
Trisha Upcoming Movie The Road With Debutant Director Arun Vaseegaran: ప్రతీకారం తీర్చుకునేందుకు పక్కా ప్లాన్ వేశారు హీరోయిన్ త్రిష. అయితే ఆమె పగ, ప్రతీకారాలు ఎందుకు? ఎవరిపై? అనే సస్పెన్స్ వీడాలంటే మరికొన్ని రోజులు వేచిచూడాలి. త్రిష ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘ది రోడ్’. వి.అరుణ్ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమాకి ‘ది రోడ్’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. 22 సంవత్సరాల క్రితం మధురైలో జరిగిన ఓ వాస్తవ సంఘటన ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది.
ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే మధురైలో ప్రారంభమైంది. తొలి షెడ్యూల్‌ను దాదాపు 50 రోజులు మధురై లొకేషన్స్‌లోనే ప్లాన్ చేశారని తెలిసింది. సంతోష్ ప్రతాప్, షబ్బీర్, మీయా జార్జ్, వివేక్, ఎమ్‌ఎస్ భాస్కర్, వేలా రామ్మూర్తి ఇతర ముఖ్యతారాగణంగా నటిస్తున్న ‘ది రోడ్’ సినిమాను తమిళంతో పాటు ఇతర భాషల్లో కూడా రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారట చిత్రయూనిట్.
చదవండి: గుడ్‌న్యూస్ చెప్పిన త్రిష, కానీ సంతోషంగా లేనంటూ ట్వీట్..