
లక్ష్మణ మూర్తి రతన, భ్రమరాంబిక తూటిక లీడ్ రోల్స్‌లో నటించిన చిత్రం ‘సీతారం సిత్రాలు’. డి. నాగ శశిధర్ రెడ్డి దర్శకత్వంలో పి. పార్థసారథి, డి. నాగేంద్ర రెడ్డి, కృష్ణ చంద్ర విజయబట్టు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 30న రిలీజ్ కానుంది. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు అతిథిగా హాజరైన హీరో ఆకాశ్ జగన్నాథ్ మాట్లాడుతూ– ‘‘ప్రతి ఇండస్ట్రీ మన తెలుగు ప్రేక్షకుల వైపే చూస్తోంది. సినిమా బాగుంటే పెద్ద విజయాన్ని అందిస్తారు. ‘సీతారం సిత్రాలు’ని ప్రేక్షకులు సక్సెస్ చేయాలని కోరుకుంటున్నా’’ అన్నారు.
‘‘గుడికి వెళితే ఎంత ప్రశాంతత లభిస్తుందో, ఈ సినిమా చూస్తే ప్రేక్షకులకు అంతే ప్రశాంతత లభిస్తుంది’’ అని తెలిపా లక్ష్మణ మూర్తి. ‘‘జంధ్యాల, ఈవీవీ సత్యనారాయణ, రేలంగిగార్ల సినిమాల్లా మా ‘సీతారం సిత్రాలు’ ప్రేక్షకులకు మంచి స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది’’ అన్నారు నాగ శశిధర్ రెడ్డి. ‘‘మా చిన్న సినిమాను ప్రేక్షకులు ఆదరించి, పెద్ద సక్సెస్ చేయాలి’’ అని పేర్కొన్నారు నిర్మాతలు.
Comments
Please login to add a commentAdd a comment