'Thalapathy 68': Vijay to join hands with director Venkat Prabhu - Sakshi
Sakshi News home page

CSK: 'సీఎస్‌కే' టైటిల్‌ ఫిక్స్‌ చేయనున్న విజయ్‌?

Published Tue, Jun 6 2023 10:31 AM | Last Updated on Tue, Jun 6 2023 12:00 PM

kollywood vijay 68movie prabhu director - Sakshi

సినీ ప్రపంచంలో స్టార్‌ కథానాయకుల చిత్రాలు ప్రారంభం కాక ముందు నుంచే ప్రచారం హోరెత్తిపోతున్న విషయం తెలిసిందే! కోలీవుడ్‌ హీరో విజయ్‌ కొత్త చిత్రం గురించి ఇలానే రోజుకో వార్త సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తోంది. ప్రస్తుతం ఈయన లియో చిత్రంలో నటిస్తున్నారు. లోకేష్‌ కనకరాజు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సెవెన్‌ స్క్రీన్‌ స్టూడియో పతాకంపై ఎస్‌ఎస్‌ లలిత్‌ కుమార్‌ భారీ బడ్జెట్లో నిర్మిస్తున్న విషయం తెలిసిందే. త్రిష, ప్రియా ఆనంద్‌ హీరోయిన్స్‌గా నటిస్తున్న ఈ  చిత్ర షూటింగ్‌ శరవేగంగా జరుపుకుంటోంది. లియో చిత్రం దీపావళికి థియేటర్లో విడుదల కానుంది.

(ఇదీ చదవండి: నయనతార గ్లామర్‌ రహస్యం.. ఆ రెండింటినీ అస్సలు మిస్‌ చేయని హీరోయిన్‌)

దీంతో విజయ్‌ తన 68వ చిత్రానికి రెడీ అయిపోతున్నారు. దీనికి పలు దర్శకులు క్యూలో ఉండగా అనూహ్యంగా వెంకట్‌ ప్రభు పేరు ముందుకు రావడం విశేషం. ఇందులో త్రిష మరోసారి విజయ్‌తో జతకట్టనున్నట్లు ప్రచారం జరుగుతున్నా అధికారికంగా వెల్లడి కాలేదు. ప్రస్తుతం దర్శకుడు వెంకట్‌ ప్రభు ఇందులో నటించే నటీనటులు సాంకేతిక వర్గం ఎంపికపై దృష్టి పెట్టినట్లు సమాచారం అయితే ఈ చిత్రంలో విలన్‌గా నటుడు ఎస్‌ జే.సూర్యను ఎంపిక చేసేందుకు చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. కాగా ఇది తండ్రి కొడుకుల మధ్య తలెత్తే అభిప్రాయ బేధాల నేపథ్యంలో సాగే కుటుంబ కథా చిత్రంగా ఉంటుందని ప్రచారం జరుగుతోంది. మరో విషయం ఏమిటంటే ఈ చిత్రానికి క్రికెట్‌ క్రీడకు సంబంధించిన పేరును నిర్ణయించాలని భావిస్తున్నట్లు, ఆ విధంగా దీనికి సీఎస్‌కే అనే పేరు పెట్టాలని భావిస్తున్నట్లు తెలిసింది.

(ఇదీ చదవండి: ఇండియాలో టాప్‌ 50 వెబ్‌ సిరీస్‌లు ఇవే! రానా నాయుడు ఏ ప్లేస్‌లో ఉందంటే?)

దీంతో సినిమాపై క్రికెటర్‌ ధోనీ మార్క్‌ ఉండనుంది. ఐపీఎల్‌లో సీఎస్‌కే కోసం ధోనీ ప్రాతినిథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా టైటిల్‌కు నటుడు విజయ్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తే అధికారికంగా వెల్లడించాలని చిత్ర యూనిట్‌ భావిస్తున్నట్లు సమాచారం. సీఎస్‌కే పేరు బయటకు రావడంతో విజయ్‌ అభిమానులు ఆనందాల్లో మునిగి తేలుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement