Bhaskar Bandi
-
నాన్న.. హెబ్బా..బాయ్‌ఫ్రెండ్స్!
ప్రముఖ దర్శకుడు వీవీ వినాయక్ శిష్యుడు భాస్కర్ బండిని దర్శకునిగా పరిచయం చేస్తూ లక్కీ మీడియా పతాకంపై బెక్కెం వేణుగోపాల్ నిర్మించిన తాజా చిత్రం ‘నాన్న నేను నా బాయ్‌ఫ్రెండ్స్’. రావు రమేశ్, అశ్విన్‌బాబు, హెబ్బా పటేల్, తేజస్వి మడివాడ, పార్వతీశం ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం డిజిటల్ పోస్టర్, ఓ పాటను హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాత వేణుగోపాల్ మాట్లాడుతూ- ‘‘యూత్‌ఫుల్ లవ్, ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన చిత్రమిది. ఈ కథ కోసం ఏడాదిగా కసరత్తు చేశాం. తొలుత ‘దిల్’ రాజుగారికి స్టోరీ వినిపిస్తే, ఆయన కొన్ని మార్పులు చేయమన్నారు. ఫైనల్‌గా ఫస్ట్‌కాపీ చూసిన ఆయన సినిమా బావుందంటూ అభినందించి, మా చిత్రాన్ని విడుదల చేసేందుకు హక్కులు కొనుగోలు చేశారు. గతంలో ‘సినిమా చూపిస్త మావ’ నైజాం హక్కులు ఆయనే సొంతం చేసుకున్నారు. త్వరలో పాటలు, సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అని చెప్పారు. నోయల్, కృష్ణ భగవాన్, సనా, తోటపల్లి మధు, ధనరాజ్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: శేఖర్ చంద్ర, కెమెరా: చోటా కె.నాయుడు. -
బాయ్‌ఫ్రెండ్స్‌తో.... ఆ అమ్మాయి!
‘కుమారి’గా కుర్రకారు హృదయాలకు మంచి కిక్ ఇచ్చిన కథానాయిక హెబ్బా పటేల్ నాయికగా మరో సినిమా షురూ అయింది. లక్కీ మీడియా బ్యానర్‌పై మహాలక్ష్మి, మానస సమర్పణలో భాస్కర్ బండి దర్శకత్వంలో బెక్కెం వేణుగోపాల్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఉగాది నాడు ప్రారంభ మైంది. ‘నేను... నా బాయ్‌ఫ్రెండ్స్’ పేరుతో హెబ్బా పటేల్, పునర్నవి, పార్వతీశం, నోయెల్ ముఖ్యతారలు. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత ‘దిల్’ రాజు కెమెరా స్విచ్చాన్ చేయగా, ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు క్లాప్ ఇచ్చారు. నిర్మాత డి. సురేశ్ బాబు గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా బెక్కెం వేణుగోపాల్ మాట్లాడుతూ- ‘‘ఉగాది పర్వదినం నాడు మా సినిమా ప్రారంభం కావడం ఆనందంగా ఉంది. ‘సినిమా చూపిస్త మావ’ తర్వాత చాలా కథలు విన్నాం. ఏవీ నచ్చలేదు. కానీ నూతన దర్శకుడు భాస్కర్ చెప్పిన కథ నచ్చడంతో అంగీకరించాం’’ అని చెప్పారు. ‘‘దర్శకుడు వి.వి. వినాయక్ గారి దగ్గర పనిచేశాను. యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌కు కూడా కనెక్ట్ అయ్యేలా ఈ చిత్రాన్ని రూపొందిస్తాం’’అని దర్శకుడు భాస్కర్ తెలిపారు. ఈ చిత్రానికి రచన: సాయి కృష్ణ, కెమెరా: విశ్వ డి.బి, సంగీతం: శేఖర్ చంద్ర, అసోసియేట్ ప్రొడ్యూసర్: గంజి రమేశ్‌కుమార్. -
నేను నా బాయ్‌ఫ్రెండ్స్
‘‘నాకు సైట్ కొట్టడానికి ....నా బయోడేటా కావాలా ?’’ అంటూ తన లవర్‌ను కన్ఫ్యూజ్ చేసిన కుమారి గుర్తుంది కదూ! ఆ పాత్రతో హెబ్బా పటేల్ కుర్రకారు కలల రాణి అయిపోయారు. ఇప్పుడామె కథానాయికగా మరో చిత్రం రూపొందుతోంది. ‘సినిమా చూపిస్త మావ’తో ఓ భారీ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్న నిర్మాత బెక్కెం వేణుగోపాల్ ‘నేను నా బాయ్‌ఫ్రెండ్స్’ పేరుతో ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. నిర్మాత మాట్లాడుతూ-‘‘నిర్మాతగా ఇటీవలే పదేళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేశా. కథనే నమ్ముకుని సినిమాలు తీస్తా. ప్రముఖ దర్శకుడు వీవీ వినాయక్ శిష్యుడైన భాస్కర్ బండి చెప్పిన కథ అమితంగా నచ్చడంతో ఈ సినిమా నిర్మిస్తున్నా. ఏప్రిల్ మొదటి వారం నుంచి ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభిస్తాం. ప్రేక్షకులకు ఉత్కంఠ కలిగించే థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని రూపొందించనున్నాం. ఈ కథ కోసం ఏడాది పాటు శ్రమించాం’’ అని తెలిపారు.