thoughts
-
‘మైండ్ స్పోర్ట్స్’: మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్స్
‘ఆలోచనల గురించి పెద్దగా ఆలోచించవద్దు’ అనుకునేవాళ్లకు ముగ్ధ బవరే చెప్పే మాట...‘మన ఆలోచనలే మన పనితీరును ప్రభావితం చేస్తాయి’ ముగ్ధ ఒకప్పుడు ప్రతిభావంతురాలైన స్విమ్మర్. స్పోర్ట్స్ సైకాలజీపై పెద్దగాఅవగాహన లేని కాలంలో ఎంతోమంది అథ్లెట్ల మనసును అధ్యయనం చేసింది. క్రికెట్ టీమ్ నుంచి మొదలు ఒలింపిక్, పారాలింపిక్ అథ్లెట్ల వరకు ఎంతోమంది అథ్లెట్లతో కలిసి పనిచేసింది.మానసిక సమస్యలు, ఒత్తిడి, ప్రతికూల ఆలోచనలతో ΄ పోరాడడానికి వారికి మార్గం చూపిన ముగ్ధ ప్రస్తుతం ‘మైండ్ స్పోర్ట్స్’ పేరుతో సొంతంగా ప్రాక్టీస్ నిర్వహిస్తోంది. ఎంతోమంది అథ్లెట్లకు దిశానిర్దేశం చేస్తోంది.‘మైండ్ స్పోర్ట్స్’పై పుస్తకం కూడా రాసింది. ఒక అథ్లెట్ మనసు మార్చడానికి ఏ అంశాలు ఉపయోగపడతాయో ఈ పుస్తకంలో వివరించింది.‘ఒక అథ్లెట్ మనసు ఇతర ప్రొఫెషనల్స్ కంటే ఏ రకంగా భిన్నంగా ఉంటుంది?’ అనే ప్రశ్నకు ముగ్ధ బవరే చెప్పే జవాబు...‘పూర్తిగా భిన్నం కాదు. మనం ఆలోచించే విధానం స్పోర్ట్స్ అయినా కార్పొరేట్ అయినా తేడా తీవ్రంగా ఉండకపోవచ్చు. అందుకే ఏ రంగంలోనైనా మానసిక శిక్షణ(మెంటల్ ట్రైనింగ్) చాలా కీలకం. మనం ఆలోచించే విధానమే మన పనితీరును ప్రభావితం చేస్తుంది. సక్సెస్ మాత్రమే సర్వస్వం అనుకునేచోట వైఫల్యం బాధ పెడుతుంది. చాలామందిని కోలుకోకుండా చేస్తుంది. అయితే గెలుపు, ఓటములు ప్రతిభకు, ప్రతిభ లేక పోవవడానికి నిర్వచనం కాదనే అవగాహన ప్రస్తుత కాలంలో పెరిగింది -
ఏంటి? మీకిలా జరుగుతోందా..! బహుశా ఇందువల్లేనేమో..!!
కాలంతోపాటు సాగుతున్న మానవ జీవితంలో.. కొందరు వారు తీసుకునే నిర్ణయాలను బట్టే ఫలితాలు వస్తాయని మర్చిపోతుంటారు. చిన్న ఆపద రాగానే బెంబేలెత్తుతుంటారు. దీనికి కారణం నువ్వే అంటూ తాఫీగా ఇతరులపై తప్పును నెట్టేస్తుంటారు. అసలు కారణం ఏంటో తెలుసా..! ఆ సమయానికి, సాగుతున్న క్రమానికి, అనుసరిస్తున్న విధానాలకి సరైన పొంతన లేకపోవడమే. ప్రశాంతంగా ఆలోచించకపోవడమే. మరి వాటిని అధిగమించడానికి ఏం చేయాలో చూద్దాం. ప్రయాణ నియమాలు.. 1. ప్రయాణానికి ఇంటి దగ్గర బయల్దేరిన దగ్గర నుంచి తొమ్మిదవ రోజున తిరుగు ప్రయాణమవకూడదు. 2. ప్రయాణానికి బయలుదేరేటప్పుడు శుభశకునాలు చూసుకోవాలి. 3. మధ్యాహ్నం 2 గంటల తర్వాత భోజనం చేసిన తర్వాత వారశూల దోషాలు తగ్గుతాయి. 4. రాత్రి సమయాలలో చేయు ప్రయాణ విషయాలలో వారశూల పట్టింపు ఉండదు. కాని ఆడపిల్లలను పంపే విషయంలో శుక్ర, మంగళవారాల పట్టింపు ఉన్నది. 5. నూతన వితంతువును మంగళ, శుక్ర వారాల్లో చూడరాదు. ఆ రోజులలో చూడటానికి బయల్దేరడం కూడా పనికిరాదు. 6. అశుభకార్య నిమిత్తంగా ప్రయాణం చేసినట్లయితే వెంటనే తిరుగు ప్రయాణం చేయాలి లేదా దేవాలయంలో నిద్రచేసి వేరొక నిమిత్తంగా వెళ్ళవచ్చు. సాధారణ నియమములు.. "స్వగృహే ప్రాక్ఛిరాః కుర్యా శ్యాశుర్యే దక్షిణౌశిరాః ప్రత్యక్షిరాః ప్రవాసేషు నకదాచిదుదక్ఛిరాః" స్వగహమునందు తూర్పువైపున శిరస్సు, అత్తవారింట దక్షిణ శిరస్సు, ఇతరుల ఇంట పడమర శిరస్సు ఉంచి నిదురించాలి. ఉత్తర దిశలో శిరస్సు ఉంచి ఎక్కడా నిదురించకూడదు. వాస్తుశాస్త్ర రీత్యా దక్షిణ శిరస్సు కూడా విశేషమే! దోషం – శాంతి మంత్రం.. ఆరోగ్య సమస్యలు ఉన్నా, పిల్లలకు దృష్టిదోషం ఉన్నా, గర్భిణీస్త్రీలకు గర్భరక్షణ కోసం, మానసిక అశాంతి ఎక్కువగా ఉన్నా విభూది చేతపట్టుకొని ఈ కింది శ్లోకాన్ని 41 సార్లు పారాయణ చేసి విభూది ముఖమున ధరించిన శాంతి లభించును. "శ్రీమత్ నృసింహ విభవే గరుడ ధ్వజాయ తాపత్రయోపశమనాయ భవౌషధాయ తృష్ణాది వృశ్చికజలాగ్ని భుజంగ రోగ క్లేశ వ్యయాయ హరయే గురవేనమస్తే!" పిల్లలకు మాటలు రాగానే ఈ శ్లోకం నేర్పి వారిచేత నిత్యం పారాయణ చేయిస్తే, దృష్టిదోషం, నరఘోష, భూత, ప్రేత, పిశాచ బాధలు దగ్గరకు రావు. రజస్వలకు మంచి కాలము.. అశ్వని, రోహిణి, మృగశిర, పుష్యమి, ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ఠ, శతభిషం, ఉత్తరాభాద్ర, రేవతి ప్రథమ రజస్వలకు మంచి నక్షత్రాలు. గ్రహణకాలం సంధ్యాకాలం, వర్జ్యకాలం మంగళవారం, అమావాస్య రోజులలో అయినట్లయితే శాంతి చేయించుకొనవలెను. జన్మ నక్షత్రానికి నైధనతార రోజున రజస్వల అయినచో శాంతి అవసరం. ఇవి చదవండి: అమ్మో.. కుజదోషం! పెళ్లే అవదా? అని భయపడుతున్నారా..! -
కాన్ఫిడెన్స్‌ని దెబ్బతీసే రౌడీబేబీ! ధైర్యంగా ఫేస్ చేయకపోతే..!
సత్య తెలివైన విద్యార్థి. కానీ ఇంటర్మీడియట్ పూర్తికాగానే ఐఐటీ సీట్ రాలేదు. ప్రస్తుతం లాంగ్‌టర్మ్ కోచింగ్ తీసుకుంటున్నాడు. కానీ మూడు నెలలుగా అతన్ని ఓ సమస్య వేధిస్తోంది. ఎగ్జామ్ పేపర్ చేతిలోకి తీసుకోగానే ‘‘బాగా రాయలేనేమో’’ అనే ఆలోచన మనసులోకి దూరుతోంది. అంతే.. అప్పటివరకూ గుర్తున్నది కూడా మర్చిపోతున్నాడు. ఈ సమస్యను అధిగమించాలని ఎంత ప్రయత్నించినా సాధ్యం కాలేదు. నాన్నకు చెప్పుకుని ఏడ్చాడు. వాణి ఒక అథ్లెట్. స్టేట్ లెవెల్లో బెస్ట్ రన్నర్‌గా నిలిచి, నేషనల్ మీట్‌కు ప్రిపేర్ అవుతోంది. కానీ రన్నింగ్ ట్రాక్ మీదకు వెళ్లగానే ‘‘నేను గెలవలేనేమో’’ అనే ఆలోచన మనసును హిట్ చేస్తోంది. అంతే.. వేగం తగ్గుతోంది. సెకన్ల వ్యవధిలో ఓడిపోతోంది. ట్రాక్ ఎక్కినప్పుడు ఆ ఆలోచన రాకుండా ఎంతో ప్రయత్నించింది. సాధ్యం కాలేదు. నేషనల్ విన్నర్ కావాలన్న తన ఆశ నెరవేరుతుందో లేదోనని తీవ్రంగా బాధపడుతోంది. సత్య, వాణిల్లానే చాలామంది విద్యార్థులు, యువతులు ఇలాంటి ఆలోచనలతో సతమతమవుతుంటారు. అది ఐఐటీ, నీట్, ఎంసెట్, స్పోర్ట్స్ లేదా గేమ్స్ ఏవైనా..! ఒక్క నెగటివ్ ఆలోచన వారిని.. గమ్యం నుంచి ఒక్కొక్క అడుగు వెనక్కు తీసుకువెళ్తుంది. ఆ ఒక్క నెగటివ్ ఆలోచన మూలాల్ని అర్థం చేసుకుని పరిష్కరించుకోగలిగితే.. గమ్యాన్ని చేరుకోగలరు, అనుకున్నది సాధించగలరు. లొంగకపోతే సాయం అవసరం... నెగటివ్ కామెంట్స్‌తో వేధించే రౌడీని, దాని గొంతును సరిచేయడం అందరికీ అంత సులువు కాదు. అలాంటప్పుడు సైకాలజిస్ట్ సహాయం తీసుకోవడం అవసరం. వారు రకరకాల పద్ధతుల ద్వారా నెగటివ్ సెల్ఫ్ టాక్‌ను తగ్గించుకునేందుకు సహాయపడతారు. కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ (సీబీటీ) అనేది వ్యక్తుల ప్రతికూల ఆలోచనలు, ప్రవర్తనలను గుర్తించడంలో, సవాలు చేయడంలో సహాయపడుతుంది. ప్రోగ్రెసివ్ మజిల్ రిలాక్సేషన్, మైండ్‌ఫుల్ మెడిటేషన్, డీప్ బ్రీతింగ్ ద్వారా ఆందోళన వల్ల శరీరంలో వచ్చే మార్పులను నియంత్రించుకోవచ్చు. మనసును ప్రశాంతంగా ఉంచడంలో సహాయపడతాయి. ఆందోళనను రేకెత్తించే పరిస్థితులను క్రమక్రమంగా పరిచయం చేసే ఎక్స్పోజర్ థెరపీ భయాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. సత్య విషయంలో మాక్ ఎగ్జామ్స్ ప్రాక్టీస్, వాణి విషయంలో తక్కువ దూరం పరుగెత్తడం వంటివి ప్రాక్టీస్ చేయాలి. వారు సాధించిన విజయాలను హైలైట్ చేయడం, పర్ఫెక్షన్ కంటే ప్రోగ్రెస్‌పై దృష్టి పెట్టడం వారి విశ్వాసాన్ని పెంచుతుంది, వారి కృషిని కొనసాగించడానికి వారిని ప్రేరేపిస్తుంది. వారి ఆందోళన గురించి కుటుంబం, స్నేహితులు లేదా కోచెస్తో మాట్లాడమని ప్రోత్సహించడం అవసరమైన అవగాహనను, మానసిక మద్దతును అందిస్తుంది. రెగ్యులర్ వ్యాయామం, ఆరోగ్యకరమైన ఆహారం, తగినంత నిద్ర మానసిక స్థితిని గణనీయంగా మెరుగుపరుస్తుంది, ఆందోళనను తగ్గిస్తుంది. మనసులో అల్లరి చేస్తుంటుంది.. సత్య, వాణిల్లానే చాలామందికి పెద్ద పెద్ద కలలు ఉంటాయి. అవి చాలా ముఖ్యమైనవి అయినప్పుడు ఎక్కడ ఫెయిలవుతామోనని భయపడుతుంటారు. అది వారి పనితీరును దెబ్బతీస్తుంది. దీన్నే పర్ఫార్మెన్స్ యాంగ్జయిటీ అంటారు. దీనికి కారణం వారి మనసులోని రౌడీబేబీ (బులీ). చిన్నప్పుడు స్కూల్లో ఎలాగైతే ఎగతాళి చేస్తారో, ఏడిపిస్తారో (బులీయింగ్) అలాగే మనసులోని రౌడీ అల్లరి చేస్తుంటుంది. నువ్వు చేయలేవు, నువ్వు ఫెయిలవుతావు అంటూ అబద్ధాలు చెప్తుంటుంది. వారిని భయాందోళనలకు గురిచేస్తుంది. దాంతో ఆలోచనలు రేసుగుర్రాల్లా పరుగెత్తుతాయి. చేతులకు చెమటలు పడతాయి. కొందరికి చేతులు వణుకుతాయి కూడా. ఆ భయాందోళనల్లో తమకు తెలిసినదాన్ని కూడా మర్చిపోతారు. తమ పర్ఫార్మెన్స్ను కాస్తంత మందగిస్తుంది. అది చాలు కదా లక్ష్యం చేజారడానికి. లోగొంతును సవరించుకోవాలి.. మనసులోని రౌడీ బేబీని అలా వదిలేయాల్సిన అవసరంలేదు. దానిపై పోరాటం చేయవచ్చు. అందుకు మొదట చేయాల్సింది బులీకి అసలు కారణాన్ని కనుక్కోవడం. దానికి బహూశా గత వైఫల్యాలు, పర్ఫెక్ట్గా ఉండాలనే ఒత్తిడి, జడ్జ్ చేస్తారనే భయం వంటివి కారణాలు కావచ్చు. ఆ తర్వాత రౌడీ బేబీతో మాట్లాడి మచ్చిక చేసుకోవాలి. కరకుగా ఉండే రౌడీ బేబీ గొంతును కాస్తంత సరళంగా లేదా సరదాగా మార్చేయండి. నా వంతు కృషి చేయగలను, నా తప్పుల నుంచి నేర్చుకుంటాను.. అని మనసులోని మాటలను మార్చండి. నిశ్శబ్దంగా ఉండటం, నిదానంగా శ్వాస తీసుకోవడం ద్వారా రౌడీని శాంతింపచేయండి. చిన్న చిన్న పరీక్షల్లో మనసులోని రౌడీని ఎదుర్కోవడం ప్రాక్టీస్ చేయండి. ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోండి. --సైకాలజిస్ట్ విశేష్ (చదవండి: సోనియా గాంధీ మెచ్చిన 'పప్పు అన్నం'! బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు!) -
ఆత్మహత్య ధోరణి జన్యుపరంగా సంక్రమిస్తుందా?
ఆత్మహత్య ధోరణి కొంతవరకు జన్యు పరంగా వస్తుందంటున్నారు ఆయుర్వే నిపుణులు నీవీన్ నడిమింటి. నేడు ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది పిల్లలు ఇదే మానసిక స్థితిలో ఉంటున్నారు. తమిళనటుడు సినీ హిరో విజయ్ ఆంటోనీ కుటుంబంలో అతడి చిన్నతనంలోనే తండ్రి ఆత్మహత్య చేసుకొన్నారు. ఇప్పుడు అతని 16 ఏళ్ళ కూతురు కూడా అలానే... దీన్ని బట్టి చూస్తే ఆత్మహత్య ధోరణి అనేది కొంతవరకు జన్యుపరంగా వస్తుందని చెప్పొచ్చు. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్ల వచ్చాక పిల్లల్లో ఆ ధోరణి మరింత ఎక్కువైంది. చాలా మంది తల్లిందండ్రులు పిల్లల చేత ఫోన్లు ఎలా మానిపించాలని మొత్తుకుంటున్నారు. ముఖ్యంగా వారిని ఈ ఆత్మహత్యధోరణి దరిదాపుల్లోకి వెళ్లకుండా ఉండేలా ఫోన్ అడిక్షన్ మానిపించాలంటే ఏం చేయాలో ఆయుర్వేద నిపుణులు నవీన్ నడిమింటి మాటల్లో చూద్దాం!. చీకటి గదుల్లో పిల్లలను ఉంచొద్దు.. సెల్‌ఫోన్‌కు ( టీన్ ఏజ్ పిల్లల్లో ) అడిక్ట్ అయిపోతే డిప్రెషన్ ( మానసిక కుంగుబాటు ) అగ్రేషన్ ( కోపం చిరాకు హింసాత్మక ధోరణి ) వచ్చేస్తాయి. రెండేళ్ల పిల్లలు కూడా సెల్ ఫోన్ చేతికి ఇవ్వకపోతే అన్నం తినరు. అరిచి గోల చేస్తారు “ - నేడు తల్లితండ్రుల నోట తరచూ వినిపించే మాట కూడా ఇదే! పిల్లలు ఆరుబయట ఎంత ఆడుకుంటారో అంత పాజిటివ్ వ్యక్తిత్వం అలవడుతుంది... పిల్లలతో పేరెంట్స్ క్వాలిటి టైం మెయింటేన్ చేయాలి. ఇంకోటి చీకటి గదుల్లో ఎక్కువగా పిల్లలను ఉంచొద్దు పిల్లల ముందు ఎప్పుడు గాసిప్స్ మాట్లాడొద్దు. సెల్‌ఫోన్ లేకుండా పిల్లలు ఫుడ్ తినాలంటే.. పిల్లల పెరుగుదలలో అతి కీలకమైన వయసు ఏడాది నుంచి 5 ఏళ్లు. అంటే ప్రీ స్కూలు పిల్లల్లో పెరుగుదల అన్నది వారు తినే ఆహారంపైనే ఆధారపడి ఉంటుంది. మా బాబు ఏదీ తినడు ఆకలవడానికి ఏదైనా మంచి టానిక్ రాసివ్వండి. లేదా మా పిల్లవానికి పెరుగు వాసన గిట్టదండి, పెరుగన్నం తినకపోతే వేడి చేస్తుంది కదా అని చాలామంది తల్లిదండ్రులు అడుగుతుంటారు. ఏడాది నిండేటప్పటికి పిల్లలకు దాదాపు నడక వచ్చేస్తుంది. అక్కడి నుండి తనంతట తానుగా తిరుగుతూ, ఎక్కడేమేమి ఉన్నా చక్కబెడుతూ, ఆటలలో మునిగిపోయే పిల్లలు తిండి విషయంలో పేచీ పెట్టడం సహజమే. ఓ పట్టాన దేనికీ లొంగరు. మూడేళ్ల వయసులో పిల్లల్లో ప్రీస్కూల్లో చేర్చడంతో అక్కడ తోటి పిల్లల అలవాట్లను అనుకరించడం, వాళ్లు తినేవి బాగున్నట్లు, తనకి పెట్టినవి బాగోలేదని అనిపించడం ప్రారంభమవుతుంది. ఇవన్నీ ఏయే ఏడాదికి ఆ ఏడాది మారే అలవాట్లే. కాబట్టి దీని గురించి అంతగా చెందనక్కరలేదు. ఇక కొన్ని రుచులు, వాసనలు పడకపోవడమన్నది పిల్లలకైనా, పెద్దవారికైనా అది సహజం అని గుర్తించాలి. అవి, ఇవి తినేలా ఒత్తిడి చేసే బదులు వారు ఇష్టపడే రీతిలో అదే సమయంలో పోషకాలు కూడా అందేలా ఆహారాన్ని తయారు చేసి పెట్టాలి. తినిపిస్తే ఎక్కువ తింటాడని, బిడ్డ తింటానని మొరాయిస్తున్నా బలవంతంగా నోటిలో కుక్కే ప్రయత్నం అస్సలు చేయరాదు. కొంత ఆహారం వేస్ట్ అయినా వాళ్లంతట వాళ్లు తింటామంటే ప్రోత్సహించాలి. అలాంటప్పుడే కొత్త కొత్తవి రకరకాల ఆహార పదార్థాలను పెట్టి తినమంటే వాళ్లు ఓ ఆటలాగా తింటారు. తినే ఆహారంలో శక్తినిచ్చే పదార్థాలు తగినంతగా లేకపోతే పెరుగుదల సరిగా వుండదు. పిల్లలు అంత చలాకీగా ఉండరు. పిల్లలకు పాలు, పండ్ల రసాలు చాలా ఎక్కువగా ఇస్తూ, ఘనాహారాన్ని చాలా పరిమితంగా పెట్టాలి. వివిధ రకాల ఆహార పదార్థాలు లేకుండా ఒకే మూసలో ఉండే ఆహారం పెట్టడం వల్ల పిల్లలకు ఎ విటమిన్, ఐరన్, డి విటమిన్, బి- కాంప్లెక్స్ విటమిన్ లోపాలు ఏర్పడతాయి. వాళ్లు బయటికి వెళ్లి ఆటలాడుకుంటారు. పైగా ఇది మంచిది, మంచిది కాదు అని తెలియదు దీంతో వారు తరుచుగా తరచుగా జబ్బు పడుతుంటారు. తేలికగా అంటువ్యాధులు సోకుతుంటాయి. అందువల్ల పరిశుభ్రమైన రకరకాల ఆహార పదార్థాలను పిల్లలకు పెట్టాలి. ఇవీ మార్గదర్శకాలు.. ప్రీ స్కూల్ పిల్లలకు తిండి కూడా ఓ ఆట వస్తువులానే వుంటుంది. అలాగే ఊహ తెలియకపోయినా ఇష్టం, అయిష్టం ఉంటాయని గుర్తించాలి. వయస్సుకు ఉండాల్సిన ఎత్తు (సెం.మీలలో) ఉండవలసిన బరువు (కిలోల్లో) వారిగా వివరాలు.. పుట్టినప్పుడు 50 - 3 ఏడాదికి 74 - 8.5 రెండేళ్లకు 81.5 - 10 మూడేళ్లకు 89 - 12 నాలుగేళ్లకు 96 - 13.5 అయిదేళ్లకు 102 - 15 అమ్మాయిలు వయస్సు ఉండాల్సిన ఎత్తు (సెం.మీలలో) ఉండవలసిన బరువు (కిలోల్లో) పుట్టినప్పుడు 50 - 3 ఏడాదికి 72.5 - 8 రెండేళ్లకు 80 - 9.5 మూడేళ్లకు 87 - 11 నాలుగేళ్లకు 94.5 - 13 అయిదేళ్లకు 101 - 14.5 కేలరీలు: ఏడాది వయసులో బిడ్డ బరువు కిలోకు వంద కిలో క్యాలరీలు అవసరం కాగా ఐదేళ్ల వయసులో 80 కిలో క్యాలరీలు కావాలి. ఏడాది వయసు వచ్చేటప్పటికి బిడ్డ రోజుకు మూడు పూట్ల భోజనంతో పాటు ఉదయం పూట అల్పాహారం, సాయంత్రం స్నాక్స్ తినేలా చూడాలి. ఆ వయసులో తల్లి పాలు కానీ పోత పాలు కానీ వారికి అవసరమైన శక్తిలో పావు వంతు మాత్రమే అందించగలవు. అంటే అంత వరకు అనుబంధ ఆహారంగా ఉన్నది ఇక ముఖ్య ఆహారం కావాలి. పాలు, పండ్లు కూరగాయలు, చిక్కుడు జాతి గింజలు, గుడ్లు, మాంసం, చేపలు తదితరాలు తగు మొత్తాలతో ఉన్న సమతులాహారం బిడ్డకు అందేలా చూడాలి. పిల్లలకు ఏమాత్రం ఖాళీ దొరికినా సెల్ ఫోన్ కే పరిమితమైపోతున్నారు. ఆండ్రాయిడ్ ఫోన్లలో గేములు, వీడియోలుకే బయట పిల్లలతో ఆడుకోవడానికి వెళ్లేందుకు ఇష్టపడడం లేదు. స్నేహితులు కంటే ఫోనునే అంతలా ఇష్టపడుతున్నారు. ఒక మాటలో చెప్పాలంటే ఫోనుకు ఎడిక్ట్ అయిపోతున్నారు. ఫోను నిత్యవసరమైపోయిన ప్రస్తుత పరిస్థితుల్లో ఆ ఫోనేను వాడడం మానుకోలేక, పిల్లలు అంతలా ఇష్టపడే ఫోను కేవలం పిల్లల మనో వికాసానికి అవసరమైన సలహాలు, ఆటలు ఆడేలా భవిష్యత్తుకు బంగారు బాటలు వేసిదిగా ఉంటే ఎంతబావుంటుందో కదా..! ముఖ్యంగా పిల్లలు టీనేజ్ వయసు వచ్చేంత వరకు కూడా తల్లిదండ్రుల వారితో ఏదో రకంగా సమయాన్ని కేటాయించాలి. అది వారికి అమూల్యమైన సమయంగా ఫీలయ్యేలా మీరు గనుక మీకున్న బిజీ షెడ్యూల్లో కనీసం ఓ అరగంట అయినా కేటాయించే యత్నం చేస్తే.. పిల్లలు సెల్ఫోన్లు లాంటి విష సంస్కృతికి అడిక్ట్ కారు. డిప్రెషన్‌కి గురయ్యి ఆత్మహత్య ధోరణి దరిదాపుల్లోకి వెళ్లరు. తల్లిదండ్రల గురించి ఆలోచించాలనే బాధ్యతయుతమైన వ్యక్తితత్వం తల్లిదండ్రుల సాన్నిహిత్యం ద్వారానే సాధ్యం. పిల్లలు బాగుపడాలన్నా, భవిష్యత్తు బాగుండాలన్ని అది తల్లిదండ్రల చేతుల్లోనే ఉందనేది గ్రహించండి అంటున్నారు ఆయుర్వేద నిపుణులు నవీన్ నడిమింటి. పిల్లలకు తల్లిదండ్రలు మించిన స్నేహితులు, శ్రేయోభిలాషులు ఉండరు. తల్లిదండ్రలంటే భయం కాదు.. ప్రేమ, గౌరవం పిల్లల్లో కలిగేలా చేయాల్సింది తల్లిదండ్రులే కాబట్టి ముందు మీరే మారండి. --ఆయుర్వేద నిపుణులు, నవీన్ నడిమింటి (చదవండి: నాకిప్పుడు మూడోనెల, ఆ రిస్క్ ఉండకూడదంటే ఏం చేయాలి?) -
మంచి ఆలోచనలతో మెరుగైన ఆరోగ్యం
మన ఆలోచనలే మనం అని చెప్పుకోవడం వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన విశ్లేషణలా అనిపించవచ్చు కానీ అది నిజం. మన ఆలోచనలు బాగుంటే మానసికంగా బాగుంటాం. మానసిక ఆరోగ్యం సవ్యంగా ఉన్నప్పుడే శారీరక ఆరోగ్యం కూడా బాగుంటుంది. నేడు మనం నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టాం. గత సంవత్సరపు చేదు జ్ఞాపకాలను, అవి కలిగించిన ప్రతికూల భావనలను వదిలేసి ఒత్తిడి, ఆందోళనలను తగ్గించుకుని, ప్రశాంతమైన జీవనం సాగించేందుకు కొత్త సంవత్సరం లో నిర్ణయం తీసుకుందాం... మానసిక ఆరోగ్యాన్ని మెరుగు పరుచుకోవడానికి ఏం చేయాలో తెలుసుకుందాం.. ఆలోచనలు మనిషి వైఖరి, ప్రవర్తనలపై ఎంతో ప్రభావాన్ని కలిగిస్తాయని శాస్త్రవేత్తలు చెప్పారు. దీనిని ఆధారంగా చేసుకుని వైద్య శాస్త్రంలోని వివిధ విభాగాలకు చెందిన పరిశోధకులు సైకో న్యూరో ఇమ్యునాలజీ అనే సరికొత్త విభాగాన్ని కూడా ఏర్పాటు చేశారు. మనిషి చేసే సానుకూల ఆలోచనల ఫలితమే వారి ఆరోగ్యమని, ప్రతికూల ఆలోచనలే వారి అనారోగ్యమని ఈ విభాగం తెలియజేస్తోంది. మరి సానుకూల ఆలోచనలు ఎలా పెంపొందించుకోవాలో...అందుకు ఎలాంటి అలవాట్లు కలిగి ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం. చురుకైన మెదడు మెదడును ఉత్తేజంగా ఉండేలా చూసుకోవాలి. మెదడు చురుగ్గా ఉంటే జ్ఞాపకశక్తి పెరుగుతుంది. ఫలితంగా మానసిక సమస్యల నుంచి కూడా బయటపడొచ్చు. అందుకోసం రోజూ కంటినిండా నిద్రపోవాలి. దాంతో మెదడుకు విశ్రాంతి లభిస్తుంది. ఫలితంగా మానసిక సమస్యలు పోయి మెదడు చురుగ్గా మారుతుంది.మనం నిత్యం తీసుకునే ఆహారం కూడా మెదడు పనితీరుపై ప్రభావం చూపుతుంది. కనుక రోజూ తగిన పోషకాలు ఉండే ఆహార పదార్థాలను తీసుకోవాలి. అటువంటి వాటిలో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు పుష్కలంగా ఉండే ఆహారం ముఖ్యమైనది. వీటిని నిత్యం తీసుకుంటే మెదడు చురుగ్గా పనిచేస్తుంది. వ్యాయామం చేయడం వల్ల మానసిక సమస్యలు పోతాయి.శారీరక వ్యాయామంతోపాటు రోజూ కొత్త విషయాలను నేర్చుకోవడం, పద వినోదం, పజిల్స్ నింపడం, సుడోకు ఆడడం వంటి మెదడుకు మేత పెట్టే పనులు చేస్తే మంచిది. పాజిటివ్ ఆలోచనలు ఆరోగ్యానికి అండ సాటివారిపట్ల ప్రేమ, అనురాగం, అభిమానం, ఆప్యాయత వంటి గుణాలు కలిగున్న మనిషి ఆరోగ్యంగా ఉంటాడని మనస్తత్వ శాస్త్రవేత్తలతోపాటు వైద్యులు కూడా చెబుతున్నారు. అలాగే .... సానుకూలమైన అనుభూతులతో ఉన్న మనిషిలో తెల్ల రక్తకణాలు వృద్ధి చెంది, వ్యాధికారక క్రిములను పెరగకుండా నిరోధిస్తాయి. తద్వారా వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. కోపం, ద్వేషం, దుఃఖం, విచారం, అసూయ వంటి ప్రతికూల భావోద్వేగాలు మనిషిని మానసికంగా ఒత్తిళ్లు, ఆందోళనలకు గురిచేసి తెల్ల రక్తకణాలను తగ్గిస్తాయి. ఫలితంగా మనిషి అనారోగ్యానికి గురవుతాడు. అందుకే మంచి ఆలోచనలు ఉంటే ఆనందంగా, ఆరోగ్యంగా ఉండేందుకు దోహదం చేస్తాయి. ఒంటరితనం వద్దు ఒంటరిగా ఉన్న మనిషిలో ప్రతికూల ఆలోచనలు ఎక్కువ. ఫలితంగా మనిషిలో తెల్ల రక్త కణాలు తక్కువవుతుంటాయి. ఎన్నో శారీరక సమస్యలు మొదలవుతాయి. ఆహార విహారాలపై అవగాహన లోపిస్తుంది. శ్వాసకోశ వ్యాధులు, గుండె జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉండవచ్చు. మనసు ఆలోచనా విధానంలో మార్పు వస్తుంది. ఆ కారణంగా జ్ఞాపకశక్తి తగ్గుతూ అల్జీమర్స్ వంటి ఆరోగ్య సమస్యలు చోటు చేసుకునే ప్రమాదం ఉంది. ఒంటరిగా ఉన్నవారు ఏదో ఒక పనిలో నిమగ్నమైనప్పుడు మెదడు నిర్మాణాత్మకంగా పనిచేస్తూ, సానుకూల ఆలోచనలకు తెరలేపుతుందన్నది చికాగోలోని రష్ యూనివర్శిటీ మెడికల్ సెంటర్ శాస్త్రజ్ఞుల సూచన.సానుకూల ఆలోచనల కోసం మెదడుకు తగు తర్ఫీదు ఇవ్వాలి. ►ఇతరులతో మాట్లాడేటప్పుడు సానుకూల శబ్దాలు మాత్రమే ఉపయోగించే అలవాటు చేసుకోవాలి.. ►ఎవరికి వారు సానుకూల స్వయం సలహాలు ఇచ్చుకుంటుండాలి. ►ఆత్మవిశ్వాసంతో కూడిన మాటలు, చేతలకు మాత్రమే ప్రాధాన్యతనివ్వాలి. ►ఇతరుల పట్ల కృతజ్ఞతా భావాన్ని కలిగి ఉండాలి. ►తప్పులు జరిగినప్పుడు ఆత్మవిమర్శ చేసుకోవాలి. ►వైఫల్యాలు ఎదురైనప్పుడు కృంగిపోకుండా గతంలో సాధించిన విజయాలను గుర్తుచేసుకుని, ప్రస్తుతం జరిగిన వాటిని విశ్లేషించుకోవాలి. ►విజయాల బాటలో నడిచిన వారిని చూసి అసూయ చెందకుండా వారి నుంచి ప్రేరణ పొందడం అలవాటు చేసుకోవాలి. ►ప్రతికూల ఆలోచనలు వచ్చినప్పుడు... వాటిని సానుకూలం గా మార్చుకునే ప్రయత్నం చేయాలి. పెదవుల మీద చిరునవ్వు చెదరనీయకూడదు. ∙మంచి జరగబోతోందని ఊహించుకోవాలి. ►ఉట్టిపుణ్యానికి బద్ధకంతో పనులు వాయిదా వేసే అలవాటు మానుకోవాలి. ►సెల్ఫ్ రిలాక్సేషన్ పద్ధతి నేర్చుకునే ప్రయత్నం చేయాలి. ►ఇతరులతో ప్రేమగా వ్యవహరించడం.... నవ్వుతూ... నవ్విస్తూ ఉండడం వల్ల ఎంత పెద్ద జబ్బునైనా నయంచేసుకోవచ్చన్న నిపుణుల సలహాను పరిగణనలోకి తీసుకోవాలి. తీసుకునే ఆహారంతోనే ఆలోచనా విధానం ముడిపడి ఉందని అంటున్నారు నిపుణులు. తాజా పండ్లను, కూరగాయలను తినడం వల్ల మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. కాబట్టి మంచి ఆహారాన్ని తీసుకోవడం అన్ని విధాలా మంచిది. ప్రతికూల ఆలోచనలు వద్దు నెగెటివ్ ఆలోచనల వల్ల ఆత్మవిశ్వాసం కోల్పోతారు. ఎదుటివాళ్లకి మనమీద నమ్మకం లేకుండా చేస్తాయి. ఇలాంటి ప్రతికూల ఆలోచనల నుంచి బయటపడటానికి కొన్ని చిట్కాలు పాటిస్తే సరిపోతుందని చెబుతున్నారు మానసిక నిపుణులు.ప్రతికూల ఆలోచనలు వచ్చినప్పుడు వాటిని ఓ పుస్తకంలో రాసుకోవాలి. అవి మనం తీసుకొనే నిర్ణయాలపై ఎలాంటి ప్రభావం చూపుతాయో తెలుసుకోవాలి. అసలు ఇలాంటి ఆలోచనలు ఎందుకు కలుగుతున్నాయో కనుక్కోవాలి. వాటినుంచి బయట పడాలనే బలమైన తపన ఉండాలి. భవిష్యత్తు గురించి అతిగా ఆలోచించడం వల్ల ఫలితం ఉండదు. భవిష్యత్తు గురించి అసలు ఆలోచన చేయకుండా ఉండటం ఎంత తప్పో, భవిష్యత్తులో అలా జరుగుతుందేమో... ఇలా జరుగుతుందేమో అని అతిగా ఆలోచించడ కూడా అంతే తప్పు. దానివల్ల ఆరోగ్యం పాడవుతుంది. అందువల్ల అంతా మంచే జరుగుతుందనే ఆలోచన మంచిది.ఎప్పుడైతే మనమీద మనకు నమ్మకం లేదో అప్పుడు ప్రతికూల ఆలోచనలు చుట్టుముట్టి ఉక్కిరిబిక్కిరి అయేలా చేస్తాయి. అందువల్ల మనమీద మనకు ఇష్టం, గౌరవం, నమ్మకం ఉండేలా చూసుకోవడం అత్యవసరం. గతంలో సంభవించిన అపజయాలు, ఎదురైన చేదు అనుభవాల వల్ల ప్రతికూల ఆలోచనలు రావడం సహజం. అలాంటప్పుడు గతాన్ని మర్చిపోవాలి. గతంలో జరిగిన తప్పులు పునరావృతం కాకుండా జాగ్రత్తపడాలి. మనల్ని మనం ప్రేమించుకోవాలి. సంతోషంగా ఉండడానికి ప్రయత్నించాలి. అప్పుడే మనం ఏడాదంతా కాదు.. ఎప్పటికీ ఆరోగ్యం గా ఆనందంగా ఉండగలుగుతాం. ∙ -
రీ ట్వీట్స్ తో హర్ష్ గోయెంకా పోస్ట్ వైరల్...
సాక్షి, ముంభై: ప్రముఖ వ్యాపారవేత్త హర్ష్ గోయెంకా ట్విటర్ వేదికగా చాలా ఆసక్తికరమైన విషయాలను ఎప్పుడూ షేర్ చేస్తూ ఉంటారు. అయితే, ఈ రోజు జీవితానికి సంబంధించిన కొన్ని విలువైన, మంచి ప్రేరణ కలిగించే అలవాట్లను ట్వీట్ చేశాడు. హర్ష్ గోయెంకా తొమ్మిది అలవాట్లను ట్విటర్లో ‘‘సమ్ కూల్’’ అని పేరుతో పోస్ట్ చేసారు. ఈ తొమ్మిది అలవాట్లు వచ్చేసి ‘ఎల్లప్పుడూ సమయస్ఫూర్తితో ఉండాలి, థ్యాంక్యూ చెప్పడం, ఎప్పుడైన తప్పు చేస్తే క్షమాపణ అడగడం, చెప్పింది బాగా వినడం, ఎదుటి వారితో మంచిగా వ్యవహరించడం, గురువుగా ఉండటం, జీవితానికి ఒక ఉద్దేశ్యం, ఇతరుల పట్ల గౌరవాన్ని చూపడం మరియు మంచి నడవడిక, సమాజానికి తిరిగి ఏదైనా చేయడం’ అని గురువారం పోస్ట్ చేశారు. ఈ పోస్ట్‌ని చాలా మంది అంగీకరిస్తూ, వారి అభిప్రాయాలను, ఆలోచనలను కామెంట్ సెక్షన్లో తెలిపారు. దీంతో లైక్స్, రీ ట్వీట్స్‌తో ఈ పోస్ట్ వైరల్‌గా మారింది. Some cool habits: 1. Always be punctual 2. Say ‘thank you’ 3. Apologize when you’ve made a mistake 4. Listen well 5. Be nice to strangers 6. Be a mentor 7. Have a purpose in life 8. Show respect and good manners 9. Give back to society#ThursdayThoughts — Harsh Goenka (@hvgoenka) December 10, 2020 -
అర్థం కాని కొడుకు
భార్య చనిపోతే ఆ భర్తకు భార్యను వెతుకుతుంది సమాజం. అయితే ఆ భార్య అతని కొడుకుకు తల్లి కాగలదా? ఆ కొడుకు ఆమెను తల్లిగా స్వీకరిస్తాడా? చాలా సున్నితమైన అంశాలు. సదుద్దేశాలతో ఇటువంటి వివాహాల్లో ప్రవేశించే స్త్రీలకు మనోవ్యధ మిగిలితే? ఏం చేయాలి? ఆమెను చూస్తే సైకియాట్రిస్ట్‌కు ఆందోళనగా అనిపించింది. చాలాఏళ్లుగా మనోవ్యధ భరించి భరించి పూర్తిగా కుంగిపోయిన స్త్రీలా ఉందామె. ఆమెకు జీవితం మీద ఆశ లేదు. జీవితంలో సంతోషం ఉంటుందనీ తెలియదు. చూపించిన ప్రేమ, ఆప్యాయతలకు ఫలితం ఇంత చేదుగా ఉంటుందని ఊహించక కుదేలై ఉంది. ‘నేనొక దురదృష్టవంతురాలైన మారుతల్లిని డాక్టర్’ అందామె. సమత వయసు ఇప్పుడు 28 సంవత్సరాలు. కాని ఇంకో పది ఎక్కువ ఉన్నట్టుగా కనిపిస్తుంది. జుట్టు పలుచబడింది. కళ్ల కింద నీడలు. పలుచబడ్డ శరీరం. మెల్లగా ఉన్న కదలికలు. కాని పదేళ్ల క్రితం ఆమె ఇలా లేదు. ఎంతో ఉత్సాహంగా ఉండేది. సాటి మనుషుల పట్ల దయగా ఉండేది. తోటి మనుషుల ఆనందంలో తుళ్లిపడేది. ఆ సమయంలో ఆమె వయసు 18 సంవత్సరాలు. హైదరాబాద్‌లో బిటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతుండేది. చదువు గురించిన ఆలోచనలు తప్ప జీవితపు ఆలోచనలు లేవు. కాని ఆ ఆలోచనలు చేయాల్సి వచ్చింది. ఒకరోజు ఆమె తండ్రి గుంటూరు నుంచి కలవడానికి హాస్టల్‌కు వచ్చాడు. ‘ఎలా చదువుతున్నావమ్మా?’ ‘బాగా చదువుతున్నాను నాన్నా’ తండ్రి కాసేపు ఆలోచనలో ఉన్నవాడిలా కనిపించాడు. ‘రోహిత్ గురించి ఎప్పుడన్నా ఆలోచిస్తున్నావా అమ్మా’ రోహిత్ పేరు తలువగానే సమత మనసు బెంగతో నిండిపోయింది. రోహిత్ ఆమె అక్క కొడుకు. ఎనిమిది సంవత్సరాల పిల్లవాడు. సమత అక్క భాను రెండేళ్ల క్రితం కేన్సర్‌తో కన్నుమూసింది. ఆమె బావ సుధీర్ జంషడ్‌పూర్‌లో పని చేస్తున్నాడు. చాలా మంచివాడు. భార్య చనిపోయాక చాలా నిబ్బరంగా పిల్లవాడిని చూసుకుంటూ అక్కడే ఉండిపోయాడు. రెండేళ్ల కాలం అతనిలో చాలా మార్పే తెచ్చింది. ఒంటరి జీవితం, చిన్న పిల్లవాడు... అతన్ని గంభీరంగా మార్చాయి. ఎప్పుడైనా గుంటూరు వచ్చినా రెండు మూడు రోజులు ఉండి వెళ్లిపోయేవాడు. ఆ రెండు మూడు రోజుల్లో రోహిత్ ఏ ప్రవర్తనలో ఉండాలో తెలియక కొత్తగా ఉండేవాడు. ‘మీ బావను ఇంకో పెళ్లి చేసుకోమంటే చేసుకోవడం లేదమ్మా’ అన్నాడు తండ్రి. సమత ఈ సంభాషణ ఎక్కడకు వెళుతోందో అర్థం చేసుకుంది. ‘నీ ఆలోచన ఏమిటమ్మా?’ అడిగాడు. ‘నాన్నా... బావ మంచివాడు. రోహిత్ మన పిల్లవాడు. నాకు వారిద్దరంటే జాలి, ప్రేమ ఉన్నాయి. కానీ...’ ‘కానీ అంటే లాభం లేదమ్మా. నువ్వు పెద్దమనసు చేసుకోవాలి. వేరే స్త్రీ అయితే రోహిత్‌కు పూర్తిగా తల్లిప్రేమ చూపించకపోవచ్చు. నువ్వైతే నీ అక్క కొడుకే కాబట్టి నీ పిల్లాడిగా చూసుకుంటావు’ సమత మౌనంగా ఉండిపోయింది. ‘మావయ్యా... అలాంటి ఆలోచనలు చేయొద్దు. సమత చిన్నపిల్ల. చాలా భవిష్యత్తు ఉంది. నేను పెళ్లి చేసుకోలేను’ అన్నాడు ఫోన్లో సుధీర్. ‘లేదు బాబూ... ఇలా ఎక్కువ రోజులు ఉంటే నీ ఆరోగ్యానికే ప్రమాదం. బాబు ఎదుగుదలకు కష్టం’ అన్నాడు సమత తండ్రి. ‘ఈ పెళ్లి సమతకు ఇష్టమేనా?’ ‘తనకు పూర్తి సమ్మతమే’ అన్నాడు తండ్రి. పెళ్లి జరిగిపోయింది. సుధీర్‌ది పెద్ద ఉద్యోగం. మనిషి యావరేజ్‌గా ఉంటాడు. పెళ్లి చేసుకోవడమే లేట్‌గా చేసుకున్నాడు. వీటన్నింటి కారణాన అతనికీ సమతకు దాదాపు 14 ఏళ్ల గ్యాప్ ఉంది. ఇంత గ్యాప్ ఉన్నప్పటికీ ఎంతో సహృదయంతో తన కోసం, పిల్లాడి కోసం సమత చేసిన త్యాగానికి అతడి మనసు కృతజ్ఞతతో నిండిపోయింది. సమతను ఎంతో బాగా చూసుకోవడం మొదలెట్టాడు. అంతవరకూ రోహిత్‌ను నిమిషం కూడా వదలకుండా అంటిపెట్టుకుని ఉండే అతడు కొంచెం రిలాక్స్ అయ్యాడు. ఇంకా చెప్పాలంటే రోహిత్ బాధ్యత పూర్తిగా సమతకే అప్పజెప్పాడు. కాని అప్పుడు మొదలైంది చిక్కు. రోహిత్ ప్రవర్తనలో సడన్‌గా మార్పు మొదలైంది. అల్లరి పెంచాడు. మాట వినకుండా మొండికేయడం మొదలెట్టాడు. స్కూల్లో కూడా పాఠాలు సరిగ్గా వినకుండా అటెన్షన్ పెట్టకుండా నానా యాగీ చేస్తున్నాడని కంప్లయింట్లు వచ్చాయి. సుధీర్‌కు ఇవి చిన్న సమస్యలుగా కనిపించాయి. కాని రోహిత్‌ను చూసుకోవాల్సిన సమతను ఇవి టెన్షన్ పెట్టసాగాయి. గతంలో రోహిత్ సమతను ‘పిన్నీ’ అని పిలిచేవాడు. ఇప్పుడు ‘అమ్మా’ అని పిలవమంటే ఒక్కోసారి పిలుస్తున్నాడు. ఒక్కోసారి పిలవడం లేదు. తండ్రి దగ్గరకు వెళ్లి పడుకుంటాడు. సమతతో ‘నువ్వు వేరే గదిలో పడుకో’ అని హటం చేస్తాడు. చేసేది లేక ఆమె తన గదిలో పడుకుంటుంది. ముగ్గురూ ఒకే బెడ్ మీద పడుకోవడం రోహిత్‌కు ఇష్టం లేదు. సమత ఎంతో ప్రేమ చూపడానికి దగ్గర కావడానికి ప్రయత్నించింది. కాని రోహిత్ కాలేదు. ఈలోపు సమతకు రెండుసార్లు అబార్షన్ అయ్యింది. దానివల్ల సుధీర్ ఆమె మీద ఇంకా కన్సర్న్ పెట్టి బాగా చూసుకుంటూ పరోక్షంగా రోహిత్ మనసులో ఆమె పట్ల దూరం పెంచాడు. సంవత్సరాలు గడిచే కొద్దీ రోహిత్ దూరమయ్యాడు తప్ప చేరువకాలేదు. ఇంటర్ వయసుకు వచ్చేసరికి వాడు పూర్తిగా తల్లికి ఎదురు తిరగడం, లెక్కలేనట్టుగా వ్యవహరించడం, బాధించడం ఎక్కువ చేశాడు. సుధీర్ నిస్సహాయత వాణ్ణి ఇంకా రెచ్చిపోయేలా చేసింది. ఇప్పుడు ఆ ఇంట్లో సుధీర్, రోహిత్ బాగానే ఉన్నారు. కాని సమత పూర్తిగా నలిగిపోయింది. ‘నేను చేసిన పాపం ఏమిటి? మంచికిపోతే చెడు ఎదురయ్యింది. నేనే నా చేతులారా జీవితాన్ని నాశనం చేసుకున్నానా’ అనే భావంతో పూర్తి డిప్రెషన్లోకి వెళ్లిపోయింది. ఆమెలో వచ్చిన మార్పు వాళ్లిద్దరూ గమనించినా ఎలా పరిష్కరించాలో తెలియక కొనసాగనిచ్చారు. చివరకు సమత తండ్రి దీనికి ముగింపు పలకడానికి వాళ్ల ముగ్గురినీ హైదరాబాద్‌లో సైకియాట్రిస్ట్ దగ్గరకు తీసుకు వచ్చాడు. అంతా విన్న సైకియాట్రిస్ట్ ‘అయితే మొదట మాట్లాడిల్సింది మీతో కాదు. మీ అబ్బాయితో. మీకు సరైన మెడిసిన్ ఆ అబ్బాయే అని నాకు అర్థమవుతోంది’ అన్నాడు. బయట ఉన్న రోహిత్‌ను పిలిస్తే మొదట లోపలికి రావడానికి కూడా వాడు అంగీకరించలేదు. బతిమాలి ఒంటరిగా కూచోబెట్టి రోహిత్‌తో మాట్లాడాడు డాక్టర్. ‘చూడు రోహిత్. మీ అమ్మకు డబ్బు ఉంది. మీ నాన్నను పెళ్లి చేసుకునే సమయంలో ఆమె మంచి వయసులో ఉంది. ఎంతో మంచి సంబంధం చేసుకుని ఈసరికి ఏ అమెరికాలోనో ఉండేది. కాని నీ కోసం ఒంటరి అయిపోయిన తన అక్క కొడుకు కోసం తల్లిలా మారడానికి మీ ఇంటికి వచ్చింది. మీ నాన్న దానిని అర్థం చేసుకున్నాడు. నువ్వు ఇబ్బంది పెడుతున్నావు. ఆమె నీకు ఏం అపకారం చేసింది? ఎందుకు వేధిస్తున్నావు? నీకు ఇష్టం లేకపోతే చెప్పు... ఆమె విడాకులు తీసుకుంటుంది. మీకు దూరంగా వెళ్లిపోతుంది. సరేనా?’ ఆ మాటకు రోహిత్ చటుక్కున తలెత్తి చూశాడు. నిర్లక్ష్యంగా ఉన్న కళ్లల్లో పశ్చాత్తాపం కనిపడింది. ‘లేదు డాక్టర్. నాకు మా పిన్నంటే ఇష్టమే. కాని నాకు ఎనిమిదేళ్లు వచ్చేవరకూ అడ్డు చెప్పేవారే లేరు. అమ్మ చనిపోవడంతో గారం పెంచేసి కొండ మీద కోతిని తెమ్మన్నా మా నాన్న తెచ్చిచ్చేవాడు. కాని పిన్ని వచ్చి నన్ను క్రమశిక్షణలో పెట్టబోయింది. అది నా మంచి కోసమే. కాని ఆమె నన్ను కంట్రోల్లో పెట్టడానికి వచ్చిన విలన్‌గా ఆ వయసులో నాకు అనిపించింది. అందుకే ఆమెను వ్యతిరేకించాను. అది అలాగే అలవాటైపోయింది. ఆమెకు సరండర్ కావడానికి ఇగో అడ్డుపడుతుంది. కాని అమ్మ పరిస్థితి చూసి నాకు నిజంగానే దుఃఖంగా ఉంది. నేను చాలా తప్పు చేశాను’ పదిహేడేళ్ల కుర్రావాడి మాటల్లో నిజాయితీ. మైక్ ఆన్ చేసి పక్క గదిలో ఉన్న సమతకు ఈ మాటలు వినిపించేలా చేయడంతో సమత పెద్దగా ఏడుస్తూ బయటకు వచ్చింది. ‘నాన్నా... రోహిత్’ అని కొడుకును అల్లుకుపోయింది. సమత ఎనిమిదేళ్ల పిల్లవాడికి తల్లి కావాలని వచ్చింది. కాని వాడికి పదిహేడేళ్లు వచ్చాకే నిజంగా తల్లి అయ్యింది. ఇక ఆమె జీవితానికి ఢోకా లేదు. – కథనం: సాక్షి ఫ్యామిలీ ఇన్పుట్స్: డాక్టర్ కల్యాణ చక్రవర్తి, సైకియాట్రిస్ట్ -
‘అప్పుడు నాకు ఆత్మహత్య చేసుకోవాలనిపించేది’
ఆస్కార్‌తో తన సత్తా చాటిన సంగీత మాంత్రికుడు ఏఆర్ రెహమాన్ తన జీవితంలో ఎదుర్కొన్న ఒడిదుడుకులను, కెరీర్లో ఎదురైన అనుభవాలను పీటీఐ వార్త సంస్థతో పంచుకున్నారు. ‘నా 25వ ఏట వరకు ఆత్మహత్య చేసుకోవాలని ఆలోచించేవాడిని. నా తండ్రిని కొల్పోయిన తర్వాత ఎదురైన పరిణామాలు నన్ను ఆ దిశగా ఆలోచించేలా చేశాయి. కానీ నా ప్రయాణం నాకు చాలా నేర్పింది. చావు అనేది అనివార్యమైంది. ప్రతి దానికి ఓ అంతం ఉంటుంది.. కాబట్టి దేనికైనా భయపడటం ఎందుకు?. నా తండ్రి మరణించిన సమయంలో నేను ఎక్కువగా సినిమాలు చేయలేదు. ఆ సమయంలో నాకు 35 సినిమా అవకాశాలు రాగా.. నేను రెండు మాత్రమే చేశాను. నేను ఎలా రాణిస్తానని చాలా మంది ఆశ్చర్యపోయార’ని రెహమాన్ తెలిపారు. నా అసలు పేరు నాకు ఇష్టం లేదు ‘నేను 12 నుంచి 22 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడే జీవితంలో అన్ని కోణాలను చూశాను. నాకు అన్ని నార్మల్‌గా అనిపించడంతో.. వాటిని చేయాలని అనిపించేది కాదు. నా అసలు పేరు దిలీప్ కుమార్ అంటే నాకు ఇష్టం లేదు. నేను దానిని ఎందుకు ద్వేషిస్తానో అర్థం అయ్యేది కాదు. నాకు ఆ పేరు సరిపోదేమోనని అనిపించేది. నేను గతాన్ని పూర్తిగా చెరిపేయాలని అనుకున్నాన’ని రెహమాన్ వెల్లడించారు. కాగా, సంగీత దర్శకుడిగా తన తొలి చిత్రం రోజా విడుదలకు ముందు రెహమాన్ తన కుటుంబంతో కలిసి ఇస్లాంను స్వీకరించిన సంగతి తెలిసిందే. కృష్ణ త్రిలోక్ రచించిన రెహమాన్ బయోగ్రఫీ ‘నోట్ ఆఫ్ ఏ డ్రీమ్: ది ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఏఆర్ రెహమాన్’ పుస్తకాన్ని ఆయన శనివారం రోజున ముంబైలో అవిష్కరించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సూపర్ స్టార్ రజనీకాంత్, శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న 2.ఓ సినిమాకు రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. -
మీరు మంచి విమర్శకులేనా?
సెల్ఫ్ చెక్ ఎదుటివారు ఏదైనా తప్పు చేస్తే, తప్పుగా మాట్లాడితే లేదా తప్పుగా రాస్తే వెంటనే దానిని ఖండిస్తూ, అందులోని తప్పొప్పులను తెలియజెప్పడానికి చేసే ప్రయత్నమే విమర్శ. ఇతరులను విమర్శించే పద్ధతిలో మన ఆలోచనలు ఎలా ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకుందాం. 1. అవతలివారు ఏ చిన్న తప్పు చేసినా మీరు అసలు సహించలేరు. వెంటనే వారిని ఏదో ఒకటి అంటేనే కాని మీకు మనసొప్పదు. ఎ. అవును బి. కాదు 2. ఎవరినైనా విమర్శించడమంటే మీకు సరదా! ఎప్పుడు ఎవరు తప్పు చేస్తారా అని కాచుకుని కూర్చుంటారు. ఎ. కాదు బి. అవును 3. అవతలి వారి తప్పును నెమ్మదిగా వారి దృష్టికి తీసుకెళ్లి దానిని సవరించుకోమని వారికి సున్నితంగా సూచిస్తారు. ఎ. కాదు బి. అవును 4. తప్పు చేసిన వారు ఎంతటి వారైనా మీరు సహించలేరు. తక్షణం వారికి ఆ తప్పును తెలియజెప్పడంలో ఏమాత్రం వెనుకాడరు. ఆ సమయంలో మీ స్థాయిని కూడా మరచిపోతారు. ఎ. అవును బి. కాదు 5. మీ విమర్శతో అవతలి వారు తమ పంథాను సరి చేసుకుని, బాగుపడిన దృష్టాంతాలున్నా యి. ఎ. కాదు బి. అవును పైవాటిలో ‘ఎ’ లు ఎక్కువగా వస్తే ఇతరులను విమర్శించడంలోనున్న శ్రద్ధ మిమ్మల్ని మీరు ఆత్మవిమర్శ చేసుకోవడంలో లేదని, విమర్శ అనేది ఇతరులు తమ తప్పును సరిదిద్దుకోవడానికి పనికొచ్చే సాధనంగా ఉండాలి కాని, మరింత కుంగదీసేదిగా ఉండకూడదని గ్ర హించాలి. -
అక్కినేని ఆలోచనలు
‘‘వివేకం, విజ్ఞానం ఉన్న శత్రువు కంటే అవివేకం, అజ్ఞానం ఉన్న మిత్రుడు ప్రమాదకరం.’’ ‘‘నువ్వు మంచివాడవని అందరూ అనుకోవాలని ఆలోచించకు. చెడు చేయకూడదని ఆలోచించు. అది చాలు.. నువ్వు నీకు తెలియకుండానే మంచివాడివే అవుతావు.’’ -
సొంత తెలివితేటలు ఎక్కడ ఉంటాయి?
భాషణం మనిషిని నడిపించేది మైండ్. ‘ఒళ్లు దగ్గర పెట్టుకో’ అంటే అర్థం, మైండ్‌ని కంట్రోల్లో పెట్టుకొమ్మని. అయితే మైండ్‌ని కంట్రోల్లో పెట్టుకోవడం కుదరని పని. ఎందుకంటే మైండే మనిషి కంట్రోల్లో ఉంచుకుంటుంది. మైండ్ ఎంత చెబితే అంత. ఒక విధంగా మైండ్‌కి మనిషి బానిస. mind అంటే సాధారణ అర్థం ‘మనసు’. ‘ఆలోచనలను కలిగించేది’ అని కూడా. కానీ ఇది టెక్నికల్‌గా రాంగ్. ఆలోచనలను కలిగించేది brain అవుతుంది కానీ ‘మనసు’ అవదు. సందర్భాన్ని బట్టి mind అనే మాటకు thoughts, be careful, take care of, oppose అనే అర్థాలూ వస్తాయి. ఈ వాక్యాలు చూడండి. 1) I am not quite clear in my mind about what I am doing. (ఇక్కడ mind అంటే thoughts). 2) Mind that box, the bottom is not very strong. (ఇక్కడ mind అంటే be careful). 3) Could you mind my bag for a moment while I go to the toilet? (ఇక్కడ mind అంటే take care of). 4) Do you mind if I put the television on? (ఇక్కడ mind అంటే oppose). అలాగే mind అనే మాటతో కొన్ని పదబంధాలు ఉన్నాయి. mind-altering, mind-blowing, mindboggling, mind numbing ఇలా. వీటిల్లో ఒక్కోదానికి ఒక్కో అర్థం ఉంది. mind-altering అంటే మనిషిని ఉన్మాదస్థితిలోకి తీసుకెళ్లే ఔషధ గుణం. mind-blowing అంటే ఆశ్చర్యాన్ని, విభ్రమాన్ని కలిగించేదని. Extremely impressive or surprising అన్నమాట. (The special effects in this film are pretty mind-blowing). mind-boggling అంటే మనసును కలవరపరిచే, అతి క్లిష్టమైన అని అర్థం. Extremely surprising and difficult to understand or imagine అని. (She was paid the mind-boggling sum of ten million pounds for that film). ఇక mind-numbing అంటే మాత్రం extremely boring అని. one-track mind అనే ఇంకో మాట ఉంది. అదే ఆలోచన అని దీనర్థం. to think about one particular thing and nothing else అన్నమాట. (And no, Priya, I wasn't talking about money - you have got a one-track mind!).open mind అంటే తెలిసిందే. ఒక అభిప్రాయానికి రావడానికి ముందు అన్ని వైపుల నుంచి నిజానిజాలను తెలుసుకోడానికి సిద్ధంగా ఉండడం. ఇప్పుడు కొన్ని సంక్లిష్టమైన వాడుకల గురించి తెలుసుకుందాం.get your mind round something అంటే ఏదైనా ఒక కష్టమైన అంశాన్ని లేదా కొత్త విషయాన్ని అర్థం చేసుకోవడంలో విజయం సాధించడం. ఈ వాక్యం చూడండి. I find it hard to get my mind round such complex issues. సంక్లిష్టమైన అంశాలను అర్థం చేసుకోలేనని చెప్పడం ఇందులోని భావం. అలాగే have a mind of its own. దీనర్థం కంట్రోల్ తప్పడం అని. ప్రధానంగా ఇది హ్యూమరస్ ఎక్స్ప్రెషన్. మిషన్ గానీ, వస్తువు గానీ మనం నడిపిస్తున్నట్లు కాకుండా, తన ఇష్టానుసారం కదిలిపోతుంటే ఇలా అంటారు. (This shopping trolley has a mind of its own). ఇంకా తేలిగ్గా చెప్పాలంటే... సొంత తెలివితేటలు ఉపయోగించడం అని దీనర్థం. out of mind అంటే బాగా మద్యం సేవించి పట్టుతప్పి పోవడం. బోరు కొట్టి చావడాన్ని కూడా ఇలాగే అంటారు. ఉదా: I'd go out of my mind if I had to do her job all day! mind how you go ఈ ఫ్రేజ్‌ను ఎక్కువగా ఇంగ్లండ్‌లో వాడతారు. దీనర్థం take care అని. ఎవరికైనా వీడ్కోలు చెబుతున్నప్పుడు mind how you go అని అంటే, ‘ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు కాస్త జాగ్రత్త’ అని చెప్పడం. ఇంచుమించు ఇలాంటిదే mind your p's and q'sఅని అనడం. జాగ్రత్తగా, ఆచితూచి మసులుకొమ్మని. ఈ వాక్యం చూడండి. I have to mind my p's and q's when I'm with my grandmother.