Andhra Pori
-
సినిమా కోసం ఆకాశ్ ఏమైనా చేస్తాడు : ప్రకాశ్‌రాజ్
‘‘ఆకాశ్‌కు ‘ధోని’ సినిమా టైంలోనే సినిమాపై ఎంత పేషన్ ఉందో తెలిసింది. సినిమా కోసం తను ఏం చేయడానికైనా రెడీగా ఉంటాడు ’’ అని ప్రకాశ్‌రాజ్ చెప్పారు. ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ తనయుడు ఆకాశ్ పూరి ,ఉల్కా గుప్తా జంటగా ప్రసాద్ ప్రొడక్షన్స్ పతాకంపై ఎ.రమేశ్‌ప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం ‘ఆంధ్రాపోరి’. రాజ్ మాదిరాజు దర్శకుడు. జోశ్యభట్ల స్వరపరిచిన ఈ సినిమా పాటల వేడుక హైదరాబాద్‌లో జరిగింది. దర్శకుడు శేఖర్‌కమ్ముల బిగ్ సీడీని ఆవిష్కరించి, తొలి సీడీని ప్రకాశ్‌రాజ్‌కు అందించారు. ఈ సినిమా ఘనవిజయం సాధించాలని శేఖర్ కమ్ముల ఆకాంక్షించారు. ‘‘టైటిల్ వింటుంటే సినిమా సరదాగా ఉంటుందని తెలుస్తోంది. ఈ సినిమాతో చిత్ర బృందానికి మంచి పేరు రావాలి’’ అని నటులు రాజేంద్రప్రసాద్ అన్నారు. రమేశ్ ప్రసాద్ మాట్లాడుతూ -‘‘మా సంస్థలో వస్తున్న 30వ సినిమా ఇది. ఆకాశ్ చాలా బాగా నటించారు’’ అని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆకాశ్, ఉల్కా గుప్తా, నందకిశోర్, నందు, బీవీఎస్ రవి తదితరులు పాల్గొన్నారు. -
అందమైన ప్రేమ
ఇరవై రెండేళ్ళ క్రితం 1993లో జరిగిన ఓ అందమైన ప్రేమకథగా తెరకెక్కిన చిత్రం ‘ఆంధ్రా పోరి’. ప్రసాద్ ప్రొడక్షన్స్ పతాకంపై పూరి ఆకాశ్, ఉల్కా గుప్తా జంటగా రమేశ్ ప్రసాద్ నిర్మించారు. రాజ్ మాదిరాజు దర్శకుడు. మరాఠీ చిత్రం ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ వేడుకమే నెల 2న జరగనుంది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ -‘‘60 ఏళ్ల చరిత్ర ఉన్న ప్రసాద్ ప్రొడక్షన్స్‌లో సినిమా చేయడం ఆనందంగా ఉంది. పూరి జగన్నాథ్‌గారు ఈ కథపై నమ్మకంతో ఆకాశ్‌ను మాకు అప్పగించారు. మాకు బాగా సపోర్ట్ కూడా ఇచ్చారు. ఈ చిత్రాన్ని 35 రోజుల్లో సింగిల్ షెడ్యూల్లో పూర్తి చేశాం. డా.జోశ్యభట్ల స్వరపరచిన పాటలు అద్భుతంగా ఉంటాయి. ఆకాశ్ బ్రహ్మాండంగా నటించాడు’’ అని చెప్పారు. -
అలాగైతే నువ్వు ఆర్టిస్ట్‌వి కాదన్నారు నాన్న : ఆకాశ్ పూరి
‘‘మరాఠీ చిత్రాల ఆధారంగా గతంలో తెలుగులో చాలా సినిమాలు రూపొందాయి. మా సంస్థ నుంచి వచ్చిన ‘వదినగారి గాజులు’ కూడా ఓ మరాఠీ చిత్రం ఆధారంగా చేసినదే. ఇప్పుడీ ‘ఆంధ్రా పోరీ’ మరాఠీలో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న ‘టైమ్ పాస్’కి రీమేక్. దర్శకుడు అద్భుతంగా తెరకెక్కించాడు. ఆకాశ్, ఉల్కా బాగా నటించారు. ఇలాంటి చిత్రాలను ఆదరిస్తే భవిష్యత్తులో మంచి చిత్రాలొస్తాయి’’ అని రమేశ్ ప్రసాద్ అన్నారు. పూరి జగన్నాథ్ తనయుడు ఆకాశ్, ఉల్కా గుప్తా జంటగా ప్రసాద్ ప్రొడక్షన్ పతాకంపై రాజ్ మాదిరాజు దర్శకత్వంలో రమేశ్ ప్రసాద్ నిర్మించిన చిత్రం ‘ఆంధ్రా పోరి’. మే 15న ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. ‘‘ఇదొక అందమైన టీనేజ్ లవ్‌స్టోరీ’’ అని దర్శకుడు పేర్కొన్నారు. ఆకాశ్ పూరి మాట్లాడుతూ -‘‘నువ్వీ సినిమా చేయకపోతే ఆర్టిస్టువి కాదని నాన్నగారు అన్నారు. అందుకే చేశా. ఈ చిత్రం కోసం తెలంగాణ యాస నేర్చుకున్నా’’ అన్నారు. జోస్యభట్ల, చంద్రకిరణ్, రాజీవ్ నాయర్, శ్రీకాంత్ తదితరులు మాట్లాడారు. -
మరాఠీ నుంచి...
ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ తనయుడు ఆకాశ్ పూరీ హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘ఆంధ్రా పోరి’. ఉల్కా గుప్తా కథానాయిక. ప్రసాద్ ప్రొడక్షన్స్ పతాకంపై రమేశ్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాజ్ మాదిరాజు దర్శకుడు. ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని, విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా రమేశ్ ప్రసాద్ మాట్లాడుతూ - ‘‘మరాఠీ లో వచ్చిన ‘టైంపాస్’ చిత్రానికి రీమేక్ గా ఈ చిత్రాన్ని రూపొందించాం. దర్శకుడు కమిట్మెంట్తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. తప్పకుండా అందరినీ ఆక ట్టుకుంటుంది’’ అని చెప్పారు. పాల్వంచ, భద్రాచలం పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ చే శామని ఆకాశ్ పూరీ తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: డా.జె, ఎడిటింగ్: శ్రీకర్ ప్రసాద్, కెమెరా: ప్రవీణ్ వనమాలి. -
ఆకాశ్ హీరోగా ఆంధ్రా పోరి!