మెర్సీ కిల్లింగ్ మూవీ రివ్యూ | Mercy Killing Movie Review And Rating In Telugu | Sai Kumar | Parvateesam - Sakshi
Sakshi News home page

Mercy Killing Movie Review: మెర్సీ కిల్లింగ్ మూవీ రివ్యూ

Published Fri, Apr 12 2024 8:50 PM | Last Updated on Sat, Apr 13 2024 10:23 AM

Mercy Killing Movie Review And Rating In Telugu - Sakshi

టైటిల్‌: మెర్సీ కిల్లింగ్ 
నటీనటులు: సాయి కుమార్, పార్వతీశం, ఐశ్వర్య, బేబీ హారిక, రామరాజు, సూర్య, ఆనంద్ చక్రపాణి, ఘర్షణ శ్రీనివాస్, షేకింగ్ శేషు, ఎఫ్.ఎం.బాబాయ్, రంగస్థలం లక్ష్మీ, ల్యాబ్ శరత్, హేమ సుందర్, వీరభద్రం, ప్రమీల రాణి తదితరులు.
నిర్మాణ సంస్థ: సాయి సిద్ధార్ద్ మూవీ మేకర్స్
నిర్మాతలు: సిద్ధార్థ్ హరియల, మాధవి తాలబత్తుల
దర్శకత్వం: వెంకటరమణ ఎస్
సినిమాటోగ్రఫీ: అమర్.జి
సంగీతం: ఎం.ఎల్.రాజ
ఎడిటర్: కపిల్ బల్ల
విడుదల తేది: ఏప్రిల్‌ 12, 2024

కథేంటంటే..
 స్వేచ్ఛ (హారిక) ఓ అనాథ అమ్మాయి. తన తల్లిదండ్రులు ఎవరనేది తెలియక.. చిన్నప్పటి నుంచి ఎన్నో అవమానాలను ఎదుర్కొంటుంది. పెద్దయ్యాక.. తన పెరెంట్స్‌ ఎవరనేది కనుక్కునేందుకు ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలో ఆమె మహేశ్‌(పార్వతీశం) భారతి (ఐశ్వర్య)లను కలుసుకుంటుంది. వాళ్లు స్వేచ్ఛకు ఎలాంటి సహాయం అదించారు? పెరెంట్స్‌ కోసం వెతుకున్న స్వేచ్ఛకు రామకృష్ణమ్‌ రాజు(సాయి కుమార్‌) ఎలా పరిచయం అయ్యాడు? ఆయన నేపథ్యం ఏంటి?  రామకృష్ణమ్‌ రాజు, స్వేచ్ఛకు మధ్య ఉన్న సంబంధం ఏంటి? చివరకు స్వేచ్ఛ తన పేరెంట్స్‌ని కలిసిందా లేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. 

ఎవరెలా చేశారంటే.. 
పలు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన హారిక ఈ సినిమాలో స్వేచ్ఛ పాత్రలో ఒడిగిపోయింది. అలాగే ఐశ్వర్య కొన్ని ఎపిసోడ్స్ లో స్టన్నింగ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. సాయి కుమార్ కు ఈ సినిమా మరో ప్రస్థానం అని చెప్పవచ్చు. తన పాత్రలో అద్భుతంగా నటించాడు. బసవరాజు పాత్రలో రామరాజు బాగా నటించాడు, అలాగే జడ్జి పాత్రలో సూర్య తన పాత్ర పరిధి మేరకు నటించి మెప్పించాడు. 

ఎలా ఉందంటే..
సమాజంలో జరిగే కొన్ని సంఘటనల ఆధారంగా తీసుకొని ఈ కథను తెరకెక్కించాడు దర్శకుడు  వెంకటరమణ ఎస​్‌.  ఇలాంటి సబ్జెక్ట్స్‌ని డీల్‌ చేయడం కొందరికే సాధ్యం. ఆ విషయంలో దర్శకుడు వెంకటరమరణ కొంతమేర సఫలం అయ్యాడు.  గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో ఆసక్తికరంగా కథనాన్ని నడిపించాడు. ఫస్టాఫ్‌ కొంతమేర సాగదీతగా అనిపించినా.. ఇంటర్వెల్‌ సీన్‌ సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. ద్వితియార్థంలో కథనం వేగంగా సాగుతుంది. క్లైమాక్స్‌ ఎమోషనల్‌గా ఉంటుంది. జి.అమర్ సినిమాటోగ్రఫీ బాగుంది. లొకేషన్స్, సాంగ్స్, కాకినాడ లోని ఉప్పడా బీచ్, ఫిషింగ్ హార్బర్ ఇలా అన్ని లొకేషన్స్ ను తెరమీద అద్భుతంగా సహజంగా చూపించారు. ఎం.ఎల్.రాజా సంగీతం బాగుంది. సిద్ధార్థ్ హరియల, మాధవి తాలబత్తుల నిర్మాతలు ఖర్చుకు ఎక్కడా రాజీ పడకుండా మెర్సీ కిల్లింగ్ సినిమాను నిర్మించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement