
మరో వారం వచ్చేసింది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో పరీక్షల హడావుడి నడుస్తోంది. ఈ క్రమంలోనే ఈ వారం థియేటర్లలోకి 'కోర్ట్', 'దిల్ రుబా' అనే తెలుగు చిత్రాలతో పాటు 'ఆఫీసర్ ఆన్ డ్యూటీ' అనే డబ్బింగ్ మూవీ రిలీజ్ అవుతోంది. మరోవైపు 'యుగానికి ఒక్కడు' ఈ వారమే రీ రిలీజ్ కానుంది.
(ఇదీ చదవండి: నిశ్చితార్థం చేసుకున్న 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' నటి)
ఇవి కాకుండా ఓటీటీల్లోకి కేవలం 9 సినిమాలు-వెబ్ సిరీసులు మాత్రమే స్ట్రీమింగ్ కాబోతున్నాయి. వీటిలో అఖిల్ 'ఏజెంట్', రామం రాఘవం, రేఖాచిత్రం చిత్రాలు కాస్త ఆసక్తి రేపుతున్నాయి. ఇంతకీ ఏయే మూవీస్ ఏ ఓటీటీల్లోకి రాబోతున్నాయంటే?
ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (మార్చి 10-16 వరకు)
సోనీ లివ్
ఏజెంట్ (తెలుగు సినిమా) - మార్చి 14
అమెజాన్ ప్రైమ్
వీల్ ఆఫ్ టైమ్ 3 (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ) - మార్చి 13
బీ హ్యాపీ (హిందీ మూవీ) - మార్చి 14
ఒరు జాతి జాతికమ్ (మలయాళ సినిమా) - మార్చి 14
నెట్ ఫ్లిక్స్
అమెరికన్ మ్యాన్ హంట్ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ) - మార్చి 10
హాట్ స్టార్
పొన్ మ్యాన్ (మలయాళ సినిమా) - మార్చి 14
మోనా 2 (ఇంగ్లీష్ మూవీ) - మార్చి 14
జీ5
వనవాస్ (హిందీ సినిమా) - మార్చి 14
సన్ నెక్స్ట్
- రామం రాఘవం (తెలుగు మూవీ) - మార్చి 14
ఆహా
- రేఖాచిత్రం (తెలుగు సినిమా) - మార్చి 14
ఆపిల్ టీవీ ప్లస్
డోప్ థీప్ (ఇంగ్లీష్ సిరీస్) - మార్చి 14
(ఇదీ చదవండి: గోదావరిలో అస్థికలు కలిపిన యాంకర్ రష్మీ)
Comments
Please login to add a commentAdd a comment