‘మెర్సి కిల్లింగ్’ కాన్సెప్ట్‌ బాగుంది: ఆకాష్‌ పూరి | Mercy Killing Motion Poster Released By Akash Puri | Sakshi
Sakshi News home page

‘మెర్సి కిల్లింగ్’ కాన్సెప్ట్‌ బాగుంది: ఆకాష్‌ పూరి

Published Tue, Mar 19 2024 8:17 PM | Last Updated on Tue, Mar 19 2024 8:27 PM

Mercy Killing Motion Poster Released By Akash Puri - Sakshi

సాయి కుమార్, పార్వతీశం, ఐశ్వర్య, హారిక ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘మెర్సి కిల్లింగ్‌’. సాయి సిద్ధార్ద్ మూవీ మేకర్స్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెంబర్ 1గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సూరపల్లి వెంకటరమణ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ ను యువ హీరో ఆకాష్ పూరి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆకాష్‌ మాట్లాడు..‘మెర్సి కిల్లింగ్ టైటిల్ చాలా ఆసక్తికరంగా ఉంది.

మొషన్ పోస్టర్ లో కాన్సెప్ట్ బాగుంది. ఇలాంటి కాన్సెప్ట్ తో వస్తోన్న సినిమాలు తప్పకుండా విజయం సాధించాలని కోరుకుంటున్నాను. మంచి ప్రొడక్షన్ వాల్యూస్ తో రాబోతున్న ఈ చిత్రం హైదరాబాద్, కాకినాడ, ఉప్పాడ, అరకు వంటి అందమైన లొకేషన్స్ లో చిత్రీకరించడం జరిగింది. ఏప్రిల్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ మూవీ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను’ అన్నారు.భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ఆధారంగా తెరకెక్కిన చిత్రం మెర్సీ కిల్లింగ్ . స్వేచ్ఛ అనే అనాధ బాలిక తనకు న్యాయం జరగాలంటూ ఈ కథ ప్రారంభం అవుతుందని దర్శకుడు వెంకటరమణ ఎస్ తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement