోట్లు, మంటలు మొదలవుతాయి. వీటన్నింటికీ పరిష్కారం కేరళ ఆయుర్వేద పంచకర్మ చికిత్సలే అంటున్నారు ఆయుర్వేద వైద్యులు డాక్టర్ పి.కృష్ణ ప్రసాద్. మన జీవితం ఒక్కోసారి నడి సముద్రంలో నావలా ఇరుక్కుపోతుంది. ఎటు పోవాలో దిక్కుతోచదు. క్రమేపీ అన్ని దారులూ మూసుకుపోతాయి. తీవ్రమైన మెడ, నడుము నొప్పితో పాటు క్రమేపి రెండు చేతుల్లో విపరీతమైన తిమ్మిర్లు వస్తాయి. ఒక దశలో బలం కోల్పోయి పట్టుతప్పి తెలియకుండానే వస్తువులు జారిపోతుం టాయి. ప్రతిసారీ విశ్రాంతి తీసుకోవాలంటే కుదరని పరిస్థితుల్లో పని ఒత్తిడి పెరిగితే కళ్లు తిరుగుతాయి. పడుకున్నప్పుడు తలకింద పెట్టుకున్న చేతులు కొద్ది సేపటికి మొద్దుబారినట్లుగా ఉంటాయి. దీంతోపాటు తీవ్రమైన నడుము నొప్పి రెండు కాళ్లలో తిమ్మిర్లు, పోట్లు, చెమట వంటివి వస్తాయి. నడవాలంటే తూలి పడిపోతున్న భయం, వెన్ను, నడుం, మెడతో పాటు, అధిక బరువు, మధుమేహం తదితర సమస్యలతో బాధపడుతుంటారు. ఆయుర్వేదంలో వీటిని వాతానికి సంబంధించిన వ్యాధులుగా పరిగణిస్తారు. సర్జరీతో ఒరిగేదేమిటి? వెన్నునొప్పితో వెళితే మొదటిగా అల్లోపతి పెయిన్ కిల్లర్‌స, బెడ్ రెస్ట్ తీసుకోమం టారు. పెయిన్ కిల్లర్‌స అదేపనిగా వాడటం వల్ల దుష్ఫలితాలు అనేకం. కడుపు ఉబ్బరం, లివర్, కిడ్నీలు దెబ్బతినడం వంటి సమస్యలు ఉత్పన్నం కావచ్చు. దీంతో ఇక సర్జరీకి వెళ్లినా శాశ్వత పరిష్కారం దొరకదు. ఏం జరుగుతుంది? మొదట్లో నొప్పి వెన్ను ప్రాంతంలోనే వస్తుంది. వెన్ను భాగంలో కండరాలు బలహీనమవుతాయి. తరువాత మెడ, నడుము, వెన్నుపూసలో డిస్క్ పక్కకు జరిగి వెన్నుపూస నరాల మీద ఒత్తిడి పడుతుంది. కారణం మెడ, నడుము దగ్గరున్న కండరాలు బలహీన పడటమే. ఈ కండరాలన్నీ వెన్నుపాముతో సంబంధం కలిగి ఉంటాయి. ఆయుర్వేదం ఏం చేస్తుంది? ఆయుర్వేదంలో వెన్నునొప్పి రావడానికి కారణాలను పరీక్షలతో తెలుసుకుంటారు. తరువాత ఆయుర్వేదంలో ప్రత్యేకంగా చెప్పిన కేరళ ఆయుర్వేద పంచకర్మ చికిత్సలు, మర్మ చికిత్సలు, మేరు చికిత్సలు కీలక పాత్ర పోషిస్తాయి. ఈ విధానంలో ఔషధాలతో తయారు చేసిన అత్యంత సారవంతమైన కేరళ నూనెలతో వెన్నుభాగం అంతా మర్దనచేసి కండరాలకు బలాన్నిచ్చే కటిబస్తి, గ్రీవబస్తి, కటిధార చికిత్సలు చేస్తారు. వీటితో పాటు పంచకర్మలో ముఖ్యమైన వస్తి, విరోచనం చికిత్సలు చాలా ముఖ్యం. వీటివల్ల నొప్పి రావటానికి ఉన్న దోషాలను సమూలంగా, శాశ్వతంగా శరీరం నుంచి బయటకు పోతాయి. కనుక తీవ్ర వెన్నునొప్పితో బాధపడుతున్నవారు కేరళ ఆయుర్వేదంలోని పంచకర్మ చికిత్సలతో పునఃశక్తి పొంది వెన్నెముక బలంగా తయారై... పవర్‌హౌస్ సక్రమంగా పనిచేసేట్టు చేయవచ్చు. అడ్రస్ శ్రీ చరక కేరళ ఆయుర్వేదిక్ హాస్పిటల్, బిసైడ్ ఎస్.బి.హెచ్, నియర్ జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్, రోడ్ నం 17, హైదరాబాద్, వివరాలకు: పి.కృష్ణ ప్రసాద్. 9030013688/9440213688/040& 65986352 E mail: krishnaprosad.6600@gmail.com -
నేటి బాలలే..రేపటి బాధితులు
చిన్నారులపై బ్యాగుల బండ అధిక బరువుతో వెన్ను సమస్యలు జాగ్రత్తలే మేలంటున్న వైద్యులు ఖైరతాబాద్,న్యూస్‌లైన్: నేటి బాలలే రేపటి పౌరులు అన్నది అందరికీ తెలుసు.. కానీ నేటి బాలలే రేపటి బాధితులన్నది ఇప్పటి సత్యం. పట్టుమని ఐదేళ్లు కూడా నిండకముందే చిన్నారులు బస్తాల్లాంటి బ్యాగులను మోసుకెళ్తుండడంతో చిన్నప్పటినుంచే ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. చిన్న వయస్సులోనే వారి శరీర బరువులో సగానికి పైగా బరువును పుస్తకాల రూపంలో మోయాల్సి వస్తోంది. దీంతో ఎదిగే పిల్లల్లో వెన్నుపై భారంతో 14 ఏళ్లు వచ్చేసరికి అనేకరకాల సమస్యలతో ఇబ్బందులు పడాల్సి వస్తోంది. సాధారణంగా విద్యార్థి బరువులో 15శాతానికి మించి బ్యాగ్ బరువు ఉండకూడదు. వెన్నుపూస నిర్మాణం, అధిక బరువు మోయడం వల్ల వచ్చే ఇబ్బందులను గ్లోబల్ హాస్పిటల్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ చంద్రభూషణ్ తెలిపిన ప్రకారం.. అధిక భారంతో కలిగే ఇబ్బందులు.. చాలామంది పిల్లల్లో 15 సంవత్సరాల లోపే వారి శరీరంలో వివిధరకాల మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఇలా మార్పులను ఎప్పటికప్పుడు గమనించి వెంటనే డాక్టర్ సలహా మేరకు చికిత్స అందించాలి. పాఠశాల వయస్సులో మోయాల్సిన భారం కన్నా ఎక్కువ బరువు మోయడం వల్ల పార్శ్వగూని, స్కోలియోసిస్ వంటి ఇబ్బందులు తలెత్తుతాయి. పార్శ్వగూని సాధారణంగా 10 నుంచి 16 ఏళ్ల మధ్య వస్తుంది. బాలికలకు 10-14, బాలురకు 12-16 ఏళ్ల మధ్య రావొచ్చు. వెన్ను ఒకవైపుకు వంగిపోవడాన్ని స్కోలి యోసిస్ అంటారు. ఇలాంటి ఇబ్బందులను మొదటిదశలోనే గుర్తించి తగిన చికిత్స చేయించాలి. తప్పక తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. పిల్లలకు బ్యాగులు కొనేముందు పెద్దసైజు స్పోర్ట్స్ బ్యాగుల్లాంటివి కాకుండా పుస్తకాలకు సరిపోయేలా కొనుగోలు చేయాలి. బాలుడు/బాలిక బరువు 20కిలోలు ఉంటే..వారి బ్యాగ్ బరువు 3కిలోలకు మించకూడదు. ఒకవేళ ఎక్కువ పుస్తకాలుంటే టీచర్ సలహా మేరకు ఆరోజు కావాల్సిన పుస్తకాలను మాత్రమే బ్యాగులో తీసుకెళ్లాలి. బ్యాగ్‌ను రెండు భుజాలకు వేసుకోవాలి. ఒక భుజానికి వేసుకోవడం మంచిదికాదు. బ్యాగ్‌లో పుస్తకాల అమరిక చాలా ముఖ్యం. లావటి పుస్తకాలు వీపుకు ఆనుకునేలా.. ఆ తర్వాత లావు తక్కువున్న పుస్తకాలను అమర్చాలి. బ్యాగ్‌ను నడుంకింద వరకు వేలాడేలా ఉండకూడదు. వీటితోపాటు విద్యార్థులకు నిత్యం వ్యాయామం ఉండేలా చూడాలి. శారీరక శ్రమ లేకపోవడం వల్ల అనేక ఇబ్బందులు తలెత్తే అవకాశముంది.