బాయ్‌ఫ్రెండ్స్‌తో.... ఆ అమ్మాయి! | Nenu Na Boy Friends Hebah Patel New Movie | Sakshi
Sakshi News home page

బాయ్‌ఫ్రెండ్స్‌తో.... ఆ అమ్మాయి!

Published Fri, Apr 8 2016 11:24 PM | Last Updated on Sun, Sep 3 2017 9:29 PM

బాయ్‌ఫ్రెండ్స్‌తో.... ఆ అమ్మాయి!

బాయ్‌ఫ్రెండ్స్‌తో.... ఆ అమ్మాయి!

‘కుమారి’గా కుర్రకారు హృదయాలకు మంచి కిక్ ఇచ్చిన కథానాయిక హెబ్బా పటేల్ నాయికగా మరో సినిమా షురూ అయింది. లక్కీ మీడియా బ్యానర్‌పై మహాలక్ష్మి, మానస సమర్పణలో భాస్కర్ బండి దర్శకత్వంలో బెక్కెం వేణుగోపాల్  నిర్మిస్తున్న ఈ చిత్రం ఉగాది నాడు ప్రారంభ మైంది. ‘నేను... నా బాయ్‌ఫ్రెండ్స్’ పేరుతో హెబ్బా పటేల్, పునర్నవి, పార్వతీశం, నోయెల్ ముఖ్యతారలు. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత ‘దిల్’ రాజు కెమెరా స్విచ్చాన్ చేయగా, ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు క్లాప్ ఇచ్చారు. నిర్మాత డి. సురేశ్ బాబు గౌరవ దర్శకత్వం వహించారు.

ఈ సందర్భంగా బెక్కెం వేణుగోపాల్ మాట్లాడుతూ- ‘‘ఉగాది పర్వదినం నాడు మా సినిమా ప్రారంభం కావడం ఆనందంగా ఉంది. ‘సినిమా చూపిస్త మావ’ తర్వాత చాలా కథలు విన్నాం. ఏవీ నచ్చలేదు. కానీ నూతన దర్శకుడు భాస్కర్ చెప్పిన కథ నచ్చడంతో అంగీకరించాం’’ అని చెప్పారు. ‘‘దర్శకుడు వి.వి. వినాయక్ గారి దగ్గర పనిచేశాను. యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌కు కూడా కనెక్ట్ అయ్యేలా ఈ చిత్రాన్ని రూపొందిస్తాం’’అని దర్శకుడు భాస్కర్ తెలిపారు. ఈ చిత్రానికి రచన: సాయి కృష్ణ, కెమెరా: విశ్వ డి.బి, సంగీతం: శేఖర్ చంద్ర, అసోసియేట్ ప్రొడ్యూసర్: గంజి రమేశ్‌కుమార్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement