
ఎప్పటిలానే మరో వారం వచ్చేసింది. గతవారంలానే ఈసారి కూడా పెద్దగా చెప్పుకోదగ్గ మూవీస్ ఏం లేవు. ఉన్నంతలో సందీప్ కిషన్-రావు రమేశ్ నటించిన 'మజాకా'.. కాస్త ఆసక్తి రేపుతోంది. దీంతో పాటు తకిటి తదిమి తందాన, శబ్దం,అగాథియా తదితర చిత్రాలు థియేటర్లలో రిలీజ్ కానున్నాయి.
(ఇదీ చదవండి: నటికి ఏడు సార్లు అబార్షన్ కేసులో మరోసారి నటుడిపై విచారణ)
మరోవైపు ఓటీటీల్లో 11 వరకు పలు సినిమాలు-వెబ్ సిరీసులు ఈ వారం స్ట్రీమింగ్ కానున్నాయి. వీటిలో సుడాల్ సీజన్ 2, డబ్బా కార్టెల్, ఆశ్రమ్ తదితర వెబ్ సిరీసులు ఇంట్రెస్ట్ కలిగిస్తున్నాయి. మరి ఏయే ఓటీటీల్లో ఏది రిలీజ్ కానుందంటే?\
ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (ఫిబ్రవరి 24 - మార్చి 1)
నెట్‌ఫ్లిక్స్
డబ్బా కార్టెల్ (తెలుగు డబ్బింగ్ సిరీస్) - ఫిబ్రవరి 28
అమెజాన్ ప్రైమ్
జిద్దీ గర్ల్స్ (హిందీ సిరీస్) - ఫిబ్రవరి 27
హౌస్ ఆఫ్ డేవిడ్ (ఇంగ్లీష్ సిరీస్) ఫిబ్రవరి 27
సుడల్ సీజన్ 2 (తెలుగు డబ్బింగ్ సిరీస్) - ఫిబ్రవరి 28
సూపర్ బాయ్స్ ఆప్ మాలేగావ్ (హిందీ మూవీ) - ఫిబ్రవరి 28
హాట్‌స్టార్
సూట్స్: లాస్ ఏంజిల్స్(ఇంగ్లీష్ సిరీస్) - ఫిబ్రవరి 24
బీటిల్ జ్యూస్ (ఇంగ్లీష్ మూవీ) - ఫిబ్రవరి 28
లవ్ అండర్ కన్‌స్ట్రక్షన్ (మలయాళ సిరీస్) - ఫిబ్రవరి 28
ది వాస్ప్ (ఇంగ్లీష్ సినిమా) - ఫిబ్రవరి 28
సైనా ప్లే
స్వర్గం (మలయాళ మూవీ) - ఫిబ్రవరి 24
ఎంఎక్స్ ప్లేయర్
ఆశ్రమ్ 3 పార్ట్ 2 (హిందీ సిరీస్) - ఫిబ్రవరి 27
(ఇదీ చదవండి: విజయ్ సేతుపతి భారీ సాయం.. ఆయన పేరుతోనే నిర్మిస్తాం: ఆర్కే సెల్వమణి)
Comments
Please login to add a commentAdd a comment