
చిరంజీవి టైటిల్ రోల్‌లో రూపొందుతున్న చిత్రం ‘విశ్వంభర’. వశిష్ఠ దర్శకత్వంలో విక్రమ్, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఓ భారీ సెట్‌లో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ సెట్‌కి వెళ్లారు దర్శకుడు వీవీ వినాయక్. దాదాపు 20 ఏళ్ల క్రితం చిరంజీవి హీరోగా వినాయక్ దర్శకత్వం వహించిన ‘ఠాగూర్’ (2003) చిత్రం గుర్తుండే ఉంటుంది. ఈ చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.
అప్పట్నుంచీ చిరంజీవి–వినాయక్ మధ్య మంచి అనుబంధం ఉంది. సోమవారం ‘విశ్వంభర’ సెట్‌కి వెళ్లిన వినాయక్ చిత్రదర్శకుడు వశిష్ఠకి శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు చిరంజీవితో తనుకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. ఇక ఫ్యాంటసీ యాక్షన్ అడ్వెంచరస్‌గా తెరకెక్కుతున్న ‘విశ్వంభర’లో త్రిష, ఆషికా రంగనాథ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 10న విడుదల కానున్న ఈ చిత్రానికి సంగీతం: ఎంఎం కీరవాణి, కెమెరా: ఛోటా కె. నాయుడు.
Comments
Please login to add a commentAdd a comment