Time pass
-
హలో..వద్దు మాస్టారు
సాక్షి, గుంటూరు(త్తెనపల్లి) : జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో సెల్ఫోన్లను నిషేధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పాఠశాలల్లో సెల్ఫోన్ల వినియోగానికి ఎట్టకేలకు తాళం పడింది. ఉపాధ్యాయులు విధి నిర్వహణ ఉన్న సమయంలో వీటిని వాడకూడదన్న నిబంధన ఎప్పటి నుంచో ఉన్నా ఎవరూ పట్టించుకోలేదు. తాజాగా తరగతి గదుల్లో వీటి వినియోగాన్ని నిషేధిస్తూ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. పాఠశాలల్లో సెల్‌ఫోన్ వినియోగాన్ని నిషేధిస్తూ గతంలోనే విద్యా శాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. కానీ, అవి ఎక్కడా అమలు కాలేదు. దీనిపై ఎప్పటికప్పుడు విద్యాశాఖ ఉన్నతాధికారులు హెచ్చరిస్తున్నా ఫలితం ఉండట్లేదు. ప్రభుత్వ విద్యావ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతున్న కారణంగా సెల్‌ఫోన్ వాడకాన్ని నిషేధించాలని ముఖ్యమంత్రి ఆదేశాలిచ్చారు. ప్రధానోపాధ్యాయులదే బాధ్యత జిల్లాలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో ఇప్పుడు సెల్ఫోన్ల నిషేధం పక్కాగా అమలు చేయాల్సి ఉంది. పాఠశాలలోని ప్రధానోపాధ్యాయులకు వీటి విషయంలో బాధ్యత పెరిగింది. ఉపాధ్యాయులు సెల్ఫోన్లు తీసుకుని స్టాఫ్ రూములో భద్రపరుచుకోవాల్సి ఉంటుంది. బడి సమయం ముగిసిన తర్వాత వాటిని తిరిగి తీసుకోవాలి. ప్రధానోపాధ్యాయులు సైతం వీటిని వినియోగించడానికి వీలు లేదు. తరగతి గదిలో ఫోన్ వాడితే ఉపాధ్యాయులతోపాటు ఆ పాఠశాల హెచ్ఎంలను కూడా బాధ్యులను చేస్తూ కఠిన చర్యలు తీసుకుంటామని విద్యా శాఖ ఉన్నతాధికారుల నుంచి హెచ్చరికలు జారీ అయ్యాయి. ఈ నేపథ్యంలో ఇకపై సెల్ఫోన్లను పాఠశాలలకు తీసుకెళ్లకూడదని కొందరు ఉపాధ్యాయులు భావిస్తున్నారు. ఈ నిబంధనలు తప్పనిసరి.. తరగతి గదిలో ఉన్నంత సేపు సెల్‌ఫోన్ మాట్లాడరాదని, వాట్సాప్, ఫేస్బుక్ వంటి సామాజిక మాధ్యమాలను తరగతి గదుల్లో ఉపయోగించరాదని ఆదేశాల్లో పేర్కొన్నారు. వాటిని వినియోగిండం వలన ఉపాధ్యాయుల ఏకాగ్రత దెబ్బతినడమే కాకుండా విద్యార్థుల దృష్టి మరలే అవకాశం ఉంది. అంతేకాకుండా ఇటువంటి అలవాట్లు ఉపాధ్యాయుల నుంచి విద్యార్థులకు సంక్రమిస్తాయని భావిస్తున్నారు. ఉపాధ్యాయులు పాఠశాలకు వెళ్లిన వెంటనే సెల్ఫోన్లు సైలెంట్ మోడ్‌లో పెట్టి స్టాఫ్ రూములో భద్రపరుచుకోవాలి, లేకంటే ప్రధానోపాధ్యాయుడి నియంత్రణలో ఉంచాల్సి ఉంటుంది. భోజన విరామ సమయంలో మాత్రమే ఉపాధ్యాయులు సెల్ఫోన్లు వాడుకోవాల్సి ఉంది. డ్రెస్ కోడ్.. వీటితో పాటు పాఠశాలల్లో గురువులు డ్రెస్ కోడ్ నిబంధనలు పాటించేలా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రధానంగా ఉపాధ్యాయులు, ప్రధానో పాధ్యాయులు విధిగా డ్రెస్ కోడ్ పాటించాల్సి ఉంది. 8/4 జేబులతో కూడిన ఫ్యాంట్లు కానీ, టీషర్టులు కానీ వేసుకోకూడదు. ఉపాధ్యాయినులు విధిగా చీరలు ధరించాలి. వ్యాయామ ఉపాధ్యాయులకు మాత్రం వీటిలో మినహాయింపు ఇచ్చారు. ఈ నిబంధనలను ఉపాధ్యాయులు తప్పనిసరిగా పాటించాలని, వీటిని అతిక్రమిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని అధికారులు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రభుత్వ బడుల్లో సెల్‌ఫోన్ వినియోగంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇప్పటికే నిబంధనలు అమలు చేస్తున్నా.. ఉపాధ్యాయులు పట్టించుకోకపోవడంతో కఠిన నిర్ణయం తీసుకుంది. పాఠాలు పక్కనబెట్టి కొందరు టీచర్లు తరగతి గదుల్లోనే సెల్‌ఫోన్ కబుర్లతో కాలం వెళ్ల్లదీస్తున్నారు. ఆండ్రాయిడ్ ఫోన్లు కావడంతో ఇంటర్నెట్లో బిజీబిజీగా గడుపుతున్నారు. ఈ క్రమంలో విద్యార్థుల చదువుపై ప్రభావం చూపుతోందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. -
సెల్ఫ్ చెక్
టైమ్‌పాస్ కాకపోతే మొబైల్లో దూరిపోయి ఆటలు ఆడటమో, పాటలు వినడమో లేకపోతే సోషల్ మీడియాలో వార్తలు చూడటమో ఏదోటి చేస్తారు. మరికొందరు హాలిడే ప్లాన్ చేస్తారు. కొందరు ఫ్రెండ్స్‌తో బాతాఖానీ కార్యక్రమం షురూ చేస్తారు. మరి త్రిష ఏం చేస్తారంటే.. ఆత్మపరిశీలన చేసుకుంటారట. ‘‘ఎక్కువ సినిమాలు చేతిలో ఉన్నప్పుడు తక్కువ టైమ్ దొరకుతుంది. అసలు మా గురించి మేం పట్టించుకోలేనంత బిజీగా ఉంటాం. అందుకే ఖాళీ సమయాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుంటాను. అసలు మనం ఏం చేస్తున్నాం? చేస్తున్న సినిమాలు ప్రేక్షకులకు నచ్చుతున్నాయా? లేదా అని విశ్లేషించుకుంటాను. అలాగే వ్యక్తిగతంగా లైఫ్ ఎలా ఉంది? అని సెల్ఫ్ చెక్ చేసుకుంటాను. ఎప్పటికప్పుడు కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఇష్టపడతాను. దొరికిన టైమ్‌లోనే నాతో నేను ఎక్కువగా గడుపుతాను. స్ట్రెస్‌గా ఉన్నప్పుడు ఎలానూ నా ఫ్యామిలీ, నా ఫ్రెండ్స్ నాకు తోడుగా ఉంటారు’’ అని చెప్పుకొచ్చారు త్రిష. -
సెల్ఫోన్లను ఎక్కువగా వాడేది అమ్మాయిలే!
న్యూయార్క్: కళాశాలల్లో చదువుకునే అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిలే ఎక్కువగా సెల్‌ఫోన్‌తో కాలక్షేపం చేస్తున్నారని తాజా అధ్యయనంలో వెల్లడైంది. రోజుకు సగటున అమ్మాయిలు 10 గంటల పాటు ఫోన్ వాడితే...అబ్బాయిలు 8 గంటలు ఉపయోగిస్తున్నారట. అమెరికాకు చెందిన బేలర్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తల పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది. దాదాపు 60 శాతం విద్యార్థులు తాము సెల్ఫోన్లకు బానిసలయినట్లు సర్వేలో పేర్కొన్నారు. సెల్ఫోన్లను ఎక్కువగా వాడటం వల్ల చదువుపై ప్రతికూల ప్రభావం చూపుతుందని ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన జేమ్స్ రాబర్ట్స్ తెలిపారు. అబ్బాయిలు ఎక్కువగా వినోదం కోసం సెల్ఫోన్లు వాడుతున్నారని, అమ్మాయిలు సామాజిక విషయాల కోసం ఉపయోగిస్తున్నారని రాబర్ట్ తెలిపారు. రాబర్ట్ బృందం ఆన్లైన్ ద్వారా కళాశాల విద్యార్థులపై ఈ సర్వే నిర్వహించింది. -
అలాగైతే నువ్వు ఆర్టిస్ట్‌వి కాదన్నారు నాన్న : ఆకాశ్ పూరి
‘‘మరాఠీ చిత్రాల ఆధారంగా గతంలో తెలుగులో చాలా సినిమాలు రూపొందాయి. మా సంస్థ నుంచి వచ్చిన ‘వదినగారి గాజులు’ కూడా ఓ మరాఠీ చిత్రం ఆధారంగా చేసినదే. ఇప్పుడీ ‘ఆంధ్రా పోరీ’ మరాఠీలో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న ‘టైమ్ పాస్’కి రీమేక్. దర్శకుడు అద్భుతంగా తెరకెక్కించాడు. ఆకాశ్, ఉల్కా బాగా నటించారు. ఇలాంటి చిత్రాలను ఆదరిస్తే భవిష్యత్తులో మంచి చిత్రాలొస్తాయి’’ అని రమేశ్ ప్రసాద్ అన్నారు. పూరి జగన్నాథ్ తనయుడు ఆకాశ్, ఉల్కా గుప్తా జంటగా ప్రసాద్ ప్రొడక్షన్ పతాకంపై రాజ్ మాదిరాజు దర్శకత్వంలో రమేశ్ ప్రసాద్ నిర్మించిన చిత్రం ‘ఆంధ్రా పోరి’. మే 15న ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. ‘‘ఇదొక అందమైన టీనేజ్ లవ్‌స్టోరీ’’ అని దర్శకుడు పేర్కొన్నారు. ఆకాశ్ పూరి మాట్లాడుతూ -‘‘నువ్వీ సినిమా చేయకపోతే ఆర్టిస్టువి కాదని నాన్నగారు అన్నారు. అందుకే చేశా. ఈ చిత్రం కోసం తెలంగాణ యాస నేర్చుకున్నా’’ అన్నారు. జోస్యభట్ల, చంద్రకిరణ్, రాజీవ్ నాయర్, శ్రీకాంత్ తదితరులు మాట్లాడారు. -
కాలక్షేపానికి... come to me
వీలైతే నాలుగు మాటలు... కుదిరితే కప్పు కాఫీ... అంతకుమించి యూత్ పెద్దగా కోరుకునేదేముంది? అయితే సిటీలో హ్యాంగవుట్ స్పాట్స్ రూపకర్తలు అంతకుమించే ఆఫర్ చేస్తున్నారు. వీటి వెల్లువ పుణ్యమా అని.. యువ గుసగుసల వేదికలు అంతకంతకూ కొత్త సొబగులు అద్దుకుంటున్నాయి. సిటీ యూత్ హృదయాలను దోచుకుంటున్న హ్యాంగవుట్ ట్రెండ్స్ ముచ్చట్లు... ..:: ఎస్.సత్యబాబు ఇరానీ క్యాంటీన్ల నుంచి ఇంటర్నేషనల్ కెఫెల దాకా సిటీ యూత్ సరదాలకు, ముచ్చట్లకు కేరాఫ్‌గా నిలుస్తున్నాయి. కావేవీ ఎంజాయ్‌మెంట్‌కు అనర్హం అన్నట్టుగా.. ఎందెందు వెతికినా అందందు కాలక్షేపం దొరుకుతోంది. రోజురోజుకూ యువత ఆకాంక్షలు మారుతూండడంతో ముచ్చట్ల వేదికలు కూడా విభిన్న రకాలుగా ముస్తాబవుతున్నాయి. కాలేజ్ కుర్రకారు దగ్గర్నుంచి కార్పొరేట్ ఉద్యోగుల దాకా పలు రంగాల్లోని యువతను ‘కాలక్షేపానికి కమ్ టు మి’ అంటున్నాయి. హైఫై టు వైఫై.. పేలే జోకులు.. ఫెల్లున నవ్వులు.. ఛెల్లున హైఫైలు.. అంతలోనే వైఫైలోకి పయనాలు.. క్షణానికో రకంగా మారిపోయే యూత్ మూడ్స్‌కి అనుగుణమైన వాతావరణమే హ్యాంగవుట్ ప్లేస్‌కు ప్రధాన వనరు. ఆకర్షణీయమైన యాంబియన్స్కు ప్రథమ స్థానం ఇస్తున్న యువతీయువకులు ఫుడ్‌కి సెకండ్ప్లేస్, మ్యూజిక్‌కి థర్డ్‌ప్లేస్ ఇస్తున్నారు. ఈ మూడు అంశాల్లో సంతృప్తి చెందాక... అదనంగా అందేవాటిని పరిశీలిస్తున్నారు. యూత్ అభిరుచులను దృష్టిలో ఉంచుకుని యాంబియన్స్, ఫుడ్, మ్యూజిక్‌లను అద్భుతంగా మలుస్తున్న హ్యాంగవుట్స్ రూపకర్తలు అంతకుమించి అందిస్తున్న ఆకర్షణల్లో ఉచిత వైఫై ఫెసిలిటీ ప్రధానమైంది. నలుగురూ కలసి ముఖాముఖి ముచ్చటించుకోవడానికి మాత్రమే కాదు.. చాటింగ్‌లూ, వాట్సప్‌లూ, షేరింగ్లతో ఒంటరిగా గడపడానికి కూడా వైఫై అత్యవసరంగా మారింది. ఉచితంగా ఈ-సేవను అందిస్తున్న హ్యాంగవుట్ ప్లేసెస్‌కు డిమాండ్ పెరుగుతోంది. అలాగే రెగ్యులర్‌గా వచ్చే కస్టమర్స్‌కి డిస్కౌంట్స్ కనీసం 15 శాతం నుంచి ఆపైన అందిస్తున్నారు. గ్రూప్స్ సంఖ్యను బట్టి కూడా ఈ ఆఫర్స్‌ను మరింత ఆకర్షణీయంగా మలుస్తున్నారు. తరచుగా యాంబియన్స్‌లో మార్పు చేర్పులు చేయడమే కాదు, వీటి విశేషాలను ఆన్లైన్ ద్వారా యూత్‌కి ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తున్నారు. వెల్కమ్ డ్రింక్స్‌ను ఫ్రీగా ఇచ్చే ప్లేస్‌లూ ఉన్నాయి. యూత్ చాయిస్‌లు... యూత్‌ని ఎట్రాక్ట్ చేయడంలో కాఫీడేలు, బరిస్తా, మెక్‌డొనాల్డ్స్, కేఎఫ్‌సీ.. ఆల్‌టైమ్ పాపులర్. బంజారాహిల్స్‌లోని జీవీకే మాల్లో ఉన్న హార్డ్ రాక్ కెఫె... ఇప్పుడు సిటీ కుర్రాళ్లకు హార్ట్‌బీట్. అలాగే జూబ్లీహిల్స్‌లోని రోడ్ నంబర్ 45లో హార్ట్ కప్ కెఫె.. మ్యూజిక్, ఫుడ్‌తో ఎప్పుడూ యువ సందోహంతో నిండి ఉంటుంది. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 2లో క్రీమ్ స్టోన్ ఐస్‌క్రీమ్ పార్లర్.. సమయం సందర్భం లేకుండా పార్టీలు, విందు వినోదాలతో సందడిగా కనిపిస్తుంటుంది. ‘క్రీమ్ స్టోన్లో బర్త్‌డే సెలబ్రేషన్స్ కూడా జరుగుతుండడం ఈ ప్లేస్‌కి ఉన్న క్రేజ్‌కు నిదర్శనం’ అంటారు ఫుడీ సంకల్ప్. మాదాపూర్‌లో లేటెస్ట్గా ప్రారంభమైన సిగుస్తా, జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 92లో జస్ట్ లాంచ్ అయిన స్టార్ బక్స్ లకూ యూత్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. త్వరలోనే మరో ఐదు రెస్టారెంట్స్ ఓపెన్ కానున్నాయి. హ్యాపీ హ్యాంగవుట్స్ ప్రస్తుతం యువాదరణ పొందుతున్న ఖరీదైన ముచ్చట్ల వేదికల గురించి చెప్పాలంటే.. కేబీఆర్ పార్క్ రోడ్లో ఉన్న క్రేవ్ ఒకటి. సుందర ఉద్యానవనం సమీపంలో ఉండే ఈ హ్యాంగవుట్ ప్లేస్‌కు వైట్ ఇంటీరియర్స్ స్పెషల్ ఎట్రాక్షన్. అలాగే లేట్‌నైట్ చిల్ అవుట్‌కి పేరొందిన బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12 లోని వ్యూ లాంజ్‌లో వెరైటీ మాక్టైల్స్ యువత చవులూరిస్తాయి. హైటెక్ సిటీలోని చార్కోల్ యూత్ మెచ్చే బార్బెక్యూ ఫుడ్‌కి కేరాఫ్. కార్పొరేట్ ఉద్యోగులు పని అనంతరం సేదతీరేందుకు ఎంచుకునే ప్లేస్ ఇది. వింటర్ సీజన్లో చలిమంట (బోన్ ఫైర్) సెటప్‌తో సహా యువతను ఉర్రూతలూగించే ఆకర్షణలతో.. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 14లోని ది బ్యాక్ యార్డ్ ఆకట్టుకుంటుంది. చుట్టూ పచ్చదనం, లాంతర్ల అమరికతో... వెరైటీ లుక్ దీని స్పెషాలిటీ. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 36లోని ది లాస్ట్ సొసైటీ సౌకర్యవంతమైన సిట్టింగ్‌కు, లైటింగ్‌కు చిరునామా. ఎత్తయిన భవనాల మధ్య ఠీవిగా నిలిచి ఆహ్వానిస్తుంది. వరండా దీనిలో ప్రత్యేక ఆకర్షణ. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 37లో విలాసవంతంగా, ఖరీదుగా కనిపించే ఎయిర్లాంజ్ మరో బెస్ట్ ప్లేస్. లెక్కలేనన్ని పాస్తాలకు ఒక్కచోటే అంటూ లొట్టలేస్తారు యూత్. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 36లోనే ఉన్న ‘ది పాస్టా బార్ వెనెటొ’ కూడా ఫేవరేట్ స్పాట్‌గా మారింది. ఇలా రకరకాల హ్యాంగవుట్ హబ్‌లు నగర యువతను సేదతీరుస్తున్నాయి. -
ఐ సెట్
వీలైతే ఫేస్బుక్.. కుదిరితే వాట్సప్.. ఇలా ఇంటర్నెట్ ముందు టైంపాస్ చేసే యూతే ఇప్పుడు ఎక్కువ. అలాంటి చాటింగ్లకు, కబుర్లకు గుడ్‌బై చెప్పి..చదువుకుంటూనే నాలెడ్జ్ పెంచుకునే పనిలో పడ్డారు వీళ్లు. ఉద్యోగపర్వంలో ఎదురయ్యే సమస్యలను ముందే తెలుసుకుని అధిగమిస్తూ, టీమ్ లీడర్‌గా ప్రాజెక్టులను హ్యాండిల్ చేసే అనుభవాన్ని సొంతం చేసుకుంటున్నారు. వారికి బాసటగా నిలుస్తోంది ‘ఐసెక్’ (ఏఐఈఎస్ఈసీ). ..:: వాంకె శ్రీనివాస్ ఐసెక్ వెనుక ఆరున్నర దశాబ్దాల చరిత్ర ఉంది. 1948లో ఏడుగురు యువకులతో నార్వేలో ఇది ప్రారంభమైంది. నేడు 124 దేశాలలో తన కార్యాలయాలను నడుపుతోంది. వీటిలో లక్షకు పైగా విద్యార్థులు వలంటీర్లుగా ఉన్నారు. 1990లో సిటీకి చెందిన ఏడుగురు యువకులు ఏఐఈఎస్ఈసీ హైదరాబాద్‌ను స్టార్ట్ చేశారు. ట్వంటీఫోర్ బై సెవన్ లీడర్షిప్ ఫ్యాక్టరీ పేరుతో విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలను వెలికితీసేందుకు కృషి చేస్తోంది ఐసెక్. 89 మంది విద్యార్థులతో ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్ని మొదలెట్టిన ఐసెక్ నేడు వందలాది మందికి సహకారాన్నందిస్తోంది. ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్ అంటే... ఇక్కడి యువతను ఇతర దేశాలకు ఇంటర్న్‌షిప్ కోసం పంపడమే కాదు, ఇతర దేశాల నుంచి వచ్చిన యువతకు మన దేశంలో ఇంటర్న్‌షిప్ చేసే అవకాశం కల్పిస్తోంది ఐసెక్. అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు ఇతర దేశాల్లో కమ్యూనిటీ డెవలప్మెంట్ ఇంటర్న్‌షిప్ చాన్స్ ఇప్పిస్తుంది. గ్రాడ్యుయేట్ విద్యార్థులకు వారి కమ్యూనికేషన్ స్కిల్స్‌ను బట్టి విదేశాల్లో ఏడాది పాటు ఏదైనా కంపెనీలో ఉద్యోగం ఇప్పించగలుగుతుంది. ఈ పనంతా హైదరాబాద్‌లో వలంటీర్లుగా పనిచేసే విద్యార్థులే చేస్తారు. కమ్యూనిటీ డెవలప్మెంట్, ఉద్యోగాల కల్పన, మార్కెటింగ్ అండ్ పీఆర్, టాలెంట్ మేనేజర్ అండ్ ఫినాన్స్.. ఇలా నాలుగు టీమ్‌లుగా యువత పనిచేస్తోంది. వీరికి లోకల్ కమిటీ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ గెడైన్స్ ఇస్తుంటారు. ఇతర దేశాల నుంచి ఇంటర్న్‌షిప్ కోసం ఇక్కడికి వచ్చిన వారికి తమ కార్యాలయాల్లోనే బస కల్పిస్తారు. మొదట వారు పనిచేసే సంస్థకు తీసుకెళ్లి పరిచయం చేస్తారు. రూట్‌మ్యాప్ డెరైక్షన్ ఇస్తారు. ఏ సమస్య వచ్చినా దగ్గరుండి పరిష్కరిస్తారు. విదేశీ విద్యార్థులకు ఆత్మీయ ఆతిథ్యాన్నిస్తారు. జాలీగా ట్రిప్పు వెళ్లాలనుకున్నవారిని తీసుకెళ్లి చూపిస్తారు. పరిణితి ఇలా... పీస్ అండ్ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ హ్యూమన్కైండ్స్ పొటెన్షియల్ థీమ్‌తో పనిచేస్తున్న ఈ సంస్థ. చదువు పూర్తయి ఉద్యోగాల్లో చేరేలోపే విద్యార్థుల్లో కంపెనీలో పనిచేసిన అనుభవం, టీమ్ లీడర్‌గా ఎదురయ్యే సవాళ్లు, వాటిని పరిష్కరించుకొని ముందుకెళ్లే తీరు ప్రాక్టికల్‌గా అర్థమయ్యేలా చేస్తోంది. విద్యార్థుల్లో సామాజిక బాధ్యతను పెంచేందుకు 2004 నుంచి ఐసెక్ పలు సేవ కార్యక్రమాలూ నిర్వహిస్తోంది. 2004 నుంచి ‘బాల కళాకార్’ కార్యక్రమంతో ఎంతోమంది పేద చైల్డ్ ఆర్టిస్టులను వెలుగులోకి తీసుకొచ్చామంటున్నారు లోకల్ కమిటీ ప్రెసిడెంట్ కౌశిక్. మహిళా సాధికారత కోసం ‘అధికార్’, పర్యావరణ పరిరక్షణ కోసం ‘కన్సర్వ్’, జంతువులను కాపాడేందుకు ‘అనిమిలియా’ వంటి కార్యక్రమాలతో వలంటీర్లలో సేవాభావం పెరిగిందన్నారు. ఏటా నిర్వహించే రీజనల్ యూత్ లీడర్ కాన్ఫరెన్స్, నేషనల్ స్ట్రాట జిక్ కాన్ఫరెన్స్, ఆన్యువల్ లీడర్షిప్ కాన్ఫరెన్స్ విద్యార్థులకు ఉపయోగపడుతున్నాయన్నారు. నమ్మకం కలిగింది.. ‘ఫ్రెండ్ ప్రెజర్‌తో ఇంటర్వ్యూకు హాజరయ్యా. మెంబర్ స్థాయి నుంచి టీమ్ లీడర్‌గా ఎదిగా. కొత్తవాళ్లతో గలగల మాట్లాడటం అలవాటైంది. రిక్రూట్మెంట్లో ఫైనాన్స్ బాధ్యతలు చూసుకుంటున్నా. ఇది నాకు ప్రాక్టికల్లా ఉపయోగడింద’ని అని చెబుతోంది సీఏ విద్యార్థిని శ్రీకరి కొండూరి. ‘ఐసెక్‌లో చేరాక కమ్యూనికేషన్ స్కిల్స్, నాయకత్వ లక్షణాలు పెరిగాయి. ఓ ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఎలా ఉండాలో క్లారిటీ వచ్చింది’ అని అంటోంది వర్ధమాన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ స్టూడెంట్ నవ్య. ‘2014 ఆగస్టులో ఇంటర్వ్యూకి హాజరై మెంబర్‌ను అయ్యా. కమ్యూనిటీ డెవలప్మెంట్ ఇంటర్న్‌షిప్ గురించి మన సిటీకి వచ్చే విదేశీ ప్రతినిధులతో పనిచేస్తున్నా. ఓటమిపాలైనా ఒత్తిడిలో సైతం మళ్లీ లక్ష్యాన్ని చేరుకోగలనన్న నమ్మకం ఏర్పడింది’ అని అంటున్నాడు జేఎన్టీయూలో చదువుతున్న ప్రతీక్. వలంటీర్‌గా చేరాలంటే... ఐసెక్ తమ వలంటీర్లను పెంచుకోవడానికి శని, ఆదివారాల్లో సోమాజిగూడలోని రూట్స్ బిజినెస్ స్కూల్లో రిక్రూట్మెంట్ నిర్వహిస్తోంది. 18 నుంచి 22 ఏళ్లున్న వారు అర్హులు. వివరాలకు ఫోన్: 7893375916, 9642707942.