ప్రతి మహిళ చూడాల్సిన చిత్రం మెర్సి కిల్లింగ్ : సాయి కుమార్ | Sai Kumar Talk About 'Mercy Killing' Movie At Pre Release Event | Sakshi
Sakshi News home page

ప్రతి మహిళ చూడాల్సిన చిత్రం మెర్సి కిల్లింగ్ : సాయి కుమార్

Published Sat, Mar 30 2024 6:15 PM | Last Updated on Sat, Mar 30 2024 6:46 PM

Sai Kumar Talk About Mercy Killing Movie At Prerelease Event - Sakshi

సాయి కుమార్, పార్వతీశం, ఐశ్వర్య, హారిక ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం మెర్సి కిల్లింగ్ . సాయి సిద్ధార్ద్ మూవీ మేకర్స్ బ్యానర్ పై సిద్ధార్ద్ హరియల,  మాధవి తాలబత్తుల నిర్మిస్తున్న ఈ సినిమాకు శ్రీమతి వేదుల బాల కామేశ్వరి సమర్పిస్తున్నారు. ఏప్రిల్ 12న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమంలో సాయి కుమార్, కోనా వెంకట్, పూరి ఆకాష్, యాంకర్ రవి తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నటుడు సాయి కుమార్ మాట్లాడుతూ...మెర్సీ కిల్లింగ్ అనే సినిమా స్వేచ్ఛ అనే అమ్మాయి చుట్టూ తిరుగుతుంది. స్వేచ్ఛ పాత్రలో హారిక బాగా నటించింది. దర్శకుడు సూరపల్లి వెంకటరమణ చక్కటి కథతో ఈ సినిమాను తెరకెక్కించారు. పార్వతీశం, ఐశ్వర్య పోటీ పడి నటించారు. నేను ఈ సినిమాలో మరో మంచి రోల్ లో ప్రేక్షకుల ముందుకు రావడం సంతోషంగా ఉంది. ప్రతి మహిళ చూడవలసింది సినిమా మెర్సి కిల్లింగ్ అని సమాజంలో ఆడవారిపై జరుగుతున్న అకృత్యాలు ఈ సినిమాలో కళ్ళకు కట్టినట్లు చూపించారని తెలిపారు.

భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ఆధారంగా తెరకెక్కిన చిత్రం మెర్సీ కిల్లింగ్ . స్వేచ్ఛ అనే అనాధ బాలిక తనకు న్యాయం జరగాలంటూ ఈ కథ ప్రారంభం అవుతుందని, అందరికి ఈ సినిమా కనెక్ట్ అవుతుందని అందరూ ఆర్టిస్టులు టెక్నీషియన్స్ కష్టపడి పనిచేశారని సినిమా బాగుందని ప్రివ్యూ చూసిన అందరూ అంటుంటే సంతోషంగా ఉందని దర్శకుడు వెంకటరమణ ఎస్ తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement