Parvateesam
-
ఓటీటీలోకి యూత్‌ను మెప్పించిన 'మార్కెట్ మహాలక్ష్మీ' సినిమా
'కేరింత'ఫేమ్ పార్వతీశం హీరోగా నటించిన తాజా చిత్రం మార్కెట్ మహాలక్ష్మీ. వీఎస్ ముఖేశ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఏప్రిల్ 19న థియేటర్లో విడుదలైంది. ఈ చిత్రం ద్వారా ప్రణీకాన్వికా హీరోయిన్గా పరిచయమయింది. బి2పి స్టూడియోస్ ద్వారా అఖిలేష్ కలారు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలో హర్ష వర్ధన్, మహబూబ్ బాషా, ముక్కు అవినాష్ ప్రధాన పాత్రలలో మెప్పించారు. థియేటర్లో మెప్పించిన ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉంది.చిన్న సినిమాగా వచ్చిన మార్కెట్ మహాలక్ష్మీ థియటర్లలో ప్రేక్షకులను మెప్పించింది. హీరోయిన్‌కు మొదటి సినిమానే అయినా కూడా తన నటనతో యూత్‌ను ఆకట్టుకుందని ప్రశంసలు దక్కాయి. ఇప్పుడు ఈ సినిమా తెలుగు ఓటీటీ ఆహాలో జులై 4న స్ట్రీమింగ్ కానుందని ఆ సంస్థ ప్రకటించింది.సాఫ్ట్వేర్ ఉద్యోగి పాత్రలో పార్వతీశం, మార్కెట్లో కూరగాయలు అమ్ముకునే పాత్రలో ప్రణీకాన్వికా తమ నటనతో మెప్పించారు. వీరిద్దరి మధ్య ప్రేమ ఎలా మొదలైంది..? కుమారుడి వల్ల కట్నం వస్తుందని ఆశించిన తండ్రిని ఎలా మెప్పించాడు. తన ప్రేమను గెలిపించుకోవడానికి పార్వతీశం ఎలాంటి స్కెచ్ వేశాడు..? వంటి అంశాలు బాగా కనెక్ట్ అవుతాయి. మహాలక్ష్మి కోసం సాఫ్ట్వేర్ కుర్రాడు తీసుకున్న గొప్ప నిర్ణయం ఏంటి? తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. -
‘మార్కెట్ మహాలక్ష్మి’ మూవీ రివ్యూ
టైటిల్: మార్కెట్ మహాలక్ష్మినటీనటులు: పార్వతీశం, ప్రణీకాన్వికా, హర్ష వర్ధన్, మహబూబ్ బాషా, ముక్కు అవినాష్, కేదార్ శంకర్ తదితరులునిర్మాణ సంస్థ: బి2పి స్టూడియోస్ నిర్మాత: అఖిలేష్ కలారుదర్శకత్వం: వియస్ ముఖేష్సంగీతం: జో ఎన్మవ్ నేపథ్య సంగీతం: సృజన శశాంకసినిమాటోగ్రఫీ: సురేంద్ర చిలుములఎడిటర్: ఆర్.యమ్. విశ్వనాధ్ కూచనపల్లివిడుదల తేది: ఏప్రిల్ 19, 2024‘కేరింత’ మూవీతో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు పార్వతీశం. ఆ సినిమాలో తనదైన సహజ నటనతో ఆకట్టుకున్నాడు. ఇక చాలా రోజుల తర్వాత ఆయన హీరోగా నటించిన చిత్రం ‘మార్కెట్ మహాలక్ష్మి’. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం రేపు(ఏప్రిల్ 19) ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా మీడియా కోసం ప్రివ్యూ ఏర్పాటు చేసింది చిత్రబృందం. మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. కథేంటంటే.. ప్రభుత్వ కార్యాలయంలో గుమాస్తాగా పనిచేసే వ్యక్తి(కేదార్ శంకర్) తన కుమారుడు (పార్వతీశం)ని ఇంజనీరింగ్ చదివిస్తాడు. అతని చదువు పూర్తయ్యాక హైదరాబాద్‌లని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో మంచి ఉద్యోగం లభిస్తోంది. లక్షల్లో జీతం సంపాదించే తన కుమారుడికి కోటి రూపాయలు కట్నంగా ఇచ్చే అమ్మాయితోనే పెళ్లి చేయాలని ప్రయత్నిస్తుంటాడు తండ్రి. అలాంటి సంబంధాలనే తీసుకొస్తాడు. కానీ పార్వతీశం(ఈ సినిమాలో హీరో పాత్రకి పేరు లేదు) మాత్రం అన్నింటిని రిజెక్ట్ చేసి, మార్కెట్లో కూరగాయలు అమ్ముకునే మహాలక్ష్మి అలియాస్ ‘మార్కెట్ మహాలక్ష్మి(ప్రణీకాన్వికా)ని ప్రేమిస్తాడు. ఆమెనే పెళ్లి చేసుకోవాలని భావిస్తాడు.కానీ మహాలక్ష్మి మాత్రం అతని ప్రేమను తిరస్కరిస్తుంది.దీంతో తనను ఒప్పించేందుకు మార్కెట్లోనే తిష్టవేస్తాడు. చివరకు మహాలక్ష్మి పెళ్లికి ఒప్పుకుందా? సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన పార్వతీశం.. కూరగాయలు అమ్ముకునే అమ్మాయినే ఎందుకు ఇష్టపడ్డాడు? మహాలక్ష్మి ఫ్యామిలీ నేపథ్యం ఏంటి? తన సంపాదనతోనే బతకాలని మహాలక్ష్మి ఎందుకు డిసైడ్ అయింది? మహాలక్ష్మి కోసం సాఫ్ట్వేర్ కుర్రాడు తీసుకున్న గొప్ప నిర్ణయం ఏంటి? తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే..?పెళ్లి తర్వాత అమ్మాయి.. అబ్బాయి వాళ్ల ఇంటికే ఎందుకు వెళ్లాలి? అబ్బాయియే అమ్మాయి వాళ్ల ఇంటికి వచ్చి ఎందుకు కాపురం చేయకూడదు? ఉద్యోగ రిత్యా చాలా మంది తమ పెరెంట్స్కి దూరంగా ఉంటున్నారు కదా? మరి అమ్మాయి ఇంటికి వెళ్లి ఉంటే జరిగే నష్టమేంటి? అనే ప్రశ్నకు సమాధానం ఎక్కడ దొరకదు. అది మన సంప్రదాయం అని.. ఫాలో అవ్వడమే తప్ప అలానే ఉండాలని ఎక్కడా రాసి పెట్టిలేదు. ఇదే విషయాన్ని ఈ సినిమా ద్వారా తెలియజేశాడు దర్శకుడు వియస్ ముఖేష్.పెరెంట్స్కి దూరంగా ఉన్నా సరే..వారి బాగోగులను చూసుకునే బాధ్యత మనదనే విషయం గుర్తుంటే చాలు అనే సందేశాన్ని వినోదాత్మకంగా తెలియజేసే ప్రయత్నం చేశాడు. అలాగే ఒక ఆడపిల్ల ఇండిపెండెంట్‌గా ఎందుకు బతకాలో ఈ చిత్రం ద్వారా తెలియజేశాడు. దర్శకుడు ఎంచుకున్న పాయింట్ కొత్తగా, సందేశాత్మకంగా ఉంది కానీ.. ఆ పాయింట్‌ని ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా చెప్పడంలో పూర్తిగా సఫలం కాలేదు. కథలోని ఎమోషన్ని ప్రేక్షకుడు ఫీల్ అయ్యేలా చేయడంలో కొంతవరకు మాత్రమే సక్సెస్ అయ్యారు. హీరో.. హీరోయిన్ని చూసి ప్రేమలో పడే సీన్‌తో పాటు చాలా సన్నివేశాలు సినిమాటిక్‌గా అనిపిస్తాయి. అలాగే ప్రేమను పొందడం కోసం హీరో చేసే పనులు కూడా అంతగా ఆకట్టుకోవు. అక్కడ మరింత కామెడీ పండించే స్కోప్ ఉన్నా.. సరిగా వాడుకోలేదోమో అనిపిస్తుంది. అయితే సెకండాఫ్‌లో మాత్రం దర్శకుడు బలమైన సన్నివేశాలను రాసుకున్నాడు. క్లైమాక్స్‌లో ప్రేక్షకులను ఓ మంచి సందేశాన్ని ఇచ్చాడు. ఓ ఇండిపెండెంట్ అమ్మాయి, సాఫ్ట్వేర్ అబ్బాయి మధ్య సాగే ప్రేమకథే ఇది. కట్నం కోసం కొడుకును ఇంజనీరింగ్ చదివించాలని గుమాస్తాగా పని చేసే తండ్రి ఆలోచించే సీన్‌తో కథ ప్రారంభం అవుతుంది. హీరో ఎంట్రీ సీన్ కూడా అదిరిపోతుంది. ఆ తర్వాత కథనం స్లోగా సాగుతుంది. మార్కెట్లో మహాలక్ష్మిని చూసి ప్రేమలో పడిన తర్వాత వచ్చే కొన్ని సీన్లు వినోదాన్ని అందిస్తాయి. ఇంటర్వెల్ సీన్ బాగుంటుంది. ఇక సెకండాఫ్ కథంతా మార్కెట్ చుట్టే తిరుగుతుంది. మహాలక్ష్మిని ఇంప్రెస్ చేయడం కోసం హీరో చేసే పనులు పాత సినిమాలను గుర్తు చేస్తాయి. అలాగే చాలా వరకు కథనం నెమ్మదిగా, ఊహకందేలా సాగుతుంది. మహాలక్ష్మి ఎందుకు ఇండిపెండెంట్‌గా బతకాలని అనుకోవాడానికి గల కారణం కన్విన్సింగ్‌గా ఉంటుంది. క్లైమాక్స్ బాగుటుంది. ఎవరెలా చేశారంటే.. సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పార్వతీశం చక్కగా నటించాడు. గత సినిమాలతో పోల్చితే నటన పరంగా ఆయన బాగా మెప్పించాడని చెప్పొచ్చు. ఇక మార్కెట్ మహాలక్ష్మిగా ప్రణికాన్విక ఒదిగిపోయింది. ఇది తనకు తొలి చిత్రమే అయినా.. తెరపై ఆ విషయం తెలియకుండా చక్కగా నటించింది. హీరో ప్రెండ్‌గా ముక్కు అవినాష్ కనిపించేంది కాసేపే అయినా నవ్వించే ప్రయత్నం చేశాడు. హీరోయిన్ బ్రదర్, తాగుబోతుగా మహబూబ్ బాషా తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. ‘కోటర్ ఇస్తే చెబుతా’ అంటూ ఆయన పండించిన కామెడీ బాగుంది. కేదార్ శంకర్, జయ, పద్మ, హర్షవర్దన్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాకేంతికంగా సినిమా పర్వాలేదు. సృజన శశాంక భ్యాగ్రౌండ్ స్కోర్, జో ఎన్మవ్ మ్యూజీక్ బాగున్నాయి. సినిమాటోగ్రఫీ పర్వాలేదు. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లుగా ఉన్నాయి. -
ప్రతి మహిళ చూడాల్సిన చిత్రం మెర్సి కిల్లింగ్ : సాయి కుమార్
సాయి కుమార్, పార్వతీశం, ఐశ్వర్య, హారిక ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం మెర్సి కిల్లింగ్ . సాయి సిద్ధార్ద్ మూవీ మేకర్స్ బ్యానర్ పై సిద్ధార్ద్ హరియల, మాధవి తాలబత్తుల నిర్మిస్తున్న ఈ సినిమాకు శ్రీమతి వేదుల బాల కామేశ్వరి సమర్పిస్తున్నారు. ఏప్రిల్ 12న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమంలో సాయి కుమార్, కోనా వెంకట్, పూరి ఆకాష్, యాంకర్ రవి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నటుడు సాయి కుమార్ మాట్లాడుతూ...మెర్సీ కిల్లింగ్ అనే సినిమా స్వేచ్ఛ అనే అమ్మాయి చుట్టూ తిరుగుతుంది. స్వేచ్ఛ పాత్రలో హారిక బాగా నటించింది. దర్శకుడు సూరపల్లి వెంకటరమణ చక్కటి కథతో ఈ సినిమాను తెరకెక్కించారు. పార్వతీశం, ఐశ్వర్య పోటీ పడి నటించారు. నేను ఈ సినిమాలో మరో మంచి రోల్ లో ప్రేక్షకుల ముందుకు రావడం సంతోషంగా ఉంది. ప్రతి మహిళ చూడవలసింది సినిమా మెర్సి కిల్లింగ్ అని సమాజంలో ఆడవారిపై జరుగుతున్న అకృత్యాలు ఈ సినిమాలో కళ్ళకు కట్టినట్లు చూపించారని తెలిపారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ఆధారంగా తెరకెక్కిన చిత్రం మెర్సీ కిల్లింగ్ . స్వేచ్ఛ అనే అనాధ బాలిక తనకు న్యాయం జరగాలంటూ ఈ కథ ప్రారంభం అవుతుందని, అందరికి ఈ సినిమా కనెక్ట్ అవుతుందని అందరూ ఆర్టిస్టులు టెక్నీషియన్స్ కష్టపడి పనిచేశారని సినిమా బాగుందని ప్రివ్యూ చూసిన అందరూ అంటుంటే సంతోషంగా ఉందని దర్శకుడు వెంకటరమణ ఎస్ తెలిపారు. -
'మార్కెట్ మహాలక్ష్మి' మూవీ ట్రైలర్ వేడుక (ఫొటోలు)
-
'కూరగాయలు అమ్మేదాన్ని ఎలా చేశావ్ బ్రో'.. ఆసక్తిగా ట్రైలర్!
కేరింత మూవీ ఫేమ్ పార్వతీశం, హీరోయిన్ ప్రణీకాన్వికా జంటగా నటిస్తోన్న చిత్రం 'మార్కెట్ మహాలక్ష్మి'. వీఎస్ ముఖేష్ దర్శకత్వంలో అఖిలేష్ కలారు ఈ చిత్రాన్ని నిర్మించారు. బీ2పీ స్టూడియోస్ ద్వారా తెరకెక్కిన ఈ చిత్రంలో హర్ష వర్ధన్, మహబూబ్ బాషా, ముక్కు అవినాష్ ప్రధాన పాత్రలు పోషించనున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. హీరో పార్వతీశం మాట్లాడుతూ.. 'ఫ్రాంక్‌గా చెప్పాలంటే.. కేరింత తర్వాత మంచి హిట్ కొట్టలేకపోయాను. వరుస ఫ్లాప్‌లతో చాలా డిప్రెషన్లో ఉన్నా. అప్పుడే మనోడు ముఖేష్ నాకు కథ చెప్పాడు. మొదట్లో దర్శకుడిపై నమ్మకం లేదు. కానీ 4-5 రోజుల షూటింగ్ తర్వాత అతనిపై నాకు నమ్మకం ఏర్పడింది. కేరింత చిత్రానికి ఎంత మంచి పేరు వచ్చిందో అదే విధంగా మార్కెట్ మహాలక్ష్మికి కూడా వస్తుందని నమ్ముతున్నా.' అని అన్నారు. హీరోయిన్ ప్రణీకాన్విక మాట్లాడుతూ..'తెలుగులో ఇది నా మొదటి సినిమా. సోషల్ మీడియాలో వస్తున్న రెస్పాన్స్ని చూస్తున్నా. మంచి టాలెంట్‌ని తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తున్నారు. మార్కెట్ మహాలక్ష్మిలో నన్ను ఆదరిస్తారని నమ్మకం ఉంది' అని అన్నారు. ముక్కు అవినాష్ మాట్లాడుతూ.. "మార్కెట్ మహాలక్ష్మిలో నేను రెగ్యులర్ ఫ్రెండ్ క్యారెక్టర్ చేశా. పార్వతీశం, ప్రణీకాన్వికతో నా కాంబినేషన్ సీన్స్ నవ్విస్తాయి. దర్శకుడు నా క్యారెక్టర్ని చాలా బాగా డిజైన్ చేశారు. మార్కెట్ మహాలక్ష్మిని థియేటర్లలో చూసి మా టీమ్‌కి సపోర్ట్ చేయండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శకుడు, నిర్మాతకి థాంక్స్" చెప్పారు. డైరెక్టర్ వీఎస్ ముఖేష్' మాట్లాడుతూ.. ‘నేను కథ రాసుకున్నప్పుడు టైటిల్ వెంటనే తట్టింది మార్కెట్ మహాలక్ష్మి. అప్పుడే ఫిక్స్ అయ్యా. విజయ్ దేవరకొండ, విశ్వక్ సేన్ లాంటి హీరోలు, సాయి పల్లవి లాంటి హీరోయిన్లు అయితే బాగుంటుంది. కానీ బడ్జెట్ పరిమితుల కారణంగా తీసుకోలేకపోయామని తెలిపారు. కాగా.. ఈ చిత్రంలో హర్ష వర్ధన్, మహబూబ్ బాషా, ముక్కు అవినాష్, కేదార్ శంకర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి జో ఎన్మవ్ సంగీతమందిస్తున్నారు. -
వాలంటైన్స్ డే స్పెషల్: తెలుసా మనసా నుంచి మెలోడీ సాంగ్
‘కేరింత’ ఫేమ్ పార్వతీశం హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ తెలుసా మనసా. డెబ్యూ డైరెక్టర్ వైభవ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో జష్విక హీరోయిన్గా నటిస్తోంది. న్యూ ఏజ్ ప్లాటోనిక్ లవ్‌స్టోరిగా ఈ చిత్రాన్ని శ్రీ బాలాజీ పిక్చర్స్ బ్యానర్‌పై వర్షా ముండాడ, మాధవి నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ మెలోడీ సాంగ్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. వాల్తేరు వీరయ్య డైరెక్టర్ బాబీ ఈ పాటను తాజాగా లాంచ్ చేశారు. అనంతరం ఆయన మాటాడుతూ.. ఈ పాట విన్నానని, చాలా బాగుందన్నారు. న్యూ ఏజ్ ప్లాటోనిక్ లవ్‌స్టోరిగా వస్తున్న ఈ చిత్రం మంచి విజయం సాధించాలని కోరుకుంటూ చిత్ర యూనిట్‌కి అభినందనలు తెలిపారు. ‘మనసు మనసుతో..’ అంటూ మెలోడియస్గా సాగే ఈ పాట సంగీత ప్రియులను బాగా ఆకట్టుకుంటోంది. నేషనల్ అవార్డ్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ గోపీ సుందర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. మరోసారి ఈ పాటలో ఆయన తనదైన మార్క్ చూపించారు. వాలెంటైన్స్ డే సందర్భంగా.. నిజమైన ప్రేమలోని లోతును ఆవిష్కరించేలా, హృదయానికి హత్తుకునేలా ఉంది ఈ పాట. వనమాలి రాసిన ఈ పాటను శ్రీకృష్ణ అద్భుతంగా ఆలపించారు. ప్రసాద్ ఈదర సినిమాటోగ్రఫీ ఈ పాటకు మరింత అందాన్నిచ్చింది. -
‘కేరింత’ఫేమ్ పార్వతీశం హీరోగా కొత్త చిత్రం
కేరింత ఫేమ్ పార్వతీశం, ఐశ్యర్య హీరో హీరోయిన్లుగా ఓ చిత్రం తెరకెక్కుతుంది. ‘దేవరకొండలో విజయ్ ప్రేమకథ’ చిత్రంతో దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న వెంకటరమణ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు.వేదుల బాలకామేశ్వరి సమర్పణలో సాయి సిద్ధార్థ మూవీ మేకర్స్ సంస్థ తమ ప్రొడక్షన్ నెం 1గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సిద్ధార్థ హరియాల, శ్రీమతి తాలబత్తుల మాధవి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ నెల 25 నుంచి రెగ్యులర్ చిత్రీకరణ ప్రారంభిస్తున్నారు. కాకినాడ, యానాం పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ జరపనున్నారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు వెంకటరమణ ఎస్. మాట్లాడుతూ...ప్రతి మనిషి గౌరవంగా బతకాలి, గౌరవంగా మరణించాలి అని భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 20 చెబుతోంది. అయితే దీనికి భిన్నంగా నేటి సమాజంలో పరిస్థితులు ఉన్నాయి. ఆ పరిస్థితులు మారాలి, ఆర్టికల్ 20 స్ఫూర్తిని కాపాడుకోవాలి అని చెప్పే చిత్రమిది. మంచి సామాజిక సందేశంతో పాటు ఓ విభిన్నమైన ప్రేమకథను ఈ సినిమాలో చూపిస్తున్నాం. అన్నారు. ‘సమాజాన్ని, సమాజాన్ని పాలించే ప్రజా ప్రతినిధులను ప్రశ్నించే చిత్రమిది. సామాజిక సందేశాన్ని ప్రేమకథతో మిళితం చేసి ఓ మంచి చిత్రాన్ని నిర్మిస్తుండటం సంతోషంగా ఉంది’అని నిర్మాత సిద్దార్థ హరియాల అన్నారు. రామరాజు, చక్రపాణి, రంగస్థలం లక్ష్మి తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. -
60 ఏళ్ల మహిళకు..20 ఏళ్ల కుర్రాడితో పెళ్లి
హాస్యనటిగా ఎన్నో పాత్రల్లో ప్రేక్షకులను నవ్వించిన శ్రీలక్ష్మి టైటిల్ రోల్ చేసిన తాజా చిత్రం ‘సావిత్రి వైఫ్ ఆఫ్ సత్యమూర్తి’. ‘కేరింత’లో నూకరాజు పాత్రలో ఆకట్టుకున్న పార్వతీశం హీరో. అరవయ్యేళ్ల మహిళకు పాతికేళ్ల కుర్రాడు ఎలా భర్త అయ్యాడు? వాళ్లిద్దరూ ఎందుకు పెళ్లి చేసుకున్నారు? అనే కథాంశంతో రూపొందిన చిత్రం ఇది. గోగుల నరేంద్ర నిర్మించిన ఈ సినిమా ద్వారా పూరి జగన్నాథ్ శిష్యుడు చైతన్య కొండ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఆగస్టు మూడో వారంలో సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు. గోగుల నరేంద్ర మాట్లాడుతూ– ‘‘కుటుంబం అంతా కలిసి చూడదగ్గ మంచి వినోదాత్మక చిత్రమిది. పార్వతీశం, శ్రీలక్ష్మిగారి జంట నవ్వులు పూయిస్తుంది. ఈ సినిమాతో ముగ్గురు కొత్త కథానాయికలను పరిచయం చేస్తున్నాం. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: సత్య కశ్యప్, కెమెరా: ఆనంద్ డోల. -
ఆపరేషన్ ముగిసింది
ఆపరేషన్ గోల్డ్ ఫిష్ ముగిసింది. మరి.. ఎలాంటి ఫలితాలు వచ్చాయి? ఈ ఆపరేషన్ ఎవరి కోసం? అనే విషయాలు తెలుసుకోవాలంటే ‘ఆపరేషన్ గోల్డ్ ఫిష్’ సినిమా చూడాల్సిందే. ఆది సాయికుమార్, శషా చెట్రి, కార్తీక్ రాజు, పార్వతీశం, నిత్యా నరేశ్, మనోజ్ నందం, అబ్బూరి రవి, అనీశ్, రావు రమేష్ కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రానికి అడివి సాయికిరణ్ దర్శకుడు. కాగా ఈ సినిమాకి పని చేసిన యూనిట్ సభ్యులందరూ నిర్మాణంలో పాలుపంచుకోవడం విశేషం. ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. ఇందులో కమాండో అర్జున్ పండిట్ పాత్రలో నటించారు ఆది సాయికుమార్. ఆదివారం ఆది పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాలో ఆయన కొత్త లుక్‌ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా సాయికిరణ్ మాట్లాడుతూ– ‘‘ఆది ఫస్ట్ లుక్కు విశేష స్పందన లభించింది. వాస్తవ సంఘటనల ఆధారంగా రాసుకున్న ఫిక్షనల్ స్టోరీ ఇది. చాలా కష్టపడి తెరకెక్కించాం. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే టీజర్‌ను విడుదల చేస్తాం. ఆ తర్వాత సినిమా విడుదల తేదీ వివరాలను వెల్లడిస్తాం’’ అన్నారు. దామోదర్ యాదవ్ ఈ సినిమాకు సహ నిర్మాత. కిరణ్ రెడ్డి తుమ్మ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. -
అందరూ నిర్మాతలే
ఆది సాయికుమార్, నిత్యా నరేశ్, పార్వతీశం, శషా చెట్రి ముఖ్య తారలుగా తెరకెక్కుతోన్న చిత్రం ‘ఆపరేషన్ గోల్డ్ ఫిష్’. ‘వినాయకుడు, కేరింత’ వంటి సినిమాలు తెరకెక్కించిన అడవి సాయికిరణ్ దర్శకుడు. ఈ సినిమా నటీనటులు, సాంకేతిక నిపుణులే ఈ చిత్రం నిర్మించడం విశేషం. ఎయిర్టెల్ మోడల్ శషా చెట్రి ఈ చిత్రంతో తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయం అవుతున్నారు. మాటలు రచయిత అబ్బూరి రవి ప్రతినాయకుడి పాత్ర చేస్తున్నారు. ‘‘వైవిధ్యమైన కథాంశంతో తెరకెక్కుతోన్న చిత్రమిది. షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. కాశ్మీర్, ఢిల్లీ, లంబసింగి, చింతపల్లి తదితర ప్రాంతాల్లో షూటింగ్ చేస్తున్నాం. ఒక్క షెడ్యూల్ మినహా చిత్రీకరణ పూర్తయింది. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా మా సినిమా ఉంటుంది’’ అని చిత్రబృందం పేర్కొంది. -
బాయ్‌ఫ్రెండ్స్‌తో.... ఆ అమ్మాయి!
‘కుమారి’గా కుర్రకారు హృదయాలకు మంచి కిక్ ఇచ్చిన కథానాయిక హెబ్బా పటేల్ నాయికగా మరో సినిమా షురూ అయింది. లక్కీ మీడియా బ్యానర్‌పై మహాలక్ష్మి, మానస సమర్పణలో భాస్కర్ బండి దర్శకత్వంలో బెక్కెం వేణుగోపాల్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఉగాది నాడు ప్రారంభ మైంది. ‘నేను... నా బాయ్‌ఫ్రెండ్స్’ పేరుతో హెబ్బా పటేల్, పునర్నవి, పార్వతీశం, నోయెల్ ముఖ్యతారలు. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత ‘దిల్’ రాజు కెమెరా స్విచ్చాన్ చేయగా, ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు క్లాప్ ఇచ్చారు. నిర్మాత డి. సురేశ్ బాబు గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా బెక్కెం వేణుగోపాల్ మాట్లాడుతూ- ‘‘ఉగాది పర్వదినం నాడు మా సినిమా ప్రారంభం కావడం ఆనందంగా ఉంది. ‘సినిమా చూపిస్త మావ’ తర్వాత చాలా కథలు విన్నాం. ఏవీ నచ్చలేదు. కానీ నూతన దర్శకుడు భాస్కర్ చెప్పిన కథ నచ్చడంతో అంగీకరించాం’’ అని చెప్పారు. ‘‘దర్శకుడు వి.వి. వినాయక్ గారి దగ్గర పనిచేశాను. యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌కు కూడా కనెక్ట్ అయ్యేలా ఈ చిత్రాన్ని రూపొందిస్తాం’’అని దర్శకుడు భాస్కర్ తెలిపారు. ఈ చిత్రానికి రచన: సాయి కృష్ణ, కెమెరా: విశ్వ డి.బి, సంగీతం: శేఖర్ చంద్ర, అసోసియేట్ ప్రొడ్యూసర్: గంజి రమేశ్‌కుమార్.