అలాగైతే నువ్వు ఆర్టిస్ట్‌వి కాదన్నారు నాన్న : ఆకాశ్ పూరి | 'Andhra Pori' perfect film for my age: Akash Puri | Sakshi
Sakshi News home page

అలాగైతే నువ్వు ఆర్టిస్ట్‌వి కాదన్నారు నాన్న : ఆకాశ్ పూరి

Published Thu, Apr 2 2015 10:48 PM | Last Updated on Sat, Sep 2 2017 11:45 PM

అలాగైతే నువ్వు ఆర్టిస్ట్‌వి కాదన్నారు నాన్న : ఆకాశ్ పూరి

అలాగైతే నువ్వు ఆర్టిస్ట్‌వి కాదన్నారు నాన్న : ఆకాశ్ పూరి

  ‘‘మరాఠీ చిత్రాల ఆధారంగా గతంలో తెలుగులో చాలా సినిమాలు రూపొందాయి. మా సంస్థ నుంచి వచ్చిన ‘వదినగారి గాజులు’ కూడా ఓ మరాఠీ చిత్రం ఆధారంగా చేసినదే. ఇప్పుడీ ‘ఆంధ్రా పోరీ’ మరాఠీలో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న ‘టైమ్ పాస్’కి రీమేక్. దర్శకుడు అద్భుతంగా తెరకెక్కించాడు. ఆకాశ్, ఉల్కా బాగా నటించారు. ఇలాంటి చిత్రాలను ఆదరిస్తే భవిష్యత్తులో మంచి చిత్రాలొస్తాయి’’ అని రమేశ్ ప్రసాద్ అన్నారు. పూరి జగన్నాథ్ తనయుడు ఆకాశ్, ఉల్కా గుప్తా జంటగా ప్రసాద్ ప్రొడక్షన్ పతాకంపై రాజ్ మాదిరాజు దర్శకత్వంలో రమేశ్ ప్రసాద్ నిర్మించిన చిత్రం ‘ఆంధ్రా పోరి’. మే 15న ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. ‘‘ఇదొక అందమైన టీనేజ్ లవ్‌స్టోరీ’’ అని దర్శకుడు పేర్కొన్నారు. ఆకాశ్ పూరి మాట్లాడుతూ -‘‘నువ్వీ సినిమా చేయకపోతే ఆర్టిస్టువి కాదని నాన్నగారు అన్నారు. అందుకే చేశా. ఈ చిత్రం కోసం తెలంగాణ యాస నేర్చుకున్నా’’ అన్నారు. జోస్యభట్ల, చంద్రకిరణ్, రాజీవ్ నాయర్, శ్రీకాంత్ తదితరులు మాట్లాడారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement