టైమ్‌పాస్ కాకపోతే మొబైల్‌లో దూరిపోయి ఆటలు ఆడటమో, పాటలు వినడమో లేకపోతే సోషల్ మీడియాలో వార్తలు చూడటమో ఏదోటి చేస్తారు. మరికొందరు హాలిడే ప్లాన్ చేస్తారు. కొందరు ఫ్రెండ్స్‌తో బాతాఖానీ కార్యక్రమం షురూ చేస్తారు. మరి త్రిష ఏం చేస్తారంటే.. ఆత్మపరిశీలన చేసుకుంటారట. ‘‘ఎక్కువ సినిమాలు చేతిలో ఉన్నప్పుడు తక్కువ టైమ్ దొరకుతుంది. అసలు మా గురించి మేం పట్టించుకోలేనంత బిజీగా ఉంటాం. అందుకే ఖాళీ సమయాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుంటాను. అసలు మనం ఏం చేస్తున్నాం? చేస్తున్న సినిమాలు ప్రేక్షకులకు నచ్చుతున్నాయా? లేదా అని విశ్లేషించుకుంటాను. అలాగే వ్యక్తిగతంగా లైఫ్ ఎలా ఉంది? అని సెల్ఫ్ చెక్ చేసుకుంటాను. ఎప్పటికప్పుడు కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఇష్టపడతాను. దొరికిన టైమ్‌లోనే నాతో నేను ఎక్కువగా గడుపుతాను. స్ట్రెస్‌గా ఉన్నప్పుడు ఎలానూ నా ఫ్యామిలీ, నా ఫ్రెండ్స్ నాకు తోడుగా ఉంటారు’’ అని చెప్పుకొచ్చారు త్రిష.
Comments
Please login to add a commentAdd a comment