హీరోయిన్ రష్మిక.. హీరో విజయ్ దేవరకొండతో ప్రేమలో ఉందనే రూమర్స్ చాన్నాళ్లుగా వినిపిస్తున్నాయి. ఇది నిజమేనని అనడానికి ఎప్పటికప్పుడు ఏదో ఓ విషయం కనిపిస్తూనే ఉంటుంది. విజయ్-రష్మిక అప్పుడప్పుడు కలిసి టూర్స్‌కి వెళ్తుంటారు. కానీ ఎవరికి వాళ్లు ఒంటరిగా దిగిన పిక్స్ పోస్ట్ చేస్తుంటారు. వాటిని కలిపి చూస్తే జంటగా వెళ్లారని నెటిజన్లు పట్టేస్తారు.
(ఇదీ చదవండి: 'పుష్ప 2' కలెక్షన్స్.. హిందీలో బన్నీ బ్రాండ్ రికార్డ్!)
కొన్నాళ్ల క్రితం చెన్నైలో జరిగిన 'పుష్ప 2' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పెళ్లి, ప్రియుడి గురించి టాపిక్ రాగానే రష్మిక తెగ సిగ్గుపడిపోయింది. నేను చేసుకోబోయేది ఎవరో మీకు కూడా తెలుసుగా! అని సమాధానమిచ్చింది. అంటే విజయ్ దేవరకొండ అని పరోక్షంగా కన్ఫర్మ్ చేసింది. ఇప్పుడు 'పుష్ప 2' సినిమా దేవరకొండ ఫ్యామిలీతో కలిసి చూసింది.
బుధవారం రాత్రి మూవీ టీమ్‌తో కలిసి ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో సంధ్య థియేటర్‌లో సినిమా చూసిన రష్మిక.. గురువారం సాయంత్రం ఏఎంబీలో విజయ్ దేవరకొండ తల్లి, తమ్ముడితో కలిసి సినిమా చూసింది. ఈ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇన్నాళ్లు విజయ్ కుటుంబాన్ని కలిసినప్పటికీ ఎప్పుడు ఇలా బయటపడలేదు. కానీ ఇప్పుడు సినిమాని కలిసి చూడటం లాంటివి చూస్తుంటే త్వరలో విజయ్-రష్మిక గుడ్ న్యూస్ చెప్పేస్తారేమో అనిపిస్తుంది.
(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 19 సినిమాలు)
Comments
Please login to add a commentAdd a comment