self check
-
ఎయిర్‌పోర్ట్‌లో మన బ్యాగ్ మనమే చెక్ చేసుకోవచ్చు.. ఎలాగంటే..
టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ దాదాపు అన్ని సంస్థలు సాంకేతికతలో వస్తున్న మార్పులకు అనువుగా తమనుతాము నిత్యం అప్‌గ్రేడ్ చేసుకుంటున్నాయి. నూతన టెక్నాలజీని ప్రవేశపెట్టడంలో ఎల్లప్పుడూ ముందుండే హైదరాబాద్‌లోని జీఎమ్మార్ అంతర్జాతీయ విమానాశ్రయం మరో ముందడుగు వేసింది. తనిఖీలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రయాణికులను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేకంగా సెల్ఫ్ చెక్ కియోస్క్, సెల్ఫ్ బ్యాగేజ్ డ్రాప్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రయాణికులు టర్మినల్లోకి ప్రవేశించడానికి ముందే తనిఖీలు చేయడం, బ్యాగేజీ చెక్ ఇన్, బోర్డింగ్ పాస్‌ల జారీ వరకు అన్ని సదుపాయాలను ఒకేచోట అందిస్తున్నట్టు జీఎమ్మార్ ఎయిర్పోర్ట్ ఈడీ ఎస్జీకే కిశోర్ అన్నారు. విమానాశ్రయంలో ఆధునిక సదుపాయాలు కల్పించడంలో భాగంగా ప్రయాణికులను ఇబ్బందులకు గురిచేయకుండా సెల్ఫ్ చెక్ కియాస్క్, సెల్ఫ్ బ్యాగేజ్ డ్రాప్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ఆయన చెప్పారు. దీంతో టర్మినల్ వద్ద రద్దీ తగ్గడంతోపాటు ప్రయాణికులు మరింత సులభంగా రాకపోకలు సాగించవచ్చని తెలిపారు. ఇదీ చదవండి: వరుసగా మూడోనెల తగ్గిన ఫ్యూయెల్ ధర.. ఎంతంటే.. కొత్తగా ఏర్పాటు చేసిన కియాస్క్‌ల వద్ద ప్రయాణికులు వారి బ్యాగ్‌లను వారే చెక్ చేసుకోవచ్చు. అక్కడే బోర్డింగ్ పాస్, బ్యాగ్ ట్యాగ్‌లను తీసుకునే అవకాశం కల్పిస్తున్నారు. ఈ సేవలు విమానం ప్రారంభమయ్యే గంట ముందు వరకు అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు. -
పైలట్ రహిత విమానం.. ప్రయోగం విజయవంతం
సాక్షి బెంగళూరు: రక్షణ రంగ సంస్థ డీఆర్డీవో తన తొలి మానవ రహిత విమానాన్ని విజయవంతంగా ఎగరవేసింది. కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లా ఏరోనాటికల్ టెస్ట్ రేంజ్లో శుక్రవారం ఈ పరీక్ష చేపట్టింది. పైలట్ లేకుండా ఎగిరిన ఈ విమానం ల్యాండింగ్ వరకు అన్ని పనులను స్వయంగా నిర్వహించింది. విమానం చక్కగా ఎగిరిందని అధికారులు తెలిపారు. ఇది పూర్తిగా సెల్ఫ్ కంట్రోల్ డ్రైవింగ్‌తో పనిచేస్తుందన్నారు. మానవ రహిత విమానాల అభివృద్ధిలో ఇదొక గొప్ప విజయమని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కొనియాడారు. -
సెల్ఫ్ చెక్
టైమ్‌పాస్ కాకపోతే మొబైల్లో దూరిపోయి ఆటలు ఆడటమో, పాటలు వినడమో లేకపోతే సోషల్ మీడియాలో వార్తలు చూడటమో ఏదోటి చేస్తారు. మరికొందరు హాలిడే ప్లాన్ చేస్తారు. కొందరు ఫ్రెండ్స్‌తో బాతాఖానీ కార్యక్రమం షురూ చేస్తారు. మరి త్రిష ఏం చేస్తారంటే.. ఆత్మపరిశీలన చేసుకుంటారట. ‘‘ఎక్కువ సినిమాలు చేతిలో ఉన్నప్పుడు తక్కువ టైమ్ దొరకుతుంది. అసలు మా గురించి మేం పట్టించుకోలేనంత బిజీగా ఉంటాం. అందుకే ఖాళీ సమయాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుంటాను. అసలు మనం ఏం చేస్తున్నాం? చేస్తున్న సినిమాలు ప్రేక్షకులకు నచ్చుతున్నాయా? లేదా అని విశ్లేషించుకుంటాను. అలాగే వ్యక్తిగతంగా లైఫ్ ఎలా ఉంది? అని సెల్ఫ్ చెక్ చేసుకుంటాను. ఎప్పటికప్పుడు కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఇష్టపడతాను. దొరికిన టైమ్‌లోనే నాతో నేను ఎక్కువగా గడుపుతాను. స్ట్రెస్‌గా ఉన్నప్పుడు ఎలానూ నా ఫ్యామిలీ, నా ఫ్రెండ్స్ నాకు తోడుగా ఉంటారు’’ అని చెప్పుకొచ్చారు త్రిష. -
విమానాశ్రయంలో సెల్ఫ్ చెక్ కయాస్కులు
భువనేశ్వర్ : స్థానిక బిజూ పట్నాయక్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రయాణికుల సౌకర్యాలను మరింతగా మెరుగుపరుస్తున్నారు. విమానాశ్రయంలో ప్రయాణికుల కోసం 5 సెల్ఫ్ చెక్ కయాస్కులు ఏర్పాటు చేశారు. స్వదేశీ టెర్మినల్–1 ప్రాంగణంలో ఈ సదుపాయం కల్పించారు. ఈ యంత్రాలతో ప్రయాణికులు స్వీయ నిర్వహణతో సీటుతో పాటు బోర్డింగ్ పాస్ పొందడానికి వీలవుతుంది. ఈ యం త్రాలను బిజూ పట్నాయక్ అంతర్జాతీయ విమానాశ్రయం డైరెక్టర్ ఎస్.సీ హొత్తా ప్రారంభించారు. ఈ సదుపాయంతో ప్రయాణికుల తనికీ సమయం ఆదా అవుతుంది. తక్కువ(చేతి) లగేజితో ప్రయాణించే వర్గాలకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. దీంతో ప్రయాణికులు బారులు తీరి నిలబడాల్సిన అవసరం ఉండదని డైరెక్టర్ ఎస్.సీ. హొత్తా తెలిపారు. టచ్ స్క్రీన్‌తో ఏర్పాటు చేసే ఈ యంత్రాల్లో ప్రయాణికుల పీఎన్ఆర్ నంబరుతో అనుబంధ సమాచారం నమోదు చేస్తే కోరిక మేరకు సీటుతో పాటు బోర్డింగ్ పాస్ పొందేందుకు వీలవుతుంది. బోర్డింగ్ పాస్ పొందడంతో ప్రయాణికులు నేరుగా సెక్యూరిటీ చెక్కు వెళ్ల గలుగుతాడు. రూ.20 లక్షల వ్యయంతో 5 సెల్ఫ్ చెక్ కయాస్కులు ఏర్పాటు చేశారు. అంచెలంచెలుగా మరిన్ని కయాస్కులు ఏర్పాటు చేస్తామని డైరెక్టర్ తెలిపారు. అంతర్జాతీయ విమాన రవాణా సంస్థ(ఐఏటీఏ,) కామన్ యూజ్ సెల్ఫ్ సర్వీస్(సీయూఎస్ఎస్) మార్గదర్శకాల మేరకు ఈ సదుపాయం ప్రవేశపెట్టడం విశేషం. ప్రారంభ కార్యక్రమానికి విమానాశ్రయ సిబ్బందితో పాటు ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు హాజరయ్యారు. -
స్పెయిన్‌లో సెల్ఫ్ చెక్
ఇంట్లో ఉంటే అమ్మా అని పిలవగానే మనకు కావల్సింది మన చేతులోకి వచ్చేస్తుంది. అన్ని పనులు చకచకా అయిపోతాయి. కానీ బయటకు వెళ్లి ఉన్నప్పుడే తెలుస్తుంది ఆ కష్టమేంటో. ఇప్పుడు హీరో రామ్ కూడా అలాంటి సెల్ఫ్ చెక్ చేసుకుంటున్నారట. స్టూడెంట్‌గా తన పనులన్నీ తానే చేసుకుంటున్నారట. ‘‘గత కొన్ని వారాలుగా స్పెయిన్‌లో స్టూడెంట్‌గా ఉంటున్నాను. మనల్ని మనలాగా ప్రేమించే వాళ్ల చుట్టూ ఉంటూ నా పనులన్నీ నేనే చేసుకుంటున్నాను. ఇలా పనులు మనం చేసుకున్నప్పుడే మనమేంటో తెలుస్తుంది. రియాలిటీ చెక్ చేసుకుంటున్నాను అన్నమాట’’ అంటూ కుకింగ్ చేస్తున్న ఫొటోను షేర్ చేశారు రామ్. ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ అడ్వెంచర్‌లో, త్రినాధరావు నక్కిన డైరెక్షన్లో రూపొందుతోన్న ‘హలో గురూ ప్రేమ కోసమే’ సినిమాలతో బిజీగా ఉన్నారు రామ్. -
సెల్ఫ్‌చెక్ చేసుకో అన్నారు
మనలో చాలామందికి నిద్రపోయే ముందు ఆ రోజు చేసిన పనులన్నింటినీ నెమరేసుకునే అలవాటు ఉంటుంది. ఆ రోజు ఎదైనా తప్పు చేసినా, ఎవరినైనా బాధపెట్టినా లేదా మనకు నచ్చని పని ఏదైనా చేసినా ప్రశాంతంగా నిద్రపోలేం. హీరోయిన్ శ్రుతీహాసన్‌కి కూడా ఇదే అలవాటు ఉందట. నిద్రకు ఉపక్రమించే ముందు ఆ రోజు ఉదయం నుంచి రాత్రి వరకూ తను చేసిన పనులను ఒక్కసారి గుర్తు చేసుకుంటారట. అలా గుర్తు చేసుకోవడమే కాదు ఆరోజు తను ఏదైనా పనిని అయిష్టంగా చేస్తే, అకారణంగా ఎవరినైనా బాధపెడితే జీవితంలో మళ్లీ అలా చేయరట. ఈ అలవాటు ఎక్కడ నుంచి వచ్చింది? అని అడిగితే.. ‘‘ఇదంతా మా నాన్నగారే నేర్పారు. ‘ఏ రోజైనా నువ్వు ప్రశాంతంగా నిద్రపోలేకపోతే ఆ రోజు నువ్వు ఏదో చేయకూడని పని చేసి ఉంటావ్. జీవితంలో ఆ పని మళ్లీ చేయొద్దు’ అనే సూత్రాన్ని చెప్పి, ‘ఎప్పుడూ ఈ విషయాన్ని మర్చిపోవద్దు’ అన్నారు. అంతే.. నాన్నగారి మాటను ఆరోజు నుంచి ఇప్పటికీ ఓ జీవన సూత్రంలాగా పాటిస్తున్నా. ప్రతిరోజూ సెల్ఫ్‌చెక్ చేసుకుంటే వ్యక్తిగా మనం రోజు రోజుకీ బెటర్ అవుతామని నా నమ్మకం’’ అన్నారు శ్రుతీహాసన్. -
ఆ పేరెలా వచ్చింది?
సెల్ఫ్ చెక్ ఊరుంటే దానికి పేరుండాలి కదా! ఆ పేర్లు కొన్ని తమాషాగా ఉంటాయి. కొన్ని పేర్లు వింటే ఇవి ఎలా వచ్చాయో అనిపిస్తుంటుంది. వాటి మూలం ఆసక్తిగా కూడా ఉంటుంది. పేరెలా వచ్చిందో తెలుసుకుంటే ఆ ఊరి ప్రాథమిక వివరాలు తెలిసినట్లే. 1. గుర్గావ్ అంటే ధర్మరాజు ద్రోణాచార్యునికి ఇచ్చిన గ్రామం. ‘గురువుకిచ్చిన గ్రామం’ అని అర్థం. ఎ. అవును బి. కాదు 2. మునార్... అంటే మూడు నదుల మధ్య ప్రదేశం అని అర్థం. ఎ. అవును బి. కాదు 3. చండీఘర్ అంటే చండీమాత ఆవాసం అని అర్థం. ఎ. అవును బి. కాదు 4. సిమ్లాకు ఆ పేరు శ్యామలాదేవి అనే దేవత పేరుతో వచ్చింది. శ్యామల క్రమంగా వాడుకలో సిమ్లా అయింది. ఎ. అవును బి. కాదు 5. మేఘాలయ అంటే మేఘాల నిలయం అనే అర్థంలో ఆ పేరు వచ్చింది. ఎ. అవును బి. కాదు 6. మహిషూరు క్రమంగా మైసూరుగా మారింది. మహిష నివసించిన ఊరని పురాణోక్తి. ఎ. అవును బి. కాదు 7. స్థానికపదం వడోదర బ్రిటిష్ పాలకుల ఉచ్చారణలో బరోడాగా మారిపోయింది. ఎ. అవును బి. కాదు 8. హుబ్బలి అంటే పూలతీగ అని అర్థం. ఇది క్రమంగా హుబ్లి అయింది. ఎ. అవును బి. కాదు మీ సమాధానాల్లో ‘ఎ’లు ఆరుకంటే ఎక్కువగా వస్తే పదాలు, పేర్లు... గురించిన ఆసక్తి ఎక్కువ అనుకోవాలి. ‘బి’లు ఎక్కువైతే మీరు అవసరమైన వివరాల గురించి తప్ప మిగిలిన వాటి మీద పెద్దగా ఆసక్తి చూపరు అనుకోవాలి. -
మీ దుఃఖానికి కారణం మీరేనా?
సెల్ఫ్‌చెక్ మానసికంగా, శారీరకంగా బలంగా ఉండాలంటే సంతోషంగా ఉండాలి. మీప్రవర్తనే మీలో ఆనందాన్నైనా, దుఃఖాన్నైనా కలిగిస్తుంది. ఇతరులని అర్థం చేసుకోవటం చాలా ముఖ్యం. దీని ద్వారానే అపోహలైనా, కలహాలైనా, మంచి సంబంధాలైనా కలుగుతాయి. వివిధ రకాల ప్రవర్తనలు మీలో సంతోషాన్ని నింపుతున్నాయా? ఆందోళనను కలిగిస్తున్నాయా? ఈ సెల్ఫ్‌చెక్ ద్వారా మీ భావాలను తెలుసుకోండి. 1. ఎవరైనా మిమ్మల్ని అభినందిస్తే చాలా తేలికగా తీసుకొని పెద్దగా స్పందించరు. ఎ. అవును బి. కాదు 2. మీ స్నేహితులు మీ పర్సనల్ విషయాల్లో జోక్యం చేసుకుంటే వాళ్లని తీవ్రంగా వ్యతిరేకిస్తారు. ఎ. అవును బి. కాదు 3. నిరాశావాదం మిమ్మల్ని వెంటాడుతుంది. ఎ. అవును బి. కాదు 4. తప్పు జరిగిందని గ్రహించినా మళ్లీమళ్లీ అలాంటి పొరపాటునే చేస్తుంటారు. ఎ. అవును బి. కాదు 5. మీకెవరైనా గిఫ్ట్ ఇస్తే చాలా తప్పుగా అర్థం చేసుకుంటారు. ఎ. అవును బి. కాదు 6. ఖరీదైన వస్తువులు కొన్నప్పుడు చాలా దిగులు చెందుతారు. ఎ. అవును బి. కాదు 7. మీకు రావలసిన ప్రమోషన్ వివిధ కారణాలవల్ల రాకపోతే తీవ్ర నిరాశకు గురవుతారు. ఎ. అవును బి. కాదు 8. అర్థంలేని అనుమానాలు, అపోహలు మిమ్మల్ని వేధిస్తుంటాయి. ఎ. అవును బి. కాదు 9. పార్టీలో సూప్ మీపై పడితే పెద్ద అవమానంగా భావిస్తారు. ఎ. అవును బి. కాదు 10. సమాజంలో చాలామంది మంచివారు కారని మీ విశ్వాసం. ఎ. అవును బి. కాదు ‘ఎ’ సమాధానాలు 7 దాటితే మీ ఆలోచనలతో మీకై మీరే అసంతృప్తిని, దుఃఖాన్ని కలిగించుకుంటారు. ఎప్పుడూ దిగాలుగా ఉంటూ నిరాశావాదంతో, అభద్రతా భావంలో ఉండిపోతారు. ఇలాంటి ఆలోచనలను, ప్రవర్తనను మీరు వెంటనే వదిలిపెట్టాల్సి ఉంటుంది. ‘బి’ సమాధానాలు ‘ఎ’ కంటే ఎక్కువగా వస్తే మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండటానికి ప్రయత్నిస్తారు. నెగెటివ్ ఆలోచనలకు దూరంగా ఉంటారు. పదిమందితో కలిసిపోయి హాయిగా ఉంటారు. -
విజయాల వేటలో మీరెక్కడ?
సెల్ఫ్‌చెక్ విజయం రుచి చూసినవారు దాన్ని వదులుకోవటానికి ఇష్టపడరు. దానికోసం ఎటువంటి కష్టాన్న యినా భరించగలుగుతారు. ఈ స్పృహ ఉన్నవారు నిరంతర శ్రామికులు. లక్ష్యం చేరాక వారు పడిన శ్రమలన్నీ తేలికగా అనిపిస్తాయి. విజయం అవసరంలేదు అనుకొనేవారు సోమరులు. సక్సెస్ సాధించాలి అనే కోరిక మనిషిని హుషారుగా ఉంచుతుంది. విజయాలు చేరుకోవాలనే తృష్ణ మీలో ఉందోలేదో ఒకసారి చెక్ చేసుకోండి. 1. సమాజంలో బాగా పేరున్న వారితో పరిచయం పెంచుకోవాలనుకుంటారు. ఎ. అవును బి. కాదు 2. ఏరోజు పని ఆరోజు పూర్తి చేస్తారు. ఎ. అవును బి. కాదు 3. మిమ్మల్ని అందరూ ఇష్టపడతారు. ఎ. అవును బి. కాదు 4. అందరిలో ఉన్నతంగా కనిపించాలనే తపన మీకుంది. ఎ. అవును బి. కాదు 5. ప్రతికూల అంశాలనూ మీ బలంగా మార్చుకోగలరు. ఎ. అవును బి. కాదు 6. వివిధ రకాల కళలలో మీకు ప్రవేశం ఉంది. ఎ. అవును బి. కాదు 7. సమాజంతో మీకు సత్సంబంధాలు ఉన్నాయి. ఎ. అవును బి. కాదు 8. ఇతరులకు మార్గదర్శకంగా ఉండగలరు. ఎ. అవును బి. కాదు 9. ఎక్కువగా కష్టపడగలరు, స్ఫూర్తి నింపే వారిని ఇష్టపడతారు. ఎ. అవును బి. కాదు 10. మంచిమాటలు ఎవరు చెప్పినా, వాటిని ఫాలో అవుతారు. ఎ. అవును బి. కాదు ‘ఎ’ లు ఏడు దాటితే మీరు విజయాలను సులువుగా చేరుకోగలరు లేదా దానికోసం చివరివరకు ప్రయత్నిస్తారు. ఏ రంగంలోకి వెళ్లినా పట్టుదలను వదులుకోరు. ఓటమిని అంగీకరించే మనస్తత్వం మీకు ఉండదు. ‘బి’ లు ‘ఎ’ ల కన్నా ఎక్కువగా వస్తే సక్సెస్ రేస్‌లో వెనకబడతారు. విజయానికి కావలసింది కష్టపడటం. ‘ఎ’లను సూచనలుగా భావించి, సెల్ఫ్‌కాన్ఫిడెన్స్ నింపుకొని విజయాలబాటలో నడవడానికి ప్రయత్నించండి. -
మీలో సెన్సాఫ్ హ్యూమర్?
సెల్ఫ్ చెక్ నవరసాల్లో నవ్వురసం స్పెషల్. ఇప్పుడు లాఫింగ్ క్లబ్బుల గురించి తెలియని వారు చాలా తక్కువే. నవ్వమని డాక్టర్లు కూడా చెప్పడం తెలిసిందే! మీరు నవ్వుతూ పక్కవారిని కూడ నవ్వించగలరా? మీ సెన్సాఫ్ హ్యూమర్‌ను ఒకసారి చెక్ చేసుకోండి. 1. మీరు ఏదైనా ఫంక్షన్‌కి వెళ్లినప్పుడు పెద్దవాళ్లే కాదు, పిల్లలు కూడా మీ చుట్టూ మూగిపోయి మీ మాటలకి గలగలా నవ్వుతారు. ఎ. అవును బి. కాదు 2. మీ జుట్టు చెదిరిపోయి చికాకుగా అయినప్పుడు ఫంక్షన్‌కు వెళ్లటం మానకుండా వేళ్లతో జుట్టు సరిచేసుకొని ‘ఇదే లేటెస్ట్ హెయిర్‌స్టయిల్’ అనగలిగిన గడుసుతనం మీ సొంతం. ఎ. అవును బి. కాదు 3. మీ ఫ్రెండ్స్ మూడీగా ఉన్నప్పుడు మీ దగ్గరకొస్తే చలాకీగా తిరిగి వెళతారు. ఎ. అవును బి. కాదు 4. వర్తమానంలో జీవించడమే అసలైన జీవితం అని నమ్ముతారు. గడిచిపోయిన కష్టాలను తలుచుకుంటూ బాధపడరు. ఎ. అవును బి. కాదు 5. మీ స్నేహితులు మీతో గడిపిన సమయాన్ని మళ్లీ మళ్లీ సంతోషంగా తలుచుకుంటారు. ఎ. అవును బి. కాదు 6. మిమ్మల్ని చూడగానే మీ పరిచయస్తులు హాయిగా నవ్వేస్తారు. ఎ. అవును బి. కాదు 7. మీరు నవ్వాలంటే ప్రత్యేకమైన జోకులూ, హాస్య సన్నివేశాలే అవసరం లేదు. ఎలాంటి సందర్భంలోనైనా నవ్వు పుట్టించగలరు. ఎ. అవును బి. కాదు 8. మీకు జోకులేవీ గుర్తుండవు. ఎవరైనా జోక్ చెప్పమంటే తడబడతారు. ఎ. కాదు బి. అవును ‘ఎ’ సమాధానాలు 6 పైగా వస్తే మీలో సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎక్కువ. మీ మాటలతో చుట్టుపక్కల వారిని నవ్వుల్లో ముంచెత్తుతారు. సమయానుగుణంగా జోక్‌లు వేస్తూ మీతోపాటు మీ పక్కవారిని ఆనందింపజేస్తారు. ‘బి’ సమాధానాలు 5 దాటితే మీలో హాస్యరసం తక్కువ. మీరు హాస్యాన్ని ఇష్టపడతారు, నవ్వుతారేమోగానీ, పక్కవారిని నవ్వించడానికి కాస్త కష్టపడాల్సిందే. కొద్దిగా ప్రయత్నించండి... మీరు కూడా హ్యూమర్ పండించగలరు. -
అంతర్మథన పర్వం
ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక గెలిచిన పక్షం ఎటూ ప్రభుత్వం ఏర్పాటుపైనా, పదవుల పంపకంపైనా దృష్టి పెడుతుంది. ఆశావహులను ఎలా బుజ్జగించాలో... మిత్రులకు ఎలా సర్దిచెప్పాలో తెలియక నేతలు సతమతమవుతారు. ఇటు-ఓడిన పార్టీ అంతర్మథనంలో పడుతుంది. అంచనాలకూ, ఫలితాలకూ మధ్య ఎక్కడ దారి తప్పామో తెలియక సతమతమవుతుంది. వెల్లువలా వచ్చిపడే సలహాల్లో, విశ్లేషణల్లో పనికొచ్చే ముక్క కోసం గాలిస్తుంది. సంస్కరణల ఎజెండానుంచి పక్కకు తప్పుకోవద్దుసుమా అంటూ ఇప్పటికే ఇంగ్లిష్ మీడియా హెచ్చరించింది. జాతీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని నిర్దేశించుకున్న విధానాన్ని ఒక రాష్ట్రంలోని ఎన్నికల ఫలితాలనుబట్టి మార్చుకోవాల్సిన అవసరం లేదని హితవు చెప్పింది. దాంతోపాటు పడిలేచిన స్టాక్ మార్కెట్లలో మదుపుదార్ల భయాందోళనల జాడ కూడా పసిగట్టారేమో...కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ బుధవారంనాడు 15 రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డీఐ) నిబంధనలు సడలిస్తున్నట్టు ప్రకటించారు. 49 శాతం మొదలుకొని 100 శాతం వరకూ ఎఫ్‌డీఐలకు అనుమతినివ్వబోతున్నట్టు ఆయన తెలిపారు. ఇదంతా ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారం. ఇటు బీజేపీ, ఆరెస్సెస్‌లు కూడా అంతర్మథనాన్ని ప్రారంభించాయి. ఫలితాలు వెలువడ్డాక బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ఆరెస్సెస్ అధినేత మోహన్ భాగవత్‌ను కలిశారు. ఆ తర్వాత పార్టీ పార్లమెంటరీ బోర్డు సమావేశమైంది. రిజర్వేషన్లపై చేసిన వ్యాఖ్య కారణంగానే ఈ పరిస్థితి ఏర్పడిందని ఇప్పటికే బిహార్‌కు చెందిన బీజేపీ ఎంపీ ఒకరు అన్నారు. భాగవత్ వ్యాఖ్యానాల అంతరార్థాన్ని వివరించడంలో పార్టీ విఫలమైందన్నది ఆరెస్సెస్‌కు సంబంధించినవారి జవాబు. తుది దశ పోలింగ్‌కు ముందు రోజు ఆరెస్సెస్ ఒక ట్వీట్ ద్వారా తానే భాగవత్ వ్యాఖ్యలపై వివరణనిచ్చింది. రిజర్వేషన్లు తొలగించాలని ఆరెస్సెస్ మోదీ సర్కారుకు సూచించిందంటూ మహా కూటమి కరపత్రాల ద్వారా తప్పుడు ప్రచారాన్ని చేస్తున్నదన్నది ఆ ట్వీట్ సారాంశం. మహా కూటమి అధికారంలోకొస్తే ఓబీసీ కోటాను ముస్లింలకు పంచుతుందని సాక్షాత్తూ ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగ సభల్లో చెప్పిన మాటను విశ్వసించకుండా...కూటమి కరపత్రాలనే జనం ఎందుకు నమ్మారో ఆరెస్సెస్ ఆలోచించుకోవాలి. బాధ్యతారహిత ప్రకటనలవల్లే బిహార్‌లో ఓటమి సంభవించిందని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ చెబుతున్నారు. పార్లమెంటరీ బోర్డు సమావేశం అనంతరం చెప్పిన మాట గనుక ఆ అంశంపై గట్టిగానే చర్చ జరిగిందనుకోవాలి. కానీ అలా బాధ్యతారహిత ప్రకటనలు చేసినవారి జాబితాలో ఎవరెవరున్నారో తెలిస్తే తప్ప ఈ చర్చ ఆత్మ విమర్శగా సాగిందా లేక వేరేవారిపై నెపం వేసే దిశగా సాగిందా అన్న సంగతి తెలియదు. ఎందుకంటే అలాంటి ప్రకటనలు చేసినవారు పార్టీలో కిందినుంచి పై వరకూ ఉన్నారు. వాటివల్ల బీజేపీకి రావలసిన సీట్లు కొన్ని పోయిన మాట వాస్తవమే అయినా...దేశంలోని సామరస్య వాతావరణానికి అంతకన్నా ఎక్కువ నష్టం జరిగిందన్నది నిజం. ఎందుకంటే అలా వ్యాఖ్యానించినవారిలో నరేంద్రమోదీ, అమిత్ షా మొదలుకొని విజయ్ వరిగియా, సాధ్వీ ప్రాచీ వరకూ ఎందరో ఉన్నారు. హేతువాద భావాలను ప్రచారం చేసే మేథావుల ప్రాణాలు తీయడంనుంచి...దాద్రీలో గొడ్డు మాంసం తిన్నారంటూ ఒక కుటుంబంపై దాడిచేసి ఆ ఇంటి పెద్దను హతమార్చడం వరకూ చోటు చేసుకున్న అనేక ఘటనల విషయంలో వివిధ నేతలు చేసిన వ్యాఖ్యానాలు సరిగా ఆలోచించే పౌరులందరినీ కలవరపరిచాయి. దేశంలో ఏర్పడిన వైషమ్య వాతావరణంపై ఆందోళన కనబరుస్తూ సాహిత్య అకాడెమీ అవార్డుల్ని తిరిగి ఇచ్చేసిన రచయితలు, కళాకారులు, కవులు, శాస్త్రవేతలు, చరిత్రకారులను బీజేపీ నేతలంతా ఏమని విమర్శించారో, వారిపై ఎలాంటి ఆరోపణలు చేశారో ఎవరూ మరిచిపోరు. వారిలో తాను కూడా ఉన్న సంగతిని అరుణ్ జైట్లీ గుర్తుంచుకోవాలి. నేరాలకు పాల్పడేవారికీ, నోరు జారేవారికీ మధ్య తేడా చూడాలని జైట్లీ చెబుతున్నారు. నేరంతో నేరుగా ప్రమేయం లేకపోవచ్చుగానీ అలాంటి స్వభావం లేకుండా ఆ మాటలొస్తాయా? ఇప్పుడు బిహార్‌లో నష్టం జరిగింది గనుక అవన్నీ ‘బాధ్యతారహిత ప్రకటనల’ని పార్టీ గుర్తించిందిగానీ వేరే రకమైన ఫలితాలొస్తే కనీసం ఈ మాత్రమైనా ఆలోచించేవారా? ఇకనుంచి ఎన్నికల ప్రచారంలో మతపరమైన అంశాల విషయంలో తీవ్రమైన వ్యాఖ్యలు చేయకుండా ఆచితూచి వ్యవహరించాలని అమిత్ షాకు భాగవత్ సూచించారని అంటున్నారు. కానీ ఇలాంటి అంతర్మథనం జరుపుకుని 24 గంటలు గడవక ముందే కర్ణాటకలో టిప్పు సుల్తాన్ జయంతి వేడుకలు జరపడాన్ని నిరసిస్తూ బీజేపీ, వీహెచ్‌పీలు ఆందోళన చేపట్టడం, హింస చోటుచేసుకోవడాన్ని ఎలా అర్ధం చేసుకోవాలి? ఎప్పటినుంచో నరేంద్ర మోదీపైనా, అమిత్ షా పైనా గుర్రుగా ఉన్న అద్వానీ, మురళీ మనోహర్ జోషి, యశ్వంత్‌సిన్హా, అరుణ్ శౌరి తదితర నేతలు కూడా విడిగా మంగళవారం సమావేశమై తీవ్ర పదజాలంతో వారిని విమర్శించారు. ఢిల్లీ ఎన్నికల ఓటమి సమయంలోనే ఇలాంటి ఆలోచన చేసినా మహారాష్ట్ర, హరియాణా ఎన్నికల్లో పార్టీ విజయం తర్వాత వారంతా తగ్గి ఉన్నారు. సహజంగానే బిహార్ ఓటమి వారికి అందివచ్చింది. అయితే వారి ఉద్దేశాల మాట అటుంచి ఆ నేతల తర్కం మాత్రం కొట్టిపారేయదగ్గది కాదు. బిహార్ ఎన్నికల ప్రచారానికి సారథ్యంవహించినవారే ఓటమిపై సమీక్షించుకుని ఏదో ఒక నిర్ణయానికి రావడం సరికాదన్న వారి వాదనలో పస ఉంది. విజయం సాధిస్తే సొంతం చేసుకునేవారు ఓటమికి ఎందుకు బాధ్యతవహించరన్న వారి ప్రశ్న సహేతుకమైనదే. మరో ఏడాది వ్యవధిలో మరికొన్ని రాష్ట్రాల ఎన్నికలు జరగబోతున్నాయి. బీజేపీలో ప్రస్తుతం సాగుతున్న అంతర్మథనం అప్పటికైనా పరిస్థితిని మెరుగుపరుస్తుందేమో చూడాలి. -
మీరు కష్టాన్ని నమ్మే వ్యక్తులేనా.?
సెల్ఫ్ చెక్ కొందరికి పని సులభంగా చేయాలని ఉంటుంది. అదృష్టం కలిసి వస్తేనే ఇలాంటి వారు అందలం ఎక్కగలరు... మరికొందరు కష్టపడి పనిచేస్తారు. ఆ తర్వాతే ఫలితం ఆశిస్తారు. ఇలాంటి వారికి అదృష్టం కలిసిరాకపోయినా ఫలితం దక్కుతుంది. మీరు ఏ కోవకు చెందేవారో చెక్ చేసుకోండి. 1. మీరు ఎంత కష్టపడాలో అంత కష్టపడతారు. తర్వాత ఫలితం ఆశిస్తారు. ఎ. అవును బి. కాదు 2. మీలోని అపారమైన సంకల్పబలం మీ కష్టపడే తత్వం వల్లనే వచ్చింది. ఎ. అవును బి. కాదు 3. మీ పని నాణ్యతను ఎప్పటికప్పుడు పెంచుకుంటూ ఉంటారు. ఎ. అవును బి. కాదు 4. ఎంత కష్టమైనా అనుకున్న పని సాధించాలని తపన పడతారు. ఎ. అవును బి. కాదు 5. ఇతరుల నుంచి మాట పడే పరిస్థితిని ఎన్నటికీ రానివ్వరు. ఎ. అవును బి. కాదు పై వాటిల్లో మూడింటికి అవును అన్నది మీ సమాధానమైతే మీరు అదృష్టం కంటే మీ కష్టాన్ని నమ్ముకునే వ్యక్తి అని అర్థం. -
సెల్ఫ్ చెక్
ఇంగ్లిషులో జనవరి, ఫిబ్రవరి, మార్చి... లానే తెలుగులో చైత్రం, వైశాఖం, జ్యేష్టం... ఇలా మాసాలను లెక్కిస్తారు. అయితే తెలుగు మాసాలకు ఆ పేర్లు ఎలా వచ్చాయో తెలుసో లేదో గుర్తుచేసుకునేందుకే ఈ సెల్ఫ్ చెక్. 1. చిత్తానక్షత్రంలో పౌర్ణమి రావడం వల్ల చైత్రమాసమని, విశాఖానక్షత్రంలో పౌర్ణమి రావడం వల్ల అది వైశాఖమాసమనీ తెలుసు. ఎ. అవును బి. కాదు 2. పౌర్ణమినాడు జ్యేష్ఠానక్షత్రం ఉంటుంది కాబట్టి అది జ్యేష్టమాసం. ఎ. అవును బి. కాదు 3. పూర్వాషాఢ లేదా ఉత్తరాషాఢ నక్షత్రంలో పౌర్ణమి రావడం వల్ల అది ఆషాఢం. ఎ. అవును బి. కాదు 4. {శావణ మాసమంటే పౌర్ణమినాడు శ్రవణ నక్షత్రముంటుందని మీకు తెలుసు. ఎ. అవును బి. కాదు 5. ఉత్తరాభాద్ర లేదా పూర్వాభాద్ర నక్షత్రంలో పున్నమి రావడం వల్ల అది భాద్రపదమాసమని, అశ్విని నక్షత్రంలో పౌర్ణమి ఉంటే ఆశ్వయుజ మాసమని, కృత్తికా నక్షత్రంలో పౌర్ణమి ఉంటే కార్తిక మాసమని తెలుసు ఎ. అవును బి. కాదు 6. పౌర్ణమినాడు మృగశిరా నక్షత్రం ఉండటం వల్ల అది మార్గశిరమాసంగా తెలుసు. ఎ. అవును బి. కాదు 7. పుష్యమీ నక్షత్రంలో పౌర్ణమి ఉంటే పుష్యమాసం, మఖానక్షత్రంలో పూర్ణిమ ఉంటే అది మాఘమాసమనీ తెలుసు. ఎ. అవును బి. కాదు 8. ఉత్తరఫల్గుణి లేదా పూర్వఫల్గుణీ నక్షత్రంలో పున్నమి ఉంటే అది ఫాల్గుణమాసమనీ గుర్తు. ఎ. అవును బి. కాదు పైవాటిలో ‘బి’లు ఎక్కువ వస్తే మీరు లౌకిక వ్యవహారాలే కాదు, మన ఆచార సంప్రదాయాలపట్ల కూడా అవగాహన పెంచుకోవాలని అర్థం. -
దీపారాధన తెలుసా?
సెల్ఫ్ చెక్ మనం దీపారాధన చేస్తుంటాము. అయితే ఏదో ఒక నూనెతో, ఎలా పడితే అలా దీపం వెలిగించడం సరికాదు. అదేవిధంగా మనం తరచు ఉపయోగించే కొన్ని పదాలకు ఆ పేర్లెందుకు వచ్చాయో చాలామందికి తెలియదు. వాటిని తెలుసుకోవడం అవసరం. 1. గణపతికి కొబ్బరినూనెతో చేసే దీపారాధన ఫలప్రదం ఎ. అవును బి.కాదు 2. లక్ష్మీదేవికి చేసే దీపారాధనకు ఆవునెయ్యి మంచిది ఎ. అవును బి.కాదు 3. దీపారాధనకు పనికిరానిది వేరుశనగ, రిఫైండాయిల్ ఎ. అవును బి.కాదు 4. నిత్య దీపారాధనకు నువ్వుల నూనె శ్రేష్ఠం ఎ. అవును బి.కాదు 5. తాంబూలంలో పెట్టవలసిన వక్కలు ఒకటి లేదా మూడు ఎ.అవును బి. కాదు 6. ముత్తైవ అంటే 5 అలంకారాలతో ఉండునది అని అర్థం. ఆ అయిదు పసుపు, కుంకుమ, మట్టెలు, గాజులు, తాళి ఎ. అవును బి.కాదు పైవాటిలో‘బి’లు ఎక్కువ వస్తే మీరు లౌకిక వ్యవహారాలే కాదు, మన ఆచార సంప్రదాయాలపట్ల కూడా అవగాహన పెంచుకోవాలని అర్థం. -
మీరు మంచి విమర్శకులేనా?
సెల్ఫ్ చెక్ ఎదుటివారు ఏదైనా తప్పు చేస్తే, తప్పుగా మాట్లాడితే లేదా తప్పుగా రాస్తే వెంటనే దానిని ఖండిస్తూ, అందులోని తప్పొప్పులను తెలియజెప్పడానికి చేసే ప్రయత్నమే విమర్శ. ఇతరులను విమర్శించే పద్ధతిలో మన ఆలోచనలు ఎలా ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకుందాం. 1. అవతలివారు ఏ చిన్న తప్పు చేసినా మీరు అసలు సహించలేరు. వెంటనే వారిని ఏదో ఒకటి అంటేనే కాని మీకు మనసొప్పదు. ఎ. అవును బి. కాదు 2. ఎవరినైనా విమర్శించడమంటే మీకు సరదా! ఎప్పుడు ఎవరు తప్పు చేస్తారా అని కాచుకుని కూర్చుంటారు. ఎ. కాదు బి. అవును 3. అవతలి వారి తప్పును నెమ్మదిగా వారి దృష్టికి తీసుకెళ్లి దానిని సవరించుకోమని వారికి సున్నితంగా సూచిస్తారు. ఎ. కాదు బి. అవును 4. తప్పు చేసిన వారు ఎంతటి వారైనా మీరు సహించలేరు. తక్షణం వారికి ఆ తప్పును తెలియజెప్పడంలో ఏమాత్రం వెనుకాడరు. ఆ సమయంలో మీ స్థాయిని కూడా మరచిపోతారు. ఎ. అవును బి. కాదు 5. మీ విమర్శతో అవతలి వారు తమ పంథాను సరి చేసుకుని, బాగుపడిన దృష్టాంతాలున్నా యి. ఎ. కాదు బి. అవును పైవాటిలో ‘ఎ’ లు ఎక్కువగా వస్తే ఇతరులను విమర్శించడంలోనున్న శ్రద్ధ మిమ్మల్ని మీరు ఆత్మవిమర్శ చేసుకోవడంలో లేదని, విమర్శ అనేది ఇతరులు తమ తప్పును సరిదిద్దుకోవడానికి పనికొచ్చే సాధనంగా ఉండాలి కాని, మరింత కుంగదీసేదిగా ఉండకూడదని గ్ర హించాలి. -
మీరు కూడా ఇంతేనా?
సెల్ఫ్‌చెక్ 1. బస్సులో కూర్చున్నప్పుడు ప్రతి వ్యక్తినీ అనుమానంగా చూస్తారు. ఎ.అవును. బి. కాదు 2. కొత్తవ్యక్తులతో పరిచయం చేసుకోవడానికి ఇష్టపడరు. కొత్తవారిని నమ్మకూడదు అనేది మీ విశ్వాసం. ఎ.అవును. బి. కాదు 3. గతంలో ఎవరికో సహాయం చేస్తే ఇరుకున పడ్డామనే కారణంతో, మంచి వారికి కూడా సహాయం చేయడానికి నిరాకరిస్తుంటారు. ఎ.అవును. బి.కాదు 4. ఒకరి మీద ఒక అభిప్రాయం ఏర్పడితే... ఇక అది ఎప్పటికీ అలాగే ఉంటుంది. ఎ.అవును. బి.కాదు 5. నిజానిజాలు తెలుసుకునే ఓపిక ఉండదు. ఏది జరిగినా మీకు అన్వయించుకుంటారు. ఎ.అవును. బి.కాదు 6. ఒక వ్యక్తి చేసే తప్పులను అందరికీ అన్వయించుకుంటారు. ఎ.అవును. బి.కాదు 7. ఎప్పుడూ మనసు మనసులో ఉండదు. అకారణంగా ఆందోళన పడుతుంటారు. ఎ.అవును. బి. కాదు ఒకసారి ఒక హోటల్‌కు వెళ్లారు. ఆ రోజు పొరపాటున చట్నీలో ఉప్పు ఎక్కువై ఉంటుంది. ఇక జన్మలో ఆ హోటల్‌కు వెళ్లొద్దనుకుంటారు. ఒకాయన సరదాకు మీతో ఒకసారి అబద్ధమాడి ఉంటాడు. ఇక మీ దృష్టిలో అతను ఎప్పుడూ అబద్ధాలకోరే.... దీన్నే ‘ఓవర్ జనరలైజేషన్’ అంటారు. దీని వల్ల చాలా నష్టాలు ఉన్నాయి. చాలామందికి దూరమయ్యే ప్రమాదం ఉంది. అకారణశత్రుత్వం ఏర్పడుతుంది. పై వాటిలో మీకు ‘ఎ’లు ఎక్కువగా వచ్చాయంటే, జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.