ఆత్మహత్య ధోరణి జన్యుపరంగా సంక్రమిస్తుందా? | Genetic Contributions To Suicidal Thoughts And Behaviors | Sakshi
Sakshi News home page

ఆత్మహత్య ధోరణి జన్యుపరంగా సంక్రమిస్తుందా? అలానే విజయ్‌ ఆంటోని కూతురు..

Published Mon, Sep 25 2023 11:06 AM | Last Updated on Mon, Sep 25 2023 12:42 PM

Genetic Contributions To Suicidal Thoughts And Behaviors - Sakshi

ఆత్మహత్య ధోరణి కొంతవరకు జన్యు పరంగా వస్తుందంటున్నారు ఆయుర్వే నిపుణులు నీవీన్‌ నడిమింటి. నేడు ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది పిల్లలు ఇదే మానసిక స్థితిలో ఉంటున్నారు. తమిళనటుడు సినీ హిరో విజయ్ ఆంటోనీ కుటుంబంలో అతడి చిన్నతనంలోనే తండ్రి ఆత్మహత్య చేసుకొన్నారు. ఇప్పుడు అతని 16 ఏళ్ళ కూతురు కూడా అలానే... దీన్ని బట్టి చూస్తే ఆత్మహత్య ధోరణి అనేది కొంతవరకు జన్యుపరంగా వస్తుందని చెప్పొచ్చు. ముఖ్యంగా స్మార్ట్‌ ఫోన్‌ల వచ్చాక పిల్లల్లో ఆ ధోరణి మరింత ఎక్కువైంది. చాలా మంది తల్లిందండ్రులు పిల్లల చేత ఫోన్‌లు ఎలా మానిపించాలని మొత్తుకుంటున్నారు. ముఖ్యంగా వారిని ఈ ఆత్మహత్యధోరణి దరిదాపుల్లోకి వెళ్లకుండా ఉండేలా ఫోన్‌ అడిక్షన్‌ మానిపించాలంటే ఏం చేయాలో ఆయుర్వేద నిపుణులు నవీన్‌ నడిమింటి మాటల్లో చూద్దాం!.


చీకటి గదుల్లో పిల్లలను ఉంచొద్దు..
సెల్ఫోన్కు ( టీన్ ఏజ్ పిల్లల్లో ) అడిక్ట్ అయిపోతే డిప్రెషన్ ( మానసిక కుంగుబాటు ) అగ్రేషన్ ( కోపం చిరాకు హింసాత్మక ధోరణి ) వచ్చేస్తాయి. రెండేళ్ల పిల్లలు కూడా సెల్ ఫోన్ చేతికి ఇవ్వకపోతే అన్నం తినరు. అరిచి గోల చేస్తారు “ - నేడు తల్లితండ్రుల నోట తరచూ వినిపించే మాట కూడా ఇదే! పిల్లలు ఆరుబయట ఎంత ఆడుకుంటారో అంత పాజిటివ్ వ్యక్తిత్వం అలవడుతుంది... పిల్లలతో పేరెంట్స్ క్వాలిటి టైం మెయింటేన్ చేయాలి. ఇంకోటి చీకటి గదుల్లో ఎక్కువగా పిల్లలను ఉంచొద్దు పిల్లల ముందు ఎప్పుడు గాసిప్స్ మాట్లాడొద్దు.

సెల్‌ఫోన్‌ లేకుండా పిల్లలు ఫుడ్‌ తినాలంటే..
పిల్లల పెరుగుదలలో అతి కీలకమైన వయసు ఏడాది నుంచి 5 ఏళ్లు.  అంటే ప్రీ స్కూలు పిల్లల్లో పెరుగుదల అన్నది వారు తినే ఆహారంపైనే ఆధారపడి ఉంటుంది. మా బాబు ఏదీ తినడు ఆకలవడానికి ఏదైనా మంచి టానిక్‌ రాసివ్వండి. లేదా మా పిల్లవానికి పెరుగు వాసన గిట్టదండి, పెరుగన్నం తినకపోతే వేడి చేస్తుంది కదా అని చాలామంది  తల్లిదండ్రులు అడుగుతుంటారు.

ఏడాది నిండేటప్పటికి పిల్లలకు దాదాపు నడక వచ్చేస్తుంది. అక్కడి నుండి తనంతట తానుగా తిరుగుతూ, ఎక్కడేమేమి ఉన్నా చక్కబెడుతూ, ఆటలలో మునిగిపోయే పిల్లలు తిండి విషయంలో పేచీ పెట్టడం సహజమే. ఓ పట్టాన దేనికీ లొంగరు. మూడేళ్ల వయసులో పిల్లల్లో ప్రీస్కూల్లో చేర్చడంతో అక్కడ తోటి పిల్లల అలవాట్లను అనుకరించడం, వాళ్లు తినేవి బాగున్నట్లు, తనకి పెట్టినవి బాగోలేదని అనిపించడం ప్రారంభమవుతుంది. ఇవన్నీ ఏయే ఏడాదికి ఆ ఏడాది మారే అలవాట్లే. కాబట్టి దీని గురించి అంతగా చెందనక్కరలేదు.

ఇక కొన్ని రుచులు, వాసనలు పడకపోవడమన్నది పిల్లలకైనా, పెద్దవారికైనా అది సహజం అని గుర్తించాలి. అవి, ఇవి తినేలా ఒత్తిడి చేసే బదులు వారు ఇష్టపడే రీతిలో అదే సమయంలో పోషకాలు కూడా అందేలా ఆహారాన్ని తయారు చేసి పెట్టాలి. తినిపిస్తే ఎక్కువ తింటాడని, బిడ్డ తింటానని మొరాయిస్తున్నా బలవంతంగా నోటిలో కుక్కే ప్రయత్నం అస్సలు చేయరాదు. కొంత ఆహారం వేస్ట్‌ అయినా వాళ్లంతట వాళ్లు తింటామంటే ప్రోత్సహించాలి. అలాంటప్పుడే కొత్త కొత్తవి రకరకాల ఆహార పదార్థాలను పెట్టి తినమంటే వాళ్లు ఓ ఆటలాగా తింటారు.

తినే ఆహారంలో శక్తినిచ్చే పదార్థాలు తగినంతగా లేకపోతే పెరుగుదల సరిగా వుండదు. పిల్లలు అంత చలాకీగా ఉండరు. పిల్లలకు పాలు, పండ్ల రసాలు చాలా ఎక్కువగా ఇస్తూ, ఘనాహారాన్ని చాలా పరిమితంగా పెట్టాలి. వివిధ రకాల ఆహార పదార్థాలు లేకుండా ఒకే మూసలో ఉండే ఆహారం పెట్టడం వల్ల పిల్లలకు ఎ విటమిన్‌, ఐరన్‌, డి విటమిన్‌, బి- కాంప్లెక్స్‌ విటమిన్‌ లోపాలు ఏర్పడతాయి. వాళ్లు బయటికి వెళ్లి ఆటలాడుకుంటారు. పైగా ఇది మంచిది, మంచిది కాదు అని తెలియదు దీంతో వారు తరుచుగా తరచుగా జబ్బు పడుతుంటారు. తేలికగా అంటువ్యాధులు సోకుతుంటాయి. అందువల్ల పరిశుభ్రమైన రకరకాల ఆహార పదార్థాలను పిల్లలకు పెట్టాలి.

ఇవీ మార్గదర్శకాలు..
ప్రీ స్కూల్‌ పిల్లలకు తిండి కూడా ఓ ఆట వస్తువులానే వుంటుంది. అలాగే ఊహ తెలియకపోయినా ఇష్టం, అయిష్టం ఉంటాయని గుర్తించాలి. వయస్సుకు ఉండాల్సిన ఎత్తు (సెం.మీలలో) ఉండవలసిన బరువు (కిలోల్లో) వారిగా వివరాలు..

పుట్టినప్పుడు 50 - 3 ఏడాదికి 74 - 8.5 రెండేళ్లకు 81.5 - 10 మూడేళ్లకు 89 - 12 నాలుగేళ్లకు 96 - 13.5 అయిదేళ్లకు 102 - 15 అమ్మాయిలు వయస్సు ఉండాల్సిన ఎత్తు (సెం.మీలలో) ఉండవలసిన బరువు (కిలోల్లో) పుట్టినప్పుడు 50 - 3 ఏడాదికి 72.5 - 8 రెండేళ్లకు 80 - 9.5 మూడేళ్లకు 87 - 11 నాలుగేళ్లకు 94.5 - 13 అయిదేళ్లకు 101 - 14.5

కేలరీలు: ఏడాది వయసులో బిడ్డ బరువు కిలోకు వంద కిలో క్యాలరీలు అవసరం కాగా ఐదేళ్ల వయసులో 80 కిలో క్యాలరీలు కావాలి. ఏడాది వయసు వచ్చేటప్పటికి బిడ్డ రోజుకు మూడు పూట్ల భోజనంతో పాటు ఉదయం పూట అల్పాహారం, సాయంత్రం స్నాక్స్‌ తినేలా చూడాలి. ఆ వయసులో తల్లి పాలు కానీ పోత పాలు కానీ వారికి అవసరమైన శక్తిలో పావు వంతు మాత్రమే అందించగలవు. అంటే అంత వరకు అనుబంధ ఆహారంగా ఉన్నది ఇక ముఖ్య ఆహారం కావాలి. పాలు, పండ్లు కూరగాయలు, చిక్కుడు జాతి గింజలు, గుడ్లు, మాంసం, చేపలు తదితరాలు తగు మొత్తాలతో ఉన్న సమతులాహారం బిడ్డకు అందేలా చూడాలి.

పిల్లలకు ఏమాత్రం ఖాళీ దొరికినా సెల్ ఫోన్ కే పరిమితమైపోతున్నారు. ఆండ్రాయిడ్ ఫోన్లలో గేములు, వీడియోలుకే బయట పిల్లలతో ఆడుకోవడానికి వెళ్లేందుకు ఇష్టపడడం లేదు. స్నేహితులు కంటే ఫోనునే అంతలా ఇష్టపడుతున్నారు. ఒక మాటలో చెప్పాలంటే ఫోనుకు ఎడిక్ట్ అయిపోతున్నారు. ఫోను నిత్యవసరమైపోయిన ప్రస్తుత పరిస్థితుల్లో ఆ ఫోనేను వాడడం మానుకోలేక, పిల్లలు అంతలా ఇష్టపడే ఫోను కేవలం పిల్లల మనో వికాసానికి అవసరమైన సలహాలు, ఆటలు ఆడేలా  భవిష్యత్తుకు బంగారు బాటలు వేసిదిగా ఉంటే ఎంతబావుంటుందో కదా..! 

ముఖ్యంగా పిల్లలు టీనేజ్‌ వయసు వచ్చేంత వరకు కూడా తల్లిదండ్రుల వారితో ఏదో రకంగా సమయాన్ని కేటాయించాలి. అది వారికి అమూల్యమైన సమయంగా ఫీలయ్యేలా మీరు గనుక మీకున్న బిజీ షెడ్యూల్లో కనీసం ఓ అరగంట అయినా కేటాయించే యత్నం చేస్తే.. పిల్లలు సెల్‌ఫోన్‌లు లాంటి విష సంస్కృతికి అడిక్ట్‌ కారు. డిప్రెషన్‌కి గురయ్యి ఆత్మహత్య ధోరణి దరిదాపుల్లోకి వెళ్లరు. తల్లిదండ్రల గురించి ఆలోచించాలనే బాధ్యతయుతమైన వ్యక్తితత్వం తల్లిదండ్రుల సాన్నిహిత్యం ద్వారానే సాధ్యం.

పిల్లలు బాగుపడాలన్నా, భవిష్యత్తు బాగుండాలన్ని అది తల్లిదండ్రల చేతుల్లోనే ఉందనేది గ్రహించండి అంటున్నారు ఆయుర్వేద నిపుణులు నవీన్‌ నడిమింటి. పిల్లలకు తల్లిదండ్రలు మించిన స్నేహితులు, శ్రేయోభిలాషులు ఉండరు. తల్లిదండ్రలంటే భయం కాదు.. ప్రేమ, గౌరవం పిల్లల్లో కలిగేలా చేయాల్సింది తల్లిదండ్రులే కాబట్టి  ముందు మీరే మారండి. 

--ఆయుర్వేద నిపుణులు, నవీన్‌ నడిమింటి

(చదవండి: నాకిప్పుడు మూడోనెల, ఆ రిస్క్‌ ఉండకూడదంటే ఏం చేయాలి?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement