
నరేష్ అగస్త్య, శ్వేత అవస్తి జంటగా వీరభద్రం చౌదరి దర్శకత్వంలో ‘దిల్ వాలా’ సినిమా షురూ అయింది. నబీ షేక్, తూము నర్సింహా పటేల్ నిర్మిస్తున్న ఈ సినిమా శుక్రవారం ప్రారంభమైంది. తొలి సన్నివేశానికి నటుడు అలీ కెమెరా స్విచ్చాన్ చేయగా, దర్శకుడు వీవీ వినాయక్ క్లాప్ ఇచ్చారు. హీరో ‘అల్లరి’ నరేష్ స్క్రిప్ట్‌ని చిత్రయూనిట్‌కి అందించారు. ‘‘మా నిర్మాతలు నబీ షేక్, తూము నర్సింహాగారు తొలి సినిమాగా ‘దిల్‌వాలా’ని నా దర్శకత్వంలో చేయడం హ్యాపీ. సెప్టెంబర్‌లో రెగ్యులర్ షూటింగ్ ఆరంభిస్తాం’’ అన్నారు వీరభద్రం.
‘‘మొదటిసారి ‘దిల్‌వాలా’ లాంటి ఒక కమర్షియల్ సినిమా చేయబోతున్నా’’ అన్నారు నరేష్ అగస్త్య. ‘‘క్రైమ్ కామెడీ జోనర్‌లో ‘దిల్ వాలా’ ఉంటుంది’’ అన్నారు నబీ షేక్. రాజేంద్ర ప్రసాద్, దేవ్ గిల్, అలీ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: అనూప్ రూబెన్స్, కెమెరా: అనిత్.
Comments
Please login to add a commentAdd a comment