డైరెక్టర్‌ వివి వినాయక్‌కు మేజర్‌ సర్జరీ | VV Vinayak Hospitalized News Viral | Sakshi
Sakshi News home page

డైరెక్టర్‌ వివి వినాయక్‌కు మేజర్‌ సర్జరీ

Published Sun, Aug 25 2024 8:15 AM | Last Updated on Sun, Aug 25 2024 11:22 AM

VV Vinayak Hospitalized News Viral

ప్రముఖ సినీ దర్శకుడు వి.వి.వినాయక్‌ అనారోగ్యానికి గురైనట్లు తెలుస్తోంది. టాలీవుడ్‌లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలను తెరకెక్కించిన దర్శకుడిగా ఆయనకు గుర్తింపు ఉంది. కొన్ని నెలలుగా కాలేయానికి సంబంధిత సమస్యలతో ఆయన బాధపడుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ఎల్బీనగర్ కామినేని హాస్పిటల్‌లో ఆయన చికిత్స తీసుకున్నారని నెట్టింట ఒక వార్త వైరల్‌ అవుతుంది. కాలేయానికి సంబంధించి వినాయక్‌కు  మేజర్ సర్జరీ జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉన్నట్లు చెబుతున్నారు. అయితే, ఈ విషయం గురించి ఎలాంటి ప్రకటన ఆయన నుంచి రాలేదు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement