ఇంట్లో ఉంటే అమ్మా అని పిలవగానే మనకు కావల్సింది మన చేతులోకి వచ్చేస్తుంది. అన్ని పనులు చకచకా అయిపోతాయి. కానీ బయటకు వెళ్లి ఉన్నప్పుడే తెలుస్తుంది ఆ కష్టమేంటో. ఇప్పుడు హీరో రామ్ కూడా అలాంటి సెల్ఫ్ చెక్ చేసుకుంటున్నారట. స్టూడెంట్‌గా తన పనులన్నీ తానే చేసుకుంటున్నారట. ‘‘గత కొన్ని వారాలుగా స్పెయిన్‌లో స్టూడెంట్‌గా ఉంటున్నాను. మనల్ని మనలాగా ప్రేమించే వాళ్ల చుట్టూ ఉంటూ నా పనులన్నీ నేనే చేసుకుంటున్నాను. ఇలా పనులు మనం చేసుకున్నప్పుడే మనమేంటో తెలుస్తుంది. రియాలిటీ చెక్ చేసుకుంటున్నాను అన్నమాట’’ అంటూ కుకింగ్ చేస్తున్న ఫొటోను షేర్ చేశారు రామ్. ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ అడ్వెంచర్‌లో, త్రినాధరావు నక్కిన డైరెక్షన్‌లో రూపొందుతోన్న ‘హలో గురూ ప్రేమ కోసమే’ సినిమాలతో బిజీగా ఉన్నారు రామ్.
Comments
Please login to add a commentAdd a comment