Mercy Killing
-
5 నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా
ప్రస్తుతం 'దేవర' హవా నడుస్తోంది. థియేటర్లలో ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. మరోవైపు ఓటీటీలోనూ 20కి సినిమాలు/వెబ్ సిరీసులు పలు ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఇదలా ఉండగానే మరో చిన్న సినిమా ఎలాంటి హడావుడి లేకుండా ఓటీటీలోకి వచ్చేసింది. కారుణ్య మరణం అనే కాన్సెప్ట్‌తో తీసిన ఈ సినిమా సంగతేంటి? ఏ ఓటీటీలో ఉంది?(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీలోకి వచ్చేసిన 20 సినిమాలు)'కేరింత' ఫేమ్ పార్వతీశం, 'జబర్దస్త్' నటి ఐశ్వర్య హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా 'మెర్సీ కిల్లింగ్'. ఏప్రిల్‌లో థియేటర్లలోకి వచ్చింది. పెద్దగా పేరున్న నటీనటులు లేకపోవడం, బడ్జెట్ పరిమితుల వల్ల జనాలకు సరిగా రీచ్ కాలేదు. ఇప్పుడీ చిత్రాన్ని ఆహా ఓటీటీలోకి ఎలాంటి హడావుడి లేకుండా తీసుకొచ్చేశారు.'మెర్సీ కిల్లింగ్' విషయానికొస్తే.. స్వేచ్ఛ (హారిక) అనాథ అమ్మాయి. తల్లిదండ్రులు ఎవరనేది తెలియక, చిన్నప్పటి నుంచి అవమానాలను ఎదుర్కొంటుంది. పెద్దయ్యాక తన పెరెంట్స్ ఎవరనేది కనుక్కునేందుకు ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలో ఆమెకు మహేశ్(పార్వతీశం), భారతి (ఐశ్వర్య) పరిచయమవుతారు. వీళ్లు స్వేచ్ఛకు ఎలాంటి సహాయం చేశారు? స్వేచ్ఛకు రామకృష్ణం రాజు(సాయి కుమార్)కు సంబంధమేంటి? చివరకు తల్లిదండ్రులని స్వేచ్ఛ కలిసిందా అనేదే స్టోరీ.(ఇదీ చదవండి: 'దేవర' పార్ట్ 2లో స్టోరీ ఏం ఉండొచ్చు?)Uncover the truth! Watch the heart-wrenching tale of a fisherman's family, fighting for justice.▶️https://t.co/JDJ5cDG3Mj#MercyKilling #Justice #LoveStory pic.twitter.com/HJdMT2i3wp— ahavideoin (@ahavideoIN) September 28, 2024 -
మెర్సీ కిల్లింగ్ మూవీ రివ్యూ
టైటిల్: మెర్సీ కిల్లింగ్ నటీనటులు: సాయి కుమార్, పార్వతీశం, ఐశ్వర్య, బేబీ హారిక, రామరాజు, సూర్య, ఆనంద్ చక్రపాణి, ఘర్షణ శ్రీనివాస్, షేకింగ్ శేషు, ఎఫ్.ఎం.బాబాయ్, రంగస్థలం లక్ష్మీ, ల్యాబ్ శరత్, హేమ సుందర్, వీరభద్రం, ప్రమీల రాణి తదితరులు. నిర్మాణ సంస్థ: సాయి సిద్ధార్ద్ మూవీ మేకర్స్ నిర్మాతలు: సిద్ధార్థ్ హరియల, మాధవి తాలబత్తుల దర్శకత్వం: వెంకటరమణ ఎస్ సినిమాటోగ్రఫీ: అమర్.జి సంగీతం: ఎం.ఎల్.రాజ ఎడిటర్: కపిల్ బల్ల విడుదల తేది: ఏప్రిల్ 12, 2024 కథేంటంటే.. స్వేచ్ఛ (హారిక) ఓ అనాథ అమ్మాయి. తన తల్లిదండ్రులు ఎవరనేది తెలియక.. చిన్నప్పటి నుంచి ఎన్నో అవమానాలను ఎదుర్కొంటుంది. పెద్దయ్యాక.. తన పెరెంట్స్ ఎవరనేది కనుక్కునేందుకు ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలో ఆమె మహేశ్(పార్వతీశం) భారతి (ఐశ్వర్య)లను కలుసుకుంటుంది. వాళ్లు స్వేచ్ఛకు ఎలాంటి సహాయం అదించారు? పెరెంట్స్ కోసం వెతుకున్న స్వేచ్ఛకు రామకృష్ణమ్ రాజు(సాయి కుమార్) ఎలా పరిచయం అయ్యాడు? ఆయన నేపథ్యం ఏంటి? రామకృష్ణమ్ రాజు, స్వేచ్ఛకు మధ్య ఉన్న సంబంధం ఏంటి? చివరకు స్వేచ్ఛ తన పేరెంట్స్‌ని కలిసిందా లేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎవరెలా చేశారంటే.. పలు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన హారిక ఈ సినిమాలో స్వేచ్ఛ పాత్రలో ఒడిగిపోయింది. అలాగే ఐశ్వర్య కొన్ని ఎపిసోడ్స్ లో స్టన్నింగ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. సాయి కుమార్ కు ఈ సినిమా మరో ప్రస్థానం అని చెప్పవచ్చు. తన పాత్రలో అద్భుతంగా నటించాడు. బసవరాజు పాత్రలో రామరాజు బాగా నటించాడు, అలాగే జడ్జి పాత్రలో సూర్య తన పాత్ర పరిధి మేరకు నటించి మెప్పించాడు. ఎలా ఉందంటే.. సమాజంలో జరిగే కొన్ని సంఘటనల ఆధారంగా తీసుకొని ఈ కథను తెరకెక్కించాడు దర్శకుడు వెంకటరమణ ఎస్. ఇలాంటి సబ్జెక్ట్స్‌ని డీల్ చేయడం కొందరికే సాధ్యం. ఆ విషయంలో దర్శకుడు వెంకటరమరణ కొంతమేర సఫలం అయ్యాడు. గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో ఆసక్తికరంగా కథనాన్ని నడిపించాడు. ఫస్టాఫ్ కొంతమేర సాగదీతగా అనిపించినా.. ఇంటర్వెల్ సీన్ సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. ద్వితియార్థంలో కథనం వేగంగా సాగుతుంది. క్లైమాక్స్ ఎమోషనల్‌గా ఉంటుంది. జి.అమర్ సినిమాటోగ్రఫీ బాగుంది. లొకేషన్స్, సాంగ్స్, కాకినాడ లోని ఉప్పడా బీచ్, ఫిషింగ్ హార్బర్ ఇలా అన్ని లొకేషన్స్ ను తెరమీద అద్భుతంగా సహజంగా చూపించారు. ఎం.ఎల్.రాజా సంగీతం బాగుంది. సిద్ధార్థ్ హరియల, మాధవి తాలబత్తుల నిర్మాతలు ఖర్చుకు ఎక్కడా రాజీ పడకుండా మెర్సీ కిల్లింగ్ సినిమాను నిర్మించారు. -
ప్రతి మహిళ చూడాలి
సాయి కుమార్, పార్వతీశం, ఐశ్వర్య, హారిక ముఖ్య తారలుగా సూరపల్లి వెంకటరమణ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘మెర్సీ కిల్లింగ్’. వేదుల బాల కామేశ్వరి సమర్పణలో సిద్దార్థ్ హరియల, మాధవి తాలబత్తుల నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 12న రిలీజ్ కానుంది. ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్లో కోన వెంకట్, ఆకాశ్ పూరి అతిథులుగా పాల్గొన్నారు. ‘‘స్వేచ్ఛ అనే అమ్మాయి చుట్టూ తిరిగే ఈ సినిమాలో మంచి పాత్ర చేశాను. మెర్సీ కిల్లింగ్ అంటూ సమాజంలో ఆడవారిపై జరుగుతున్న ఆకృత్యాలను దర్శకుడు కళ్లకు కట్టినట్లు చూపించారు. ప్రతి మహిళ చూడాల్సి సినిమా’’ అన్నారు సాయికుమార్. ‘‘భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ఆధారంగా తెరకెక్కిన చిత్రమిది’’ అన్నారు వెంకటరమణ. -
ప్రతి మహిళ చూడాల్సిన చిత్రం మెర్సి కిల్లింగ్ : సాయి కుమార్
సాయి కుమార్, పార్వతీశం, ఐశ్వర్య, హారిక ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం మెర్సి కిల్లింగ్ . సాయి సిద్ధార్ద్ మూవీ మేకర్స్ బ్యానర్ పై సిద్ధార్ద్ హరియల, మాధవి తాలబత్తుల నిర్మిస్తున్న ఈ సినిమాకు శ్రీమతి వేదుల బాల కామేశ్వరి సమర్పిస్తున్నారు. ఏప్రిల్ 12న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమంలో సాయి కుమార్, కోనా వెంకట్, పూరి ఆకాష్, యాంకర్ రవి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నటుడు సాయి కుమార్ మాట్లాడుతూ...మెర్సీ కిల్లింగ్ అనే సినిమా స్వేచ్ఛ అనే అమ్మాయి చుట్టూ తిరుగుతుంది. స్వేచ్ఛ పాత్రలో హారిక బాగా నటించింది. దర్శకుడు సూరపల్లి వెంకటరమణ చక్కటి కథతో ఈ సినిమాను తెరకెక్కించారు. పార్వతీశం, ఐశ్వర్య పోటీ పడి నటించారు. నేను ఈ సినిమాలో మరో మంచి రోల్ లో ప్రేక్షకుల ముందుకు రావడం సంతోషంగా ఉంది. ప్రతి మహిళ చూడవలసింది సినిమా మెర్సి కిల్లింగ్ అని సమాజంలో ఆడవారిపై జరుగుతున్న అకృత్యాలు ఈ సినిమాలో కళ్ళకు కట్టినట్లు చూపించారని తెలిపారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ఆధారంగా తెరకెక్కిన చిత్రం మెర్సీ కిల్లింగ్ . స్వేచ్ఛ అనే అనాధ బాలిక తనకు న్యాయం జరగాలంటూ ఈ కథ ప్రారంభం అవుతుందని, అందరికి ఈ సినిమా కనెక్ట్ అవుతుందని అందరూ ఆర్టిస్టులు టెక్నీషియన్స్ కష్టపడి పనిచేశారని సినిమా బాగుందని ప్రివ్యూ చూసిన అందరూ అంటుంటే సంతోషంగా ఉందని దర్శకుడు వెంకటరమణ ఎస్ తెలిపారు. -
‘మెర్సి కిల్లింగ్’ కాన్సెప్ట్ బాగుంది: ఆకాష్ పూరి
సాయి కుమార్, పార్వతీశం, ఐశ్వర్య, హారిక ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘మెర్సి కిల్లింగ్’. సాయి సిద్ధార్ద్ మూవీ మేకర్స్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెంబర్ 1గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సూరపల్లి వెంకటరమణ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ ను యువ హీరో ఆకాష్ పూరి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆకాష్ మాట్లాడు..‘మెర్సి కిల్లింగ్ టైటిల్ చాలా ఆసక్తికరంగా ఉంది. మొషన్ పోస్టర్ లో కాన్సెప్ట్ బాగుంది. ఇలాంటి కాన్సెప్ట్ తో వస్తోన్న సినిమాలు తప్పకుండా విజయం సాధించాలని కోరుకుంటున్నాను. మంచి ప్రొడక్షన్ వాల్యూస్ తో రాబోతున్న ఈ చిత్రం హైదరాబాద్, కాకినాడ, ఉప్పాడ, అరకు వంటి అందమైన లొకేషన్స్ లో చిత్రీకరించడం జరిగింది. ఏప్రిల్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ మూవీ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను’ అన్నారు.భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ఆధారంగా తెరకెక్కిన చిత్రం మెర్సీ కిల్లింగ్ . స్వేచ్ఛ అనే అనాధ బాలిక తనకు న్యాయం జరగాలంటూ ఈ కథ ప్రారంభం అవుతుందని దర్శకుడు వెంకటరమణ ఎస్ తెలిపారు.