
బిగ్ బాస్ ఫేమ్ అర్చన, మితాలి చౌహాన్, వినోద్ అల్వా, కలకేయ ప్రభాకర్, బాలగం సంజయ్, నాగ మహేష్ ముఖ్య పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘కర్మస్థలం’. రాకీ షెర్మన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని రాయ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై శ్రీనివాస్ సుబ్రహ్మణ్య నిర్మించారు. తాజాగా ఈ చిత్రం మోషన్ పోస్టర్‌ని హీరో ఆకాష్ పూరి రిలీజ్ చేశారు. ముఖ్య అతిధులుగా ఆకాష్ పూరితో పాటు మరో హీరో విజయ్ శంకర్ పాల్గొన్నారు
ఈ కార్యక్రమంలో ఆకాష్ పూరి మాట్లాడుతూ..."కర్మస్థలం" అనే టైటిల్ చాలా చాలా బాగుంది.మోషన్ పోస్టర్ కూడా బాగుంది.చెప్పాలంటే నేను కూడా అమ్మవారి భక్తుడిని.ఇలా అమ్మవారి గురించి సినిమా రావడం సువర్ ఎక్ససైటింగ్.ఈ మధ్య హనుమాన్, కార్తికేయ,కాంతారా ఇలాంటి సినిమాలని ఆడియన్స్ బాగా సపోర్ట్ చేస్తున్నారు. బాగున్న సినిమాలను మన తెలుగు ఆడియన్స్ ఎపుడు ముందుండి ముందుకి తీసుకెళ్తారు.ఈ సినిమాని ని కూడా ముందుకు తీసుకెళ్తారు.ప్రొడ్యూసర్ గారికి హాట్స్ ఆఫ్ ఇలాంటి యంగ్ డైరెక్టర్స్ కి ఛాన్స్ ఇచ్చినందుకు.నేను కర్మ ని నమ్ముతాను. మనం మంచి చేస్తే మంచి జరుగుతుంది అలానే చెడు చేస్తే చేడు జరుగుతుంది అని నమ్ముతాను.ఇలాంటి కథ చేయాలి అని నాకు ఉంది’అన్నారు.
విజయ్ శంకర్ మాట్లాడుతూ..మూవీ తీయడం ఎంత ముఖ్యమో పది మందికి తెలిసేలా చేయడం కూడా అంతే ముఖ్యం. మన టాలీవుడ్ లో మూవీస్ బాగా చేస్తున్నారు కానీ ప్రమోషన్స్ టైం లో డ్రాప్ అయిపోతున్నారు. ఈ మూవీ కి ఆలా కాకుండా ప్రమోషన్స్ మీద టైం పెట్టండి మంచి బ్లాక్ బస్టర్ సొంతం చేసుకుంటారు. మిలో ఆ కసి కనిపించింది.మన టాలీవుడ్ లో చాలా మంది మంచి డైరెక్టర్స్ వున్నారు, వాళ్లకి కానీ మంచి ప్రోడుసెర్స్ దొరికితేయ్ రాజమౌళి, సుకుమార్ గారి లాగ సక్సెస్ అవుతారు.ఈ సినిమా మంచి సక్సెస్ అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్నారు.
రాకీ డెబ్యూ డైరెక్టర్ అయినప్పటికీ విజువల్స్ పరంగా చూస్తే ఒక పెద్ద సినిమా లాగ చేసారు.చిన్న గా స్టార్ట్ అయ్యి ఇంత పెద్ద ప్రాజెక్ట్ గా తీర్చి దిద్దారు.ఒక సీక్రెట్ ఏంటి అంటే ఇందులో రాకీ గారు కూడా ఒక మంచి రోల్ చేసారు, డైరెక్షన్ చేస్తూ కూడా.ఇపుడే స్టార్ట్ చేసాం ఇంకా చాలా కంటెంట్ వుంది. అందరికి ఈ సినిమా నచుతుంది అని నమ్ముతున్నాను. చాలా థాంక్స్. అన్నారు.
మనం సాధారణంగా ఎలాంటి పండగ వచ్చిన ఎంజాయ్ చేస్తూ ఉంటాం. దాని వెనకాల ఒక హిస్టరీ, వార్ ఇలా చాలా ఉన్నాయి.ఇందులో ఒక మంచి లైన్ చెప్పాను అదే మహిసాసుర మర్ధిని.సినిమా అందరికి నచ్చుతుందనే నమ్మకం ఉంది’ అని డైరెక్టర్ రాకీ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment