Ulka Gupta
-
‘రుద్రమదేవి’ బాలనటి ఇప్పుడేం చేస్తుందో తెలుసా?
వెబ్ సిరీస్‌లలో ట్రెండింగ్‌లో ఉన్న సిరీస్.. తెలుగు ఆంథాలజీ ‘మోడర్న్ లవ్ హైదరాబాద్’. అందులో నటించిన మహామహులు సుహాసిని, రేవతి.. నేటి స్టార్స్ నిత్యామీనన్, రీతూ వర్మలతో పాటుగా వినిపిస్తున్న పేరు ఉల్కా గగన్ గుప్తా. ఈ సిరీస్ కన్నా ముందే తెలుగు తెరకు ఆమె పరిచయం.. ‘ఆంధ్రాపోరి’ సినిమాతో. ఇంకొన్ని వివరాలు ఈ ‘కాలమ్’లో.. ఉల్కా పుట్టింది, పెరిగింది ముంబైలో. తల్లిదండ్రులు.. మంజు గుప్తా, గగన్ గుప్తా. తండ్రి కూడా నటుడే. నిజానికి ఉల్కా ఐఏఎస్ ఆఫీసర్ కాలనుకుంది. కానీ సినిమా రంగంతో సంబంధమున్న వాతావరణంలో పుట్టి, పెరగడంతో ఆమె ఆసక్తి, అభిరుచి నటనవైపు మళ్లింది. తన ఎనిమిదవ ఏట.. ‘రేషమ్ డంఖ్’ అనే టీవీ సిరియల్‌తో యాక్టింగ్ ఫీల్డ్‌లోకి వచ్చింది. ‘రాణి లక్ష్మీబాయి’ సీరియల్లో చిన్నప్పటి లక్ష్మీబాయిగా నటించి దేశమంతా పాపులర్ అయింది. ఆ పాత్ర కోసం గుర్రపు స్వారీ, కత్తి యుద్ధం, సంస్కృతం నేర్చుకుంది. ఆ సీరియల్ తర్వాత క్షణం తీరికివ్వనన్ని అవకాశాలు ఆమె ఇంటి ముందు క్యూ కట్టాయి. వాటిలో ఒకటి తెలుగులో వచ్చిన రుద్రమదేవి సినిమా కూడా. అందులో చిన్నప్పటి రుద్రమదేవిగా మెప్పించింది. ఓ వైపు చదువుకుంటూనే ఇంకో వైపు యాక్టింగ్ కెరీర్ కొనసాగించింది. హీరోయిన్గా వెండి తెరకు పరిచయం అయింది తెలుగు చిత్రం ‘ఆంధ్రాపోరి’తోనే. ఆ తర్వాతనే బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది ‘ట్రాఫిక్’ అనే సినిమాతో. అటు సినిమాలు.. ఇటు టెలివిజన్ ప్రేక్షకులనే కాదు ఇప్పుడు వెబ్ స్క్రీన్ వీక్షకులనూ అలరిస్తోంది ఉల్కా. నటనంటే ప్రాణం. అందుకే ఏ పాత్రయినా సరే.. మనసుపెట్టి నటిస్తానంటోంది ఉల్కా. View this post on Instagram A post shared by Ulka (@ulkagupta) చదవండి: ఆ సంస్థకు భారీ మొత్తంలో డబ్బులిచ్చా.. సమంత షాకింగ్ కామెంట్స్ ఆ గ్యాప్‌లో నన్ను నేను తెలుసుకున్నాను -
సినిమా కోసం ఆకాశ్ ఏమైనా చేస్తాడు : ప్రకాశ్‌రాజ్
‘‘ఆకాశ్‌కు ‘ధోని’ సినిమా టైంలోనే సినిమాపై ఎంత పేషన్ ఉందో తెలిసింది. సినిమా కోసం తను ఏం చేయడానికైనా రెడీగా ఉంటాడు ’’ అని ప్రకాశ్‌రాజ్ చెప్పారు. ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ తనయుడు ఆకాశ్ పూరి ,ఉల్కా గుప్తా జంటగా ప్రసాద్ ప్రొడక్షన్స్ పతాకంపై ఎ.రమేశ్‌ప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం ‘ఆంధ్రాపోరి’. రాజ్ మాదిరాజు దర్శకుడు. జోశ్యభట్ల స్వరపరిచిన ఈ సినిమా పాటల వేడుక హైదరాబాద్‌లో జరిగింది. దర్శకుడు శేఖర్‌కమ్ముల బిగ్ సీడీని ఆవిష్కరించి, తొలి సీడీని ప్రకాశ్‌రాజ్‌కు అందించారు. ఈ సినిమా ఘనవిజయం సాధించాలని శేఖర్ కమ్ముల ఆకాంక్షించారు. ‘‘టైటిల్ వింటుంటే సినిమా సరదాగా ఉంటుందని తెలుస్తోంది. ఈ సినిమాతో చిత్ర బృందానికి మంచి పేరు రావాలి’’ అని నటులు రాజేంద్రప్రసాద్ అన్నారు. రమేశ్ ప్రసాద్ మాట్లాడుతూ -‘‘మా సంస్థలో వస్తున్న 30వ సినిమా ఇది. ఆకాశ్ చాలా బాగా నటించారు’’ అని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆకాశ్, ఉల్కా గుప్తా, నందకిశోర్, నందు, బీవీఎస్ రవి తదితరులు పాల్గొన్నారు. -
అందమైన ప్రేమ
ఇరవై రెండేళ్ళ క్రితం 1993లో జరిగిన ఓ అందమైన ప్రేమకథగా తెరకెక్కిన చిత్రం ‘ఆంధ్రా పోరి’. ప్రసాద్ ప్రొడక్షన్స్ పతాకంపై పూరి ఆకాశ్, ఉల్కా గుప్తా జంటగా రమేశ్ ప్రసాద్ నిర్మించారు. రాజ్ మాదిరాజు దర్శకుడు. మరాఠీ చిత్రం ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ వేడుకమే నెల 2న జరగనుంది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ -‘‘60 ఏళ్ల చరిత్ర ఉన్న ప్రసాద్ ప్రొడక్షన్స్‌లో సినిమా చేయడం ఆనందంగా ఉంది. పూరి జగన్నాథ్‌గారు ఈ కథపై నమ్మకంతో ఆకాశ్‌ను మాకు అప్పగించారు. మాకు బాగా సపోర్ట్ కూడా ఇచ్చారు. ఈ చిత్రాన్ని 35 రోజుల్లో సింగిల్ షెడ్యూల్లో పూర్తి చేశాం. డా.జోశ్యభట్ల స్వరపరచిన పాటలు అద్భుతంగా ఉంటాయి. ఆకాశ్ బ్రహ్మాండంగా నటించాడు’’ అని చెప్పారు.