మీరు మంచి విమర్శకులేనా?
సెల్ఫ్ చెక్
ఎదుటివారు ఏదైనా తప్పు చేస్తే, తప్పుగా మాట్లాడితే లేదా తప్పుగా రాస్తే వెంటనే దానిని ఖండిస్తూ, అందులోని తప్పొప్పులను తెలియజెప్పడానికి చేసే ప్రయత్నమే విమర్శ. ఇతరులను విమర్శించే పద్ధతిలో మన ఆలోచనలు ఎలా ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకుందాం.
1. అవతలివారు ఏ చిన్న తప్పు చేసినా మీరు అసలు సహించలేరు. వెంటనే వారిని ఏదో ఒకటి అంటేనే కాని మీకు మనసొప్పదు.
ఎ. అవును బి. కాదు
2. ఎవరినైనా విమర్శించడమంటే మీకు సరదా! ఎప్పుడు ఎవరు తప్పు చేస్తారా అని కాచుకుని కూర్చుంటారు.
ఎ. కాదు బి. అవును
3. అవతలి వారి తప్పును నెమ్మదిగా వారి దృష్టికి తీసుకెళ్లి దానిని సవరించుకోమని వారికి సున్నితంగా సూచిస్తారు.
ఎ. కాదు బి. అవును
4. తప్పు చేసిన వారు ఎంతటి వారైనా మీరు సహించలేరు. తక్షణం వారికి ఆ తప్పును తెలియజెప్పడంలో ఏమాత్రం వెనుకాడరు. ఆ సమయంలో మీ స్థాయిని కూడా మరచిపోతారు.
ఎ. అవును బి. కాదు
5. మీ విమర్శతో అవతలి వారు తమ పంథాను సరి చేసుకుని, బాగుపడిన దృష్టాంతాలున్నా యి.
ఎ. కాదు బి. అవును
పైవాటిలో ‘ఎ’ లు ఎక్కువగా వస్తే ఇతరులను విమర్శించడంలోనున్న శ్రద్ధ మిమ్మల్ని మీరు ఆత్మవిమర్శ చేసుకోవడంలో లేదని, విమర్శ అనేది ఇతరులు తమ తప్పును సరిదిద్దుకోవడానికి పనికొచ్చే సాధనంగా ఉండాలి కాని, మరింత కుంగదీసేదిగా ఉండకూడదని గ్ర హించాలి.