
సాయి కుమార్, పార్వతీశం, ఐశ్వర్య, హారిక ముఖ్య తారలుగా సూరపల్లి వెంకటరమణ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘మెర్సీ కిల్లింగ్’. వేదుల బాల కామేశ్వరి సమర్పణలో సిద్దార్థ్ హరియల, మాధవి తాలబత్తుల నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 12న రిలీజ్ కానుంది.
ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో కోన వెంకట్, ఆకాశ్ పూరి అతిథులుగా పాల్గొన్నారు. ‘‘స్వేచ్ఛ అనే అమ్మాయి చుట్టూ తిరిగే ఈ సినిమాలో మంచి పాత్ర చేశాను. మెర్సీ కిల్లింగ్ అంటూ సమాజంలో ఆడవారిపై జరుగుతున్న ఆకృత్యాలను దర్శకుడు కళ్లకు కట్టినట్లు చూపించారు. ప్రతి మహిళ చూడాల్సి సినిమా’’ అన్నారు సాయికుమార్. ‘‘భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ఆధారంగా తెరకెక్కిన చిత్రమిది’’ అన్నారు వెంకటరమణ.
Comments
Please login to add a commentAdd a comment