Director Bobby Launched Manasu Manasutho Song From Telusa Manasa Movie - Sakshi
Sakshi News home page

Telusa Manasa Movie: వాలంటైన్స్‌ డే స్పెషల్‌.. ఆకట్టుకుంటున్న ‘మనసు మనసుతో’ సాంగ్‌..

Published Tue, Feb 14 2023 7:37 PM | Last Updated on Tue, Feb 14 2023 8:20 PM

Director Bobby Launched Manasu Manasutho Song From Telusa Manasa Movie - Sakshi

‘కేరింత’ ఫేమ్ పార్వ‌తీశం హీరోగా నటిస్తున్న లేటెస్ట్‌ మూవీ తెలుసా మనసా. డెబ్యూ డైరెక్టర్‌ వైభ‌వ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో జ‌ష్విక హీరోయిన్‌గా నటిస్తోంది.  న్యూ ఏజ్ ప్లాటోనిక్ ల‌వ్‌స్టోరిగా ఈ చిత్రాన్ని శ్రీ బాలాజీ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై వ‌ర్షా ముండాడ, మాధ‌వి నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ మెలోడీ సాంగ్‌ను రిలీజ్‌ చేశారు మేకర్స్‌. వాల్తేరు వీరయ్య డైరెక్టర్‌ బాబీ ఈ పాటను తాజాగా లాంచ్‌ చేశారు. అనంతరం ఆయన మాటాడుతూ.. ఈ పాట విన్నానని, చాలా బాగుందన్నారు.

న్యూ ఏజ్ ప్లాటోనిక్ ల‌వ్‌స్టోరిగా వస్తున్న ఈ చిత్రం మంచి విజయం సాధించాలని కోరుకుంటూ చిత్ర యూనిట్‌కి అభినందనలు తెలిపారు. ‘మనసు మనసుతో..’ అంటూ మెలోడియస్‌గా సాగే ఈ పాట సంగీత ప్రియులను బాగా ఆకట్టుకుంటోంది. నేష‌న‌ల్ అవార్డ్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ గోపీ సుంద‌ర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. మ‌రోసారి ఈ పాట‌లో ఆయ‌న త‌న‌దైన మార్క్ చూపించారు. వాలెంటైన్స్ డే సంద‌ర్భంగా.. నిజ‌మైన ప్రేమ‌లోని లోతును ఆవిష్క‌రించేలా, హృద‌యానికి హ‌త్తుకునేలా ఉంది ఈ పాట. వ‌న‌మాలి రాసిన ఈ పాట‌ను శ్రీకృష్ణ అద్భుతంగా ఆల‌పించారు. ప్ర‌సాద్ ఈద‌ర సినిమాటోగ్ర‌ఫీ ఈ పాట‌కు మ‌రింత అందాన్నిచ్చింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement