అందమైన ప్రేమ | Beautiful love story as Andhra pori movie | Sakshi
Sakshi News home page

అందమైన ప్రేమ

Published Fri, Apr 24 2015 11:31 PM | Last Updated on Sun, Sep 3 2017 12:49 AM

అందమైన ప్రేమ

అందమైన ప్రేమ

ఇరవై రెండేళ్ళ క్రితం 1993లో జరిగిన ఓ అందమైన ప్రేమకథగా తెరకెక్కిన చిత్రం ‘ఆంధ్రా పోరి’. ప్రసాద్ ప్రొడక్షన్స్ పతాకంపై పూరి ఆకాశ్, ఉల్కా గుప్తా జంటగా రమేశ్ ప్రసాద్ నిర్మించారు. రాజ్ మాదిరాజు దర్శకుడు. మరాఠీ చిత్రం ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ వేడుకమే నెల 2న జరగనుంది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ -‘‘60 ఏళ్ల చరిత్ర ఉన్న ప్రసాద్ ప్రొడక్షన్స్‌లో సినిమా చేయడం ఆనందంగా ఉంది.

పూరి జగన్నాథ్‌గారు ఈ  కథపై నమ్మకంతో ఆకాశ్‌ను మాకు అప్పగించారు. మాకు బాగా సపోర్ట్ కూడా ఇచ్చారు. ఈ చిత్రాన్ని 35 రోజుల్లో సింగిల్ షెడ్యూల్‌లో పూర్తి చేశాం.  డా.జోశ్యభట్ల స్వరపరచిన పాటలు అద్భుతంగా ఉంటాయి. ఆకాశ్ బ్రహ్మాండంగా నటించాడు’’ అని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement