మరో తెలుగు సినిమా.. ఎలాంటి హడావుడి లేకుండా ఒకేసారి రెండు ఓటీటీల్లోకి వచ్చేసింది. కేవలం రెండే పాత్రలు ప్రధానంగా తీసిన ఈ చిత్రం.. పలు అంతర్జాతీయ చిత్రాత్సోవాల్లో 60కి పైగా అవార్డులు గెలుచుకోవడం విశేషం. థియేటర్లలో రిలీజైనప్పుడు మనోళ్లు పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది కాబట్టి చూసేయొచ్చు. ఇంతకీ ఇది ఏ సినిమా? ఎందులో స్ట్రీమింగ్ అవుతోంది?
నటుడు అయిపోదామనే ఆలోచన, డబ్బే సర్వస్వం అనుకునే ఓ కుర్రాడు.. జీవితం విలువను, ఆనందాన్ని ఎలా తెలుసుకున్నాడు అనే పాయింట్‌తో తీసిన సినిమా 'నరుడు బ్రతుకు నటన'. తెలుగు సినిమానే కానీ మూవీ అంతా కేరళలోనే జరుగుతూ ఉంటుంది. సీన్లలో ఉంటే నేచురాలిటీ చూసి మలయాళ మూవీని భ్రమపడిన ఆశ్చర్యపోనక్కర్లేదు.
(ఇదీ చదవండి: దేవరకొండ ఫ్యామిలీతో 'పుష్ప 2' చూసిన రష్మిక)
శివ రామచంద్రవరపు, నితిన్ ప్రసన్న హీరోలుగా నటించిన ఈ సినిమాకు రిషికేశ్వర్ యోగి దర్శకుడు. శృతి జయన్, ఐశ్వర్య అనిల్ హీరోయిన్లుగా చేశారు. అక్టోబర్ 25న థియేటర్లలో రిలీజ్ కాగా.. గురువారం (డిసెంబరు 6న) ఆహా, అమెజాన్ ప్రైమ్ ఓటీటీల్లోకి ఎలాంటి ప్రకటన లేకుండా వచ్చేసింది.
'నరుడు బ్రతుకు నటన' విషయానికొస్తే.. సినిమా నటుడు కావాలనేది సత్య(శివ రామచంద్రవరపు) డ్రీమ్. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఒక్క అవకాశం రాదు. నటుడు కావాలంటే ముందుగా మనిషిగా మారాలని, ఎమోషన్స్ తెలుసుకోవాలని ఫ్రెండ్ తిట్టేసరికి ఒంటరిగా కేరళ వెళ్లిపోతాడు. డబ్బు కొద్దిరోజుల్లోనే అయిపోతుంది. ఫోన్ దొంగిలిస్తారు. సత్య చేతిలో చిల్లిగవ్వ లేకుండా ఆకలితో అలమటించాల్సిన పరిస్థితి వస్తుంది. అలాంటి కష్ట సమయంలో సత్య జీవితంలోకి సల్మాన్ (నితిన్ ప్రసన్న) వస్తాడు. ఇంతకీ ఇతడెవరు? సల్మాన్ వల్ల సత్య.. జీవితం గురించి ఏం తెలుసుకున్నాడనేదే స్టోరీ.
(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 19 సినిమాలు)
Comments
Please login to add a commentAdd a comment