వెబ్ సిరీస్‌లలో ట్రెండింగ్‌లో ఉన్న సిరీస్.. తెలుగు ఆంథాలజీ ‘మోడర్న్ లవ్ హైదరాబాద్’. అందులో నటించిన మహామహులు సుహాసిని, రేవతి.. నేటి స్టార్స్ నిత్యామీనన్, రీతూ వర్మలతో పాటుగా వినిపిస్తున్న పేరు ఉల్కా గగన్ గుప్తా. ఈ సిరీస్ కన్నా ముందే తెలుగు తెరకు ఆమె పరిచయం.. ‘ఆంధ్రాపోరి’ సినిమాతో. ఇంకొన్ని వివరాలు ఈ ‘కాలమ్’లో..
ఉల్కా పుట్టింది, పెరిగింది ముంబైలో. తల్లిదండ్రులు.. మంజు గుప్తా, గగన్ గుప్తా. తండ్రి కూడా నటుడే. నిజానికి ఉల్కా ఐఏఎస్ ఆఫీసర్ కాలనుకుంది. కానీ సినిమా రంగంతో సంబంధమున్న వాతావరణంలో పుట్టి, పెరగడంతో ఆమె ఆసక్తి, అభిరుచి నటనవైపు మళ్లింది. తన ఎనిమిదవ ఏట.. ‘రేషమ్ డంఖ్’ అనే టీవీ సిరియల్‌తో యాక్టింగ్ ఫీల్డ్‌లోకి వచ్చింది. ‘రాణి లక్ష్మీబాయి’ సీరియల్‌లో చిన్నప్పటి లక్ష్మీబాయిగా నటించి దేశమంతా పాపులర్ అయింది. ఆ పాత్ర కోసం గుర్రపు స్వారీ, కత్తి యుద్ధం, సంస్కృతం నేర్చుకుంది. ఆ సీరియల్ తర్వాత క్షణం తీరికివ్వనన్ని అవకాశాలు ఆమె ఇంటి ముందు క్యూ కట్టాయి. వాటిలో ఒకటి తెలుగులో వచ్చిన రుద్రమదేవి సినిమా కూడా. అందులో చిన్నప్పటి రుద్రమదేవిగా మెప్పించింది. ఓ వైపు చదువుకుంటూనే ఇంకో వైపు యాక్టింగ్ కెరీర్ కొనసాగించింది.
హీరోయిన్‌గా వెండి తెరకు పరిచయం అయింది తెలుగు చిత్రం ‘ఆంధ్రాపోరి’తోనే. ఆ తర్వాతనే బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది ‘ట్రాఫిక్’ అనే సినిమాతో. అటు సినిమాలు.. ఇటు టెలివిజన్ ప్రేక్షకులనే కాదు ఇప్పుడు వెబ్ స్క్రీన్ వీక్షకులనూ అలరిస్తోంది ఉల్కా. నటనంటే ప్రాణం. అందుకే ఏ పాత్రయినా సరే.. మనసుపెట్టి నటిస్తానంటోంది ఉల్కా.
చదవండి: ఆ సంస్థకు భారీ మొత్తంలో డబ్బులిచ్చా.. సమంత షాకింగ్ కామెంట్స్
ఆ గ్యాప్‌లో నన్ను నేను తెలుసుకున్నాను
Comments
Please login to add a commentAdd a comment