సెల్‌ఫోన్లను ఎక్కువగా వాడేది అమ్మాయిలే! | study reveaks Girl students spend more time on mobile phones than boys | Sakshi
Sakshi News home page

సెల్‌ఫోన్లను ఎక్కువగా వాడేది అమ్మాయిలే!

Published Tue, Sep 22 2015 9:54 AM | Last Updated on Sun, Sep 3 2017 9:47 AM

సెల్‌ఫోన్లను ఎక్కువగా వాడేది అమ్మాయిలే!

సెల్‌ఫోన్లను ఎక్కువగా వాడేది అమ్మాయిలే!

న్యూయార్క్: కళాశాలల్లో చదువుకునే అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిలే ఎక్కువగా సెల్‌ఫోన్‌తో కాలక్షేపం చేస్తున్నారని తాజా అధ్యయనంలో వెల్లడైంది. రోజుకు సగటున అమ్మాయిలు 10 గంటల పాటు ఫోన్ వాడితే...అబ్బాయిలు 8 గంటలు ఉపయోగిస్తున్నారట. అమెరికాకు చెందిన బేలర్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తల పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది.

దాదాపు 60 శాతం విద్యార్థులు తాము సెల్‌ఫోన్లకు బానిసలయినట్లు సర్వేలో పేర్కొన్నారు. సెల్‌ఫోన్లను ఎక్కువగా వాడటం వల్ల చదువుపై ప్రతికూల ప్రభావం చూపుతుందని ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన జేమ్స్ రాబర్ట్స్ తెలిపారు. అబ్బాయిలు ఎక్కువగా వినోదం కోసం సెల్‌ఫోన్‌లు వాడుతున్నారని, అమ్మాయిలు సామాజిక విషయాల కోసం ఉపయోగిస్తున్నారని రాబర్ట్ తెలిపారు. రాబర్ట్ బృందం ఆన్‌లైన్ ద్వారా కళాశాల విద్యార్థులపై ఈ సర్వే నిర్వహించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement