నాన్న.. హెబ్బా..బాయ్‌ఫ్రెండ్స్! | Dil Raju acquires distribution rights of Nanna Nenu Naa Boyfriends | Sakshi
Sakshi News home page

నాన్న.. హెబ్బా..బాయ్‌ఫ్రెండ్స్!

Published Thu, Oct 27 2016 10:25 PM | Last Updated on Mon, Sep 4 2017 6:29 PM

నాన్న.. హెబ్బా..బాయ్‌ఫ్రెండ్స్!

నాన్న.. హెబ్బా..బాయ్‌ఫ్రెండ్స్!

ప్రముఖ దర్శకుడు వీవీ వినాయక్ శిష్యుడు భాస్కర్ బండిని దర్శకునిగా పరిచయం చేస్తూ లక్కీ మీడియా పతాకంపై బెక్కెం వేణుగోపాల్ నిర్మించిన తాజా చిత్రం ‘నాన్న నేను నా బాయ్‌ఫ్రెండ్స్’. రావు రమేశ్, అశ్విన్‌బాబు, హెబ్బా పటేల్, తేజస్వి మడివాడ, పార్వతీశం ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం డిజిటల్ పోస్టర్, ఓ పాటను హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాత వేణుగోపాల్ మాట్లాడుతూ- ‘‘యూత్‌ఫుల్ లవ్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన చిత్రమిది. ఈ కథ కోసం ఏడాదిగా కసరత్తు చేశాం. తొలుత ‘దిల్’ రాజుగారికి స్టోరీ వినిపిస్తే, ఆయన కొన్ని మార్పులు చేయమన్నారు.

ఫైనల్‌గా ఫస్ట్‌కాపీ చూసిన ఆయన సినిమా బావుందంటూ అభినందించి, మా చిత్రాన్ని విడుదల చేసేందుకు హక్కులు కొనుగోలు చేశారు. గతంలో ‘సినిమా చూపిస్త మావ’ నైజాం హక్కులు ఆయనే సొంతం చేసుకున్నారు. త్వరలో పాటలు, సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అని చెప్పారు. నోయల్, కృష్ణ భగవాన్, సనా, తోటపల్లి మధు, ధనరాజ్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: శేఖర్ చంద్ర, కెమెరా: చోటా కె.నాయుడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement