సినిమా కోసం ఆకాశ్ ఏమైనా చేస్తాడు : ప్రకాశ్‌రాజ్ | Andhra Pori Audio Launched | Sakshi
Sakshi News home page

సినిమా కోసం ఆకాశ్ ఏమైనా చేస్తాడు : ప్రకాశ్‌రాజ్

Published Sat, May 9 2015 12:21 AM | Last Updated on Sun, Sep 3 2017 1:40 AM

ఉల్కా గుప్తా, ఆకాశ్, ప్రకాశ్‌రాజ్, శేఖర్ కమ్ముల, రాజ్ మాదిరాజు, జోశ్య భట్ల

ఉల్కా గుప్తా, ఆకాశ్, ప్రకాశ్‌రాజ్, శేఖర్ కమ్ముల, రాజ్ మాదిరాజు, జోశ్య భట్ల

‘‘ఆకాశ్‌కు ‘ధోని’ సినిమా టైంలోనే సినిమాపై ఎంత పేషన్ ఉందో తెలిసింది. సినిమా కోసం తను ఏం చేయడానికైనా రెడీగా ఉంటాడు ’’ అని ప్రకాశ్‌రాజ్ చెప్పారు. ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ తనయుడు ఆకాశ్ పూరి ,ఉల్కా గుప్తా జంటగా ప్రసాద్ ప్రొడక్షన్స్ పతాకంపై  ఎ.రమేశ్‌ప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం ‘ఆంధ్రాపోరి’. రాజ్ మాదిరాజు దర్శకుడు. జోశ్యభట్ల స్వరపరిచిన ఈ సినిమా పాటల వేడుక హైదరాబాద్‌లో జరిగింది. దర్శకుడు శేఖర్‌కమ్ముల బిగ్ సీడీని ఆవిష్కరించి, తొలి సీడీని ప్రకాశ్‌రాజ్‌కు అందించారు.

ఈ సినిమా ఘనవిజయం సాధించాలని శేఖర్ కమ్ముల ఆకాంక్షించారు. ‘‘టైటిల్ వింటుంటే సినిమా సరదాగా ఉంటుందని తెలుస్తోంది. ఈ సినిమాతో చిత్ర బృందానికి మంచి పేరు రావాలి’’ అని  నటులు రాజేంద్రప్రసాద్ అన్నారు. రమేశ్ ప్రసాద్ మాట్లాడుతూ -‘‘మా సంస్థలో వస్తున్న 30వ సినిమా ఇది. ఆకాశ్ చాలా బాగా నటించారు’’ అని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆకాశ్, ఉల్కా గుప్తా, నందకిశోర్, నందు, బీవీఎస్ రవి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement