ప్రస్తుతం 'దేవర' హవా నడుస్తోంది. థియేటర్లలో ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. మరోవైపు ఓటీటీలోనూ 20కి సినిమాలు/వెబ్ సిరీసులు పలు ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఇదలా ఉండగానే మరో చిన్న సినిమా ఎలాంటి హడావుడి లేకుండా ఓటీటీలోకి వచ్చేసింది. కారుణ్య మరణం అనే కాన్సెప్ట్‌తో తీసిన ఈ సినిమా సంగతేంటి? ఏ ఓటీటీలో ఉంది?
(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీలోకి వచ్చేసిన 20 సినిమాలు)
'కేరింత' ఫేమ్ పార్వతీశం, 'జబర్దస్త్' నటి ఐశ్వర్య హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా 'మెర్సీ కిల్లింగ్'. ఏప్రిల్‌లో థియేటర్లలోకి వచ్చింది. పెద్దగా పేరున్న నటీనటులు లేకపోవడం, బడ్జెట్ పరిమితుల వల్ల జనాలకు సరిగా రీచ్ కాలేదు. ఇప్పుడీ చిత్రాన్ని ఆహా ఓటీటీలోకి ఎలాంటి హడావుడి లేకుండా తీసుకొచ్చేశారు.
'మెర్సీ కిల్లింగ్' విషయానికొస్తే.. స్వేచ్ఛ (హారిక) అనాథ అమ్మాయి. తల్లిదండ్రులు ఎవరనేది తెలియక, చిన్నప్పటి నుంచి అవమానాలను ఎదుర్కొంటుంది. పెద్దయ్యాక తన పెరెంట్స్ ఎవరనేది కనుక్కునేందుకు ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలో ఆమెకు మహేశ్(పార్వతీశం), భారతి (ఐశ్వర్య) పరిచయమవుతారు. వీళ్లు స్వేచ్ఛకు ఎలాంటి సహాయం చేశారు? స్వేచ్ఛకు రామకృష్ణం రాజు(సాయి కుమార్)కు సంబంధమేంటి? చివరకు తల్లిదండ్రులని స్వేచ్ఛ కలిసిందా అనేదే స్టోరీ.
(ఇదీ చదవండి: 'దేవర' పార్ట్ 2లో స్టోరీ ఏం ఉండొచ్చు?)
Uncover the truth!
Watch the heart-wrenching tale of a fisherman's family, fighting for justice.▶️https://t.co/JDJ5cDG3Mj#MercyKilling #Justice #LoveStory pic.twitter.com/HJdMT2i3wp— ahavideoin (@ahavideoIN) September 28, 2024
Comments
Please login to add a commentAdd a comment