రెండేళ్ల నుంచి ఖాళీగా ఏం లేను: ఆకాశ్‌ | Akash Jagannadh About His Next Movie Update | Sakshi
Sakshi News home page

Akash Jagannadh: ఎక్కువ కన్‌ఫ్యూజ్‌ అయ్యేవాడిని... ఈసారి ఫిక్సయిపోయా..

Published Mon, Aug 19 2024 7:41 AM | Last Updated on Mon, Aug 19 2024 9:13 AM

Akash Jagannadh About His Next Movie Update

తండ్రీకొడుకులకు టైం బాగోలేనట్లుంది.. అటు పూరీ జగన్నాథ్‌ లైగర్‌, డబుల్‌ ఇస్మార్ట్‌తో వరుస పరాజయలు అందుకోగా మరోవైపు ఆకాశ్‌ పూరీ రెండేళ్లక్రితం చోర్‌ బజార్‌తో ఫ్లాప్‌ అందుకున్నాడు. అప్పటినుంచి మళ్లీ వెండితెరపై కనిపించనేలేదు. తాజాగా సోషల్‌ మీడియాలో తన కొత్త సినిమా అప్‌డేట్‌ ఇచ్చాడు.

ఒకటే ప్రశ్న..
నేను ఈ వీడియో పెట్టడానికి ప్రధాన కారణం... ఏం సినిమా చేస్తున్నావ్‌? అంటూ చాలారోజుల నుంచి అందరూ అడుగుతూ ఉన్నారు. సినిమా ప్రకటించి రెండేళ్లయిపోయింది.. చాలాకాలంగా ఖాళీగా ఎందుకుంటున్నావ్‌? అని అడుగుతున్నారు. ఖాళీగా ఏం లేను.. జాగ్రత్తగా ఉంటున్నానంతే!

ఈసారి గట్టిగా..
ఎన్నో కథలు విన్నాను. నాకు మంచి ప్రొడక్షన్‌ హౌస్‌ దొరికింది. మంచి దర్శకుడు, నిర్మాతలు దొరికారు. చాలా కథలు వింటూ ఉన్నప్పుడు కన్‌ఫ్యూజ్‌ అయిపోతూ ఉండేవాడిని. దేవుడి దయ వల్ల, నేను నమ్మిన అమ్మవారి దయ వల్ల నాకంటూ మంచి టీమ్‌ దొరికింది. ఈసారి గట్టిగా కొట్టాలని ఫిక్సయి ఓ సినిమా ఫైనల్‌ చేశాను. సోమవారం (ఆగస్టు 19న) నా కొత్త సినిమా అప్‌డేట్‌ రాబోతోంది. మీ అందరూ నాకు తోడుగా ఉండాలి అని వీడియోలో చెప్పుకొచ్చాడు.

 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement